Kasuri Methi: కూరలో కసూరీ మేథీ ఎందుకు వేయాలి? ఎలా వేస్తే కూరకు రుచి పెరుగుతుందో తెలుసా?
Kasuri Methi:కూరలో రుచి పెంచడానికి కసూరీ మేథీ వాడుతున్నారా? అసలు.. ఈ కస్తూరీ మేథీ ఎందుకు వేస్తారో తెలుసా? దీనిని ఎప్పుడు వేయాలి? ఎలా వేయాలి? దీని వల్ల ప్రయోజనాలు ఏంటి?

కూరలో కసూరీ మేథీ వేస్తున్నారా?
రోజూ ఒకే రకమైన కూరలు తిని బోర్ కొడుతుందా? వంటలో ఎన్ని మసాలాలు వేసినా రెస్టారెంట్ స్టైల్ రుచి, ఆ సువాసన రావడం లేదా? అయితే మీ వంటగదిలో ఉండాల్సిన అతిముఖ్యమైన సీక్రెట్ ఇంగ్రీడియంట్... కసూరీ మేథీ. కేవలం అరచేతిలో కొద్దిగా నలిపి కూరల్లో చల్లితే చాలు, సాధారణ పప్పు, కూరగాయలు కూడా అద్భుతమైన సువాసనతో, కొత్త రుచితో నోరూరిస్తాయి. కేవలం రుచికే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
కసూరీ మేథీ అంటే ఏమిటి?
ఇంట్లోనే ఎలా తయారు చేయాలి? మెంతి కూర ఆకులను ఎండబెట్టి తయారు చేసేదే కసూరీ మేథీ. దీనిని మనం ఇంట్లోనే తాజా మెంతి ఆకులను శుభ్రంగా కడిగి, ఎండలో గానీ లేదా మైక్రోవేవ్‌లో గానీ ఎండబెట్టాలి. బాగా ఎండిన ఆకులను చేతితో తేలికగా నలిపి, గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
ఎలా నిల్వ చేయాలి..?
కసూరీ మేథీ సువాసన తగ్గకుండా ఉండటానికి గాజు లేదా స్టీల్ డబ్బాలోనే ఉంచాలి. తేమ, సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తపడాలి. ప్లాస్టిక్ కవర్లలో ఉంచితే తేమ చేరి దాని కరకరలాడే తత్వం, సువాసన తగ్గిపోతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ కస్తూరీ మేథీ రెగ్యులర్ గా చేయడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను వేగవంతం చేసి, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
వంటకాల్లో కసూరీ మేథీని ఎలా ఉపయోగించాలి?
1. వెజ్ కర్రీలు, సబ్జీలలో: పనీర్ బూర్జీ, ఆలూ కర్రీ, మిక్స్డ్ వెజ్ లేదా మటర్ పనీర్ వంటి కూరలు వండేటప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు వేయించే సమయంలో లేదా కూర దించే ముందు ఒక స్పూన్ కసూరీ మేథీ వేస్తే రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది.
2. పప్పు తాలింపులో: కందిపప్పు, శనగపప్పు, రాజ్మా లేదా చోలే వండినప్పుడు... జీలకర్ర, వెల్లుల్లి, ఎండిన మిర్చి తాలింపులో కొద్దిగా కసూరీ మేథీ వేసి పప్పులో కలిపితే అద్భుతమైన వాసనతో పప్పు రుచి రెట్టింపు అవుతుంది.
3. నాన్-వెజ్ వంటకాల్లో: చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్, మసాలా గ్రేవీలు లేదా చికెన్/మటన్ ఫ్రైలలో దించే ముందు కసూరీ మేథీ నలిపి చల్లితే నాన్-వెజ్ డిషెస్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నాన్-వెజ్ మార్నేషన్‌లో కూడా దీనిని వాడవచ్చు.
4. రోటీలు, పరోటాలు & నాన్స్.. పరోటా లేదా నాన్ పిండి కలిపేటప్పుడు కొద్దిగా కసూరీ మేథీ వేసి పిండి పిసికితే రొట్టెలు మంచి సువాసనతో చాలా రుచిగా ఉంటాయి.
5. స్నాక్స్ , బ్రేక్‌ఫాస్ట్: ఉల్లిపాయ పకోడీల పిండిలో, సమోసా, కచోరీల స్టఫ్ఫింగ్‌లో లేదా సాయంత్రం పూట తినే స్నాక్స్ పైన కసూరీ మేథీ చల్లితే క్రిస్పీగా, టెస్టీగా ఉంటాయి.
కసూరీ మేథీ అనేది వంటగదిలో ఉండే ఒక చిన్న ఇంగ్రీడియంట్ కావచ్చు, కానీ మీ రోజువారీ వంటకాల రూపురేఖలను, రుచిని మార్చేసే శక్తి దీనికి ఉంది

