MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Men's Hair Fall : మగవాళ్లలో జుట్టు రాలడానికి కారణాలేంటి? రాలకుండా ఎలా కాపాడుకోవాలి?

Men's Hair Fall : మగవాళ్లలో జుట్టు రాలడానికి కారణాలేంటి? రాలకుండా ఎలా కాపాడుకోవాలి?

మగవారిలో జుట్టు రాలడానికి జన్యుపరమైన కారణాలతో పాటు ఆహారంలో పోషకాల లోపం, జీవనశైలి కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇలా జుట్టు రాలడానికి కారణాలేంటి? రాలకుండాా ఎలా జాగ్రత్తపడాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 29 2026, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రోటీన్ లోపంతో హెయిర్ లాస్
Image Credit : Getty

ప్రోటీన్ లోపంతో హెయిర్ లాస్

మనుషుల జుట్టు నిర్మాణంలో కెరాటిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సరిపడినంత అందకుంటే జుట్టు బలహీనపడి రాలిపోతుంది.. కొందరిలో బట్టతలకు కూడా దారితీస్తుంది. కేవలం వెంట్రుకలు రాలకుండా చూడటమే కాదు ఆరోగ్యకరమైన జుట్టుకు కెరాటిన్ ఎంతో అవసరం. ఇది జుట్టుకు బలాన్ని, మెరుపును, రక్షణను ఇస్తుంది. జుట్టులోని జిడ్డుదనం, గరుకుదనాన్ని తగ్గించి చాలా మృదువుగా మారుస్తుంది.

కెరాటిన్ ప్రోటీన్ పప్పులు, పాలు, గుడ్లు, నట్స్, విత్తనాలు వంటివాటిలో అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తినడం ద్వారా జట్టు రాలే సమస్యనుండి మగవాళ్లు బైటపడవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జింక్ లోపంతో జుట్టు రాలుతుంది
Image Credit : Getty

జింక్ లోపంతో జుట్టు రాలుతుంది

జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి, కణజాలాల మరమ్మతుకు జింక్ చాలా అవసరం. పోషకాహార లోపం, అధిక ఒత్తిడి వల్ల శరీరంలో జింక్ తగ్గిపోతుంది. దీంతో వెంట్రుకలు రాలిపోయి జుట్టు పల్చబడుతుంది.

మాంసం, గుడ్లు, సముద్ర అహారంలో జింక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పాలలోనూ ఇది ఎక్కువే. గుమ్మడి గింజలు, వేరుశనగ, జీడిపప్పు వంటివాటిలో జింక్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అహారం తీసుకోవడం ద్వారా శరీరానికి సరిపడా అందుతుంది... జుట్టు రాలే సమస్య ఉంటే తగ్గుతుంది.

35
విటమిన్ డి లోపంతో హెయిర్ ఫాల్
Image Credit : Getty

విటమిన్ డి లోపంతో హెయిర్ ఫాల్

ఎక్కువసేపు ఇళ్లు, ఆఫీసులకే పరిమితం కావడం వల్ల చాలామందికి తగినంత సూర్యరశ్మి తగలదు. దీంతో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. జుట్టు కుదుళ్ల పనితీరుకు ఈ విటమిన్ చాలా అవసరం… దీని లోపంతో జుట్టు రాలుతుంది.

విటమిన్ డి అనేది ముఖ్యంగా సూర్యరశ్మి ద్వారా శరీరానికి లభిస్తుంది. కాబట్టి ఉదయం పూట ఎండలో కాసేపు ఉండటం వల్ల శరీరం సహజంగా విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. ఇక కొవ్వు ఉండే చేపలు (సాల్మన్, మాకేరెల్ వంటివి), గుడ్డులోని పచ్చసొనలో కూడా విటమిన్ డి ఉంటుంది. అలాగే మార్కెట్ లో విటమిన్ డి కలిపిన (ఫోర్టిఫైడ్) పాల ఉత్పత్తులు లభిస్తాయి... వాటిని తీసుకోవడం ద్వారా కూడా డి విటమిన్ లోపం నుండి బైటపడవచ్చు.

45
ఐరన్ లోపంతో జట్టు రాలే సమస్య అధికం
Image Credit : Getty

ఐరన్ లోపంతో జట్టు రాలే సమస్య అధికం

ఐరన్ కేవలం మహిళలకే అవసరం అనుకోవడం పొరపాటు. మగవారికి కూడా ఇది చాలా ముఖ్యం. ఐరన్ లోపిస్తే జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాల సరఫరా దెబ్బతింటుంది… దీంతో వెంట్రుకలు రాలుతాయి.

ఆకుకూరలు (పాలకూర), దానిమ్మ, ఖర్జూరం, బీట్రూట్, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు వంటివాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

55
ఒత్తిడి, చెడు అలవాట్లతోనూ జుట్టు రాలుతుంది
Image Credit : Getty

ఒత్తిడి, చెడు అలవాట్లతోనూ జుట్టు రాలుతుంది

సరైన ఆహారం తీసుకున్నా సరే.. అధిక ఒత్తిడి, నిద్రలేమి, పొగతాగడం, డీహైడ్రేషన్, వ్యాయామం చేయకపోవడం వంటివి పోషకాల వినియోగాన్ని దెబ్బతీస్తాయి… తద్వారా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా జుట్టు రాలడాన్ని పెంచుతుంది. కాబట్టి సమతుల ఆహారం, మంచి నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bali Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో బాలీ ఇయర్ రింగ్స్
Recommended image2
Gold Nose Pin: అరగ్రాములో వచ్చే అందమైన ముక్కుపుడక డిజైన్లు ఇవిగో!
Recommended image3
Train: ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా..528 కిలో మీటర్లు ప్రయాణించే నాన్ స్టాప్ రైలు..!
Related Stories
Recommended image1
Hair loss: మ‌హిళ‌ల్లో జ‌ట్టు రాలుతోందా.? శ‌రీరం ఇచ్చే హెచ్చ‌రిక‌కు సంకేత‌మ‌ని తెలుసా.?
Recommended image2
Hair Fall Dream: జుట్టు రాలిపోతున్నట్లు కల వచ్చిందా? దాని అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved