MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Switch Board Cleaning: స్విచ్ బోర్డ్ తళతళా మెరవాలంటే..ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి

Kitchen Switch Board Cleaning: స్విచ్ బోర్డ్ తళతళా మెరవాలంటే..ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి

Kitchen Switch Board Cleaning: వంటగదిలో స్టవ్ పక్కన ఉండే స్విచ్ బోర్డులు నూనె జిడ్డు, పొగ వల్ల జిడ్డు పట్టేస్తుంటాయి. మురికిగా మారుతుంటాయి. పోనీ తడి గుడ్డతో క్లీన్ చేయాలంటే షాక్ కొడుతుంది. ఈ 3 సింపుల్ స్టెప్స్‌తో మెరిసిపోతాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 17 2026, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జిడ్డు మరకలు పోవాలంటే ఇలా చేయండి.
Image Credit : Chat GPT

జిడ్డు మరకలు పోవాలంటే ఇలా చేయండి.

వంటగదిలో స్టవ్ పక్కన ఉండే స్విచ్ బోర్డులు నూనె జిడ్డు, పొగ వల్ల జిడ్డు పట్టేస్తుంటాయి. రోజూ క్లీన్ చేస్తూ ఉంటే పోతాయి. లేదా ఎప్పుడో ఒకసారి తుడిస్తే మాత్రం జిడ్డుగా, మురికి పేరుకు పోయి ఉంటాయి. వాటిని తుడవాలంటే కాస్త కష్టమే. పోనీ తడి గుడ్డతో క్లీన్ చేయాలంటే షాక్ కొడుతుంది. అందుకే ఈ 3 సింపుల్ స్టెప్స్‌ ఫాలో అయిపోండి. కొత్తవాటిలా మెరిసిపోతాయి.

1. ముందుగా కరెంట్ ఆఫ్ చేయండి

స్విచ్ బోర్డును క్లీన్ చేసే ముందు మెయిన్ స్విచ్ లేదా సర్క్యూట్ బ్రేకర్‌ను ఆఫ్ చేయాలి. కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోదు.

పవర్ కట్ అయిందని టెస్ట్ చేశాకనే క్లీనింగ్ చేయండి. తడి చేతులతో లేదా తడి గుడ్డతో స్విచ్ బోర్డును అస్సలు ముట్టకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
2. పొడి గుడ్డతో దుమ్ము తుడవండి
Image Credit : Social Media

2. పొడి గుడ్డతో దుమ్ము తుడవండి

ముందుగా మెత్తటి, పొడి మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుని స్విచ్ బోర్డుపై ఉన్న దుమ్మును తుడిచేయండి. స్విచ్‌ల మూలల్లో పేరుకుపోయిన మురికిని వదిలించడానికి సాఫ్ట్ డ్రై బ్రష్ వాడొచ్చు. మరో ముఖ్యమైన విషయమేంటంటే..స్విచ్ బోర్డుపై నీళ్లు, సబ్బు నీళ్లు లేదా లిక్విడ్‌ను డైరెక్ట్‌గా స్ప్రే చేయకూడదు.

3. జిడ్డు పోవడానికి క్లాత్ వాడాలి

జిడ్డు ఎక్కువగా ఉంటే, పవర్ ఆఫ్ చేసిన తర్వాతే కాస్త తడిగా ఉన్న గుడ్డతో మాత్రమే ప్లాస్టిక్ భాగాన్ని తుడవాలి. ఆ వెంటనే పొడి గుడ్డతో తడిని తుడిచేయాలి. గుడ్డలో ఎక్కువ నీళ్లు ఉండకూడదు. ఆ నీళ్లు స్విచ్‌ల సందుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

34
కిచెన్ స్విచ్ బోర్డు త్వరగా ఎందుకు మురికి అవుతుంది?
Image Credit : AI Image

కిచెన్ స్విచ్ బోర్డు త్వరగా ఎందుకు మురికి అవుతుంది?

వంట చేసేటప్పుడు గాలిలో నూనె కణాలు, ఆవిరి చుట్టుపక్కల వస్తువులపై పడతాయి. వాటిపై దుమ్ము చేరినప్పుడు జిడ్డు బంకలా పట్టేస్తుంది. అందుకే వంటగదిలోని స్విచ్ బోర్డులు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ పక్కన ఉండే గోడలు, క్యాబినెట్ హ్యాండిల్స్ త్వరగా మురికి అవుతాయి.

ఈ తప్పులు అస్సలు చేయకండి!

• స్విచ్ బోర్డుపై డైరెక్ట్‌గా నీళ్లు చల్లడం

• తడి స్పాంజితో గట్టిగా రుద్దడం

• పవర్ ఆన్‌లో ఉన్నప్పుడు క్లీన్ చేయడం

• పదునైన వస్తువులతో సందుల్లోని మురికిని తీయడం

• కెమికల్ క్లీనర్లను ఎక్కువగా వాడటం

• స్విచ్‌లోకి లిక్విడ్ వెళ్తే వెంటనే పవర్ ఆన్ చేయడం

ఒకవేళ స్విచ్ బోర్డులోకి లిక్విడ్ వెళ్లిందని అనుమానం వస్తే, పవర్ ఆన్ చేయకుండా ఎలక్ట్రీషియన్‌ను పిలవడం మంచిది.

44
శుభ్రంగానే కాదు... సురక్షితంగా కూడా!
Image Credit : Instagram

శుభ్రంగానే కాదు... సురక్షితంగా కూడా!

కిచెన్ స్విచ్ బోర్డుపై మురికి చేరకుండా ఉండాలంటే, స్టవ్ చుట్టుపక్కల ఎప్పటికప్పుడు తుడుచుకోవడం మంచిది. స్విచ్ బోర్డు పగిలినా, ప్లాస్టిక్ కరిగినా, కాలిన మరకలు ఉన్నా, స్విచ్ లూజ్ అయినా వెంటనే ఎలక్ట్రీషియన్‌తో చెక్ చేయించాలి.

ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి:

పవర్ ఆఫ్ చేయాలి, పొడి గుడ్డతో దుమ్ము క్లీనింగ్ చేయాలి, తక్కువ తడితో పైన మాత్రమే తుడవాలి. ఇలా జాగ్రత్తగా క్లీన్ చేస్తే, జిడ్డు పట్టిన కిచెన్ స్విచ్ బోర్డును మళ్లీ కొత్తదానిలా మార్చుకోవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image3
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image2
Clean Greasy Non-Stick Pan: నాన్‌స్టిక్ పాన్ అంచులకు పట్టిన మొండి జిడ్డు పోవడం లేదా? ఇలా చేస్తే ఈజీగా క్లీన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved