MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Parenting: ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిల్లల ప్రవర్తన ఎందుకు మారిపోతుందో తెలుసా?

Parenting: ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిల్లల ప్రవర్తన ఎందుకు మారిపోతుందో తెలుసా?

Parenting: సాధారణంగా పిల్లలు.. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కాస్త డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంటారు. కొందరు బాగా అల్లరి మొదలుపెడితే, మరికొందరు ఏం మాట్లాడకుండా దూరం వెళ్లిపోతారు. అసలు బంధువుల ముందు పిల్లల ప్రవర్తన ఎందుకు ఇలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 15 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పేరెంటింగ్ టిప్స్
Image Credit : AI

పేరెంటింగ్ టిప్స్

సాధారణంగా కొందరు పిల్లలు బంధువులు ఇంటికి రాగానే ఒక్కసారిగా అల్లరి చేయడం మొదలుపెడతారు. ఎప్పుడూ నోరు విప్పని పిల్లలు కూడా అందరి ముందు గట్టిగా మాట్లాడతారు. మరికొందరు వచ్చిన వాళ్లతో ఏం మాట్లాడకుండా ఒక మూలకు వెళ్లిపోతారు. ఇంకొందరు మాత్రం అందరి దృష్టి తమ మీదే ఉండాలని కోరుకుంటారు. బంధువులు రాగానే పిల్లలు ఎందుకిలా మారిపోయారని తల్లిదండ్రులకు అనిపిస్తుంది. అసలు పిల్లలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పిల్లల ప్రవర్తనలో మార్పు
Image Credit : Istock

పిల్లల ప్రవర్తనలో మార్పు

ఇంట్లో తల్లిదండ్రులతో ఉన్నప్పుడు పిల్లలకు ఒక రకమైన భద్రత ఉంటుంది. ఎవరు ఎలా స్పందిస్తారో, ఏం చేస్తే అమ్మ నవ్వుతుందో, ఏం చేస్తే నాన్న కోప్పడతారో వాళ్లకు తెలుసు. కానీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఒక్కసారిగా కొత్త మనుషులు, కొత్త మాటలు, కొత్త అంచనాలు మొదలవుతాయి. పిల్లల రొటీన్ కూడా కాస్త మారుతుంది. ఆడుకునే సమయం తగ్గిపోవచ్చు. పెద్దవాళ్లు మాట్లాడుకొనేటప్పుడు పిల్లల మాటలకు అంతగా ప్రాధాన్యం దొరకకపోవచ్చు. ఈ మార్పులన్నీ పిల్లల ప్రవర్తనలో కనిపిస్తాయి.

36
అటెన్షన్ కోసం చేసే ప్రయత్నం
Image Credit : AI

అటెన్షన్ కోసం చేసే ప్రయత్నం

సాధారణంగా ఇంటికి వచ్చిన బంధువులు పెద్దలతో మాట్లాడుతుంటే పిల్లలకు అందరి దృష్టి నా మీద లేదు అనే భావన రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు తనవైపు చూడాలని, తనతో మాట్లాడాలని, తనను గమనించాలని పిల్లవాడు అల్లరి చేయవచ్చు. ఈ ప్రవర్తన కావాలనే ఇబ్బంది పెట్టాలని కాదు. తనకు కావాల్సిన శ్రద్ధను తనకు తెలిసిన పద్ధతిలో పొందడానికి ప్రయత్నించడం. అందుకే బంధువులు వచ్చినప్పుడు పిల్లలు చేసే అల్లరిని మొండితనం లేదా చెడ్డ ప్రవర్తనగా ముద్ర వేయడం కరెక్ట్ కాదు.

46
మౌనంగా ఉండటం
Image Credit : AI

మౌనంగా ఉండటం

మరోవైపు కొంతమంది పిల్లలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. బంధువులు వచ్చినప్పుడు పిల్లలు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఎవరు పలకరించినా తల్లిదండ్రుల వెనకాల దాక్కుంటారు. బంధువులను పలకరించు… మాట్లాడు.. అని పదేపదే ఒత్తిడి చేస్తే వాళ్లలో భయం లేదా అసౌకర్యం మరింత పెరగవచ్చు. ప్రతి పిల్లవాడి సోషనల్ కంఫర్ట్ ఒకేలా ఉండదు. కొంతమంది వెంటనే కలిసిపోతారు. మరికొందరికి కొత్త వ్యక్తులతో కలవడానికి కొంత టైం తీసుకుంటారు. కాబట్టి వాళ్లకు కాస్త టైం ఇవ్వడం మంచిది.

56
ఎక్కువ స్వేచ్ఛ
Image Credit : gemini ai

ఎక్కువ స్వేచ్ఛ

ఇంట్లో సాధారణంగా తల్లిదండ్రులు పెట్టే కొన్ని నియమాలు ఉంటాయి. కానీ బంధువులు వచ్చినప్పుడు “పర్లేదు, ఈరోజు ఆడుకోనివ్వండి”, “ఇంకో చాక్లెట్ ఇవ్వండి”, “పిల్లాడే కదా” అంటూ కొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు ఇది చాలా త్వరగా అర్థమవుతుంది. అందుకే కొన్నిసార్లు బంధువులు వచ్చినప్పుడు పిల్లలు తమకు నచ్చింది సాధించడానికి మరింత పట్టుబడతారు.

66
పిల్లల ప్రవర్తన గమనించడం
Image Credit : unsplash

పిల్లల ప్రవర్తన గమనించడం

కొన్ని సందర్భాల్లో బంధువులు పిల్లల ప్రవర్తనను తెలియకుండానే ప్రభావితం చేస్తారు. “ఎంత లావుగా అయ్యావు?”, “ఎన్ని మార్కులు?”, “ఎందుకు ఇలా నల్లగా అయ్యావు?” వంటి మాటలు పిల్లల మనసులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. పెద్దలకు అవి సరదా మాటలుగా అనిపించినా, పిల్లలు వాటిని చాలా సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. అది కొన్నిసార్లు కోపంగా, అల్లరిగా లేదా పూర్తిగా మౌనంగా బయటపడుతుంది. అందుకే బంధువులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లల ప్రవర్తనను వెంటనే మార్చాలని ప్రయత్నించడం కంటే, వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో గమనించడం ముఖ్యం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Tops: 5 గ్రాముల్లోనే వచ్చే చెవికమ్మలు, ఎంతో అందంగా ఉంటాయి
Recommended image2
Hair oil: జుట్టు రాలకుండా ఆపే సూపర్ ఆయిల్స్ ఇవే
Recommended image3
Anklet Designs: రంగురంగుల పూసల పట్టీలు.. అదిరిపోయే లుక్ మీ సొంతం!
Related Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved