MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Jowar Roti: జొన్న రెట్టె, రాగి రొట్టే చేస్తుంటే విరిగిపోతున్నాయా? ఈ ఒక్క చిట్కాతో పర్ఫెక్ట్ గా, సాఫ్ట్ గా వస్తాయి

Jowar Roti: జొన్న రెట్టె, రాగి రొట్టే చేస్తుంటే విరిగిపోతున్నాయా? ఈ ఒక్క చిట్కాతో పర్ఫెక్ట్ గా, సాఫ్ట్ గా వస్తాయి

Jowar Roti: జొన్న రొట్టెలు చేయడం అందరికీ సాధ్యం కాదు. ఎంత కష్టపడి పిండి కలిపి.. రొట్టె చేద్దామని అనుకున్నా.. అది కాల్చే లోపే విరిగిపోతూ ఉంటుంది. అయితే, చిన్న ట్రిక్ ఫాలో అయితే.. ఈ రొట్టెలు విరగకుండా మెత్తగా వస్తాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 14 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Roti Making
Image Credit : AI

Roti Making

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు తినాలని అందరికీ ఉంటుంది. కానీ, వాటిని చేయడానికి పూనుకున్నప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. పిండి కలపగానే విరిగిపోవడం, పెనం మీద వేయగానే పగిలి ముక్కలు కావడం, తీరా కాలిన తర్వాత పకోడీలా గట్టిగా మారడం... ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతుంటాయి. గోధుమ పిండిలో ఉన్నట్లు జొన్న, రాగి పిండుల్లో 'గ్లూటెన్' (జిగురు ) ఉండకపోవడమే దీనికి కారణం.

అయితే, ఒక చిన్న నాచురల్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్‌తో పాటు కొన్ని పల్లెటూరి చిట్కాలను పాటిస్తే... ఎలాంటి క్రాక్స్ లేకుండా, హోటల్ లేదా పల్లెటూరి స్టైల్‌లో దూదిలా మెత్తగా, పొంగే జొన్న, రాగి రొట్టెలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జొన్న, రాగి రొట్టే చేయడానికి సీక్రెట్స్..
Image Credit : AI

జొన్న, రాగి రొట్టే చేయడానికి సీక్రెట్స్..

1. ఇసబ్‌గోల్.. గ్లూటెన్ లేని జొన్న, రాగి పిండులకు హోటల్ స్టైల్ సాఫ్ట్‌నెస్, జిగురును ఇచ్చే రహస్య పదార్థం 'ఇసబ్‌గోల్' (Isabgol). నీటితో కలిసినప్పుడు ఇసబ్‌గోల్ ఒక జెల్ లాగా మారి, పిండికి స్థితిస్థాపకతను ఇస్తుంది. దీని వల్ల .. రొట్టెలు చాలా మృదువుగా వస్తాయి. ఒక కప్పు జొన్న లేదా రాగి పిండికి 1 టేబుల్ స్పూన్ ఇసబ్‌గోల్ పొడి కలిపితే సరిపోతుంది. ఇది పిండి విరిగిపోకుండా రొట్టెను ఎంత పల్చగానైనా ఒత్తడానికి సహాయపడుతుంది.

2. మరుగుతున్న వేడి నీళ్లు వాడటం: జొన్న, రాగి రొట్టెలు సాఫ్ట్‌గా రావాలంటే వేడి నీళ్లు చాలా ముఖ్యం. పిండిలో ఇసబ్‌గోల్, చిటికెడు ఉప్పు కలిపిన తర్వాత బాగా మరుగుతున్న నీళ్లను పోసి గరిటెతో బాగా కలపాలి. వేడి నీటి వల్ల పిండిలోని స్టార్చ్ ఉడికి పిండికి ఒక రకమైన జిగురు వస్తుంది. గిన్నెపై 5 నిమిషాలు మూతపెట్టి ఉంచి, ఆ తర్వాత చేతికి కొద్దిగా నూనె లేదా నీళ్లు రాసుకుని పిండిని కనీసం 2-3 నిమిషాలు బాగా ఒత్తుతూ సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి.

34
తేలికగా ఒత్తే టెక్నిక్ :
Image Credit : AI Image

తేలికగా ఒత్తే టెక్నిక్ :

పిండి ముద్దను రౌండ్‌గా చేసి, పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో చాలా తేలికగా, మెల్లగా ఒత్తాలి.బలవంతంగా అదమడం వల్ల అంచులు పగిలిపోతాయి. రొట్టె ఒత్తిన తర్వాత అంచులు సమానంగా రాకపోతే, ఒక వెడల్పాటి ప్లేట్ లేదా పదునైన అంచులున్న గిన్నెతో పైన గట్టిగా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్ రౌండ్ షేప్‌లో రొట్టె వస్తుంది.

44
కాలిచే పద్ధతి:
Image Credit : AI Image

కాలిచే పద్ధతి:

పెనం బాగా కాగిన తర్వాత మాత్రమే రొట్టెను వేయాలి. చల్లటి పెనంపై వేస్తే రొట్టె గట్టిగా మారుతుంది. రొట్టెను పెనంపై వేసిన వెంటనే దాని పైభాగంలో తడి గుడ్డతో లేదా చేతితో కొద్దిగా నీళ్లను రాయాలి. ఇది రొట్టె ఎండిపోకుండా, సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది. రొట్టెపై నీరు ఆరిపోతున్నప్పుడు నిదానంగా తిప్పి, రెండో వైపు కాలేవరకు ఉంచాలి. గుడ్డతో అంచులను తేలికగా నొక్కితే రొట్టె పూరీలా చక్కగా పొంగుతుంది.

ఈ చిన్నపాటి మెళకువలు ఉపయోగిస్తే జొన్న, రాగి రొట్టెలు చేయడం ఎంతో సులభం కావడమే కాకుండా, మరుసటి రోజు వరకు కూడా అంతే మెత్తగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bangles: బంగారు గాజులు చూశారా.. చూపుతిప్పుకోలేరంతే
Recommended image2
Cooking Tips: వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే కూర రుచి పాడైపోతుంది
Recommended image3
Gold Nose Pin: రోజూవారీ వాడకానికి ఈ ముక్కుపుడకలు సూపర్ గా ఉంటాయి!
Related Stories
Recommended image1
Train: ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా..528 కిలో మీటర్లు ప్రయాణించే నాన్ స్టాప్ రైలు..!
Recommended image2
Train: సీటు వెతుక్కుని కూర్చొనేలోపే స్టేషన్ వచ్చేస్తుంది.. మన దేశంలో అతి చిన్న రైలు ప్రయాణం..ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved