MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • World blood donor day 2022: వీటిని తింటే రక్తం బాగా పెరుగుతుంది..!

World blood donor day 2022: వీటిని తింటే రక్తం బాగా పెరుగుతుంది..!

World blood donor day 2022: ఈ ఏడాది ఈ రోజున ( జూన్ 14) ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ రక్తదానం ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఇది 2004లో ప్రారంభమైంది. 18 నుంచి 60 ఏండ్లు ఉన్న ఏ ఆరోగ్యకరమైన వ్యక్తి అయినా రక్తదానం చేయవచ్చు. కానీ రక్తదానం చేయడానికి మీ శరీరంలో తగినంత రక్తం ఉండాలి. అయితే మీ శరీరంలో రక్తాన్ని పెంచడానికి, హిమోగ్లోబిన్ పెరగడానికి కొన్ని ఆహారాలు ఉపయోగపడతాయి. అవేంటంటే..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 14 2022, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బొప్పాయి ఆకు రసం.. బొప్పాయి యే కాదు.. బొప్పాయి ఆకు రసం కూడా ప్లేట్ లెట్ల (platelets)సంఖ్యను బాగా పెంచుతాయి. బొప్పాయి ఆకుల రసం (Papaya leaf juice) డెంగ్యూ రోగులకు ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.  బొప్పాయి ఆకు రసం మాత్రలు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

దానిమ్మ (Pomegranate)లో పాలీఫెనాల్, యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు ఉంటాయి. ఇవి శక్తివంతమైన Vasodilators. రోజూ 500 మిల్లీలీటర్ల దానిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది.
 

39

ఉల్లిపాయలు (Onions) కూడా రక్తాన్ని పెంచడానికి సహాయపడతాయి. దీనిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలు రక్త ప్రవాహం (Blood flow), సిరలు వెడల్పు కావడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి సిరలు, ధమనులలో మంటను తగ్గిస్తాయి. దీంతో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. 

49

వెల్లుల్లి రసంలో సల్ఫర్, అల్లిసిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మీ రక్త నాళాలను సడలించడం ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. లో బీపీని కూడా నియంత్రిస్తుంది. 
 

59

బచ్చలికూర కూరలో ఇనుము (Iron) పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్లు ఎ, సి వంటి అనేక ఇతర పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బచ్చలికూర రసాన్ని తాగితే రక్తం వేగంగా పెరిగి బరువు నియంత్రణలోకి వస్తుంది.  

69

బీట్ రూట్ (Beat root): బీట్ రూట్ లేదా బీట్ రూట్ జ్యూస్ రక్తాన్ని పెంచడంటో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  బీట్ రూట్ లో అధిక మొత్తంలో నైట్రేట్ ఉంటుంది. దీనిని మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను సడలించి, కండరాల కణజాలానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

79

నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో ఫ్లేవనాయిడ్లతో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇది ధమనులకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

89

టమోటాలు (Tomatoes): ఎరుపు టమోటాలు శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచుతాయి. హిమోగ్లోబిన్ ను సరిగ్గా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి యాంజి యోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ కార్యాచరణను తగ్గించడానికి సహాయపడతాయి. తద్వారా రక్తపోటును అదుపులో ఉంటుంది. 

99

గుమ్మడికాయ విత్తనాలు (Pumpkin seeds): గుమ్మడికాయ విత్తనాలు హిమోగ్లోబిన్ పెరగడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్లు లేదా స్మూతీగా తయారు చేసుకుని లేదా పచ్చిగా తిన్నా రక్తం పెరుగుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved