MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Idli Batter: వర్షాకాలంలోనూ ఇడ్లీ, దోశ పిండి పర్ఫెక్ట్ గా పులియాలా? ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు

Idli Batter: వర్షాకాలంలోనూ ఇడ్లీ, దోశ పిండి పర్ఫెక్ట్ గా పులియాలా? ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు

Idli Batter: ఎండాకాలంలో పిండి తొందరగా పులుస్తుంది. కానీ, వర్షాకాలం, చలికాలలో పిండి తొందరగా పులవదు. దీని వల్ల ఇడ్లీ రుచిగా రాదు, కొన్ని సింపుల్ చిట్కాతో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 15 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Cooking Tips
Image Credit : ai

Cooking Tips

మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ రూపంలో ఇడ్లీ తినడానికి ఇష్టపడతారు. అయితే వర్షాకాలంలో ఇడ్లీలు మెత్తగా రావడానికి, దోసలు క్రిస్పీగా కావడానికి కావలసిన పిండిని సరిగ్గా పులియబెట్టడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. వర్షాల వల్ల మారే ఉష్ణోగ్రతలు, తేమ శాతం కారణంగా పిండి సరిగ్గా పొంగదు. దీని వల్ల ఇడ్లీ, దోశలు రుచిగా రావు.

వర్షాకాలంలో చల్లటి వాతావరణం వల్ల పిండిని పులియబెట్టే మంచి బ్యాక్టీరియా పనితీరు మందగించి, పిండి సరిగ్గా పొంగదు. ఇంట్లో సరైన గాలి ఆడకపోవడం వల్ల పిండి పులియడానికి అవసరమైన ఆక్సిజన్ మార్పిడి సరిగ్గా జరగదు. అందుకే, ఈ వర్షాకాలంలో సింపుల్ చిట్కాలతో ఈ పిండిని టేస్టీగా మార్చేయచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పిండి పులిసిందీ లేనిదీ ఎలా గుర్తించాలి..?
Image Credit : Gemini

పిండి పులిసిందీ లేనిదీ ఎలా గుర్తించాలి..?

బాగా పులిసిన పిండి పరిమాణంలో రెట్టింపు అయి, పైన చిన్న చిన్న బుడగలు రావాలి. అలా రాకపోతే పిండి పులియనట్లే. ఒకవేళ 8 గంటల లోపే విపరీతమైన పులుపు లేదా వెనిగర్ లాంటి వాసన వస్తే, చెడు బ్యాక్టీరియా చేరిందని అర్థం. అంతేకాదు.. పిండి పలచబడి, నీరు తేరి జిగటగా అనిపిస్తే అది పాడైపోయినట్లే. పిండి ఇలా మారినప్పుడు తినకపోవడమే మంచిది.

33
వర్షాకాలంలో పిండిని పర్ఫెక్ట్‌గా పులియబెట్టే చిట్కాలు :
Image Credit : Gemini

వర్షాకాలంలో పిండిని పర్ఫెక్ట్‌గా పులియబెట్టే చిట్కాలు :

గోరువెచ్చని నీళ్లు వాడండి: పప్పు, బియ్యం రుబ్బేటప్పుడు చల్లటి నీళ్లకు బదులు లైట్‌గా గోరువెచ్చని నీళ్లను ఉపయోగిస్తే పులిసే ప్రక్రియ వేగవంతమవుతుంది.

సహజమైన బూస్టర్లు కలపండి: రుబ్బే సమయంలో కొద్దిగా నానబెట్టిన అటుకులు, కొన్ని మెంతులు లేదా ఒక స్పూన్ గట్టి పెరుగు కలిపితే పిండికి మంచి జిగురు, మెత్తదనం రావడమే కాకుండా త్వరగా పులుస్తుంది.

వెచ్చని వాతావరణాన్ని సృష్టించండి: పిండి గిన్నెను ఒక మందపాటి కాటన్ గుడ్డతో లేదా టవల్‌తో చుట్టి ఉంచండి. లేదా స్విచ్ ఆఫ్ చేసిన మైక్రోవేవ్/ఓవెన్ లోపల లైట్ ఆన్ చేసి ఉంచితే లోపలి వేడికి పిండి బాగా పొంగుతుంది.

సరైన మూత వాడండి: గిన్నెపై మూతను పూర్తిగా టైట్‌గా పెట్టకుండా కొద్దిగా గాలి ఆడేలా తేలికగా ఉంచాలి.

సరిపడా సమయం మాత్రమే ఉంచండి: పిండి బాగా పొంగిన వెంటనే దానిని ఫ్రిజ్‌లో పెట్టేయాలి. బయటే ఎక్కువ సేపు ఉంచితే విపరీతంగా పులిసిపోతుంది. ఫ్రిజ్‌లో పెడితే 2 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది.

చిన్న బ్యాచ్‌లలో చేయండి: వర్షాకాలంలో పిండిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా, 1-2 రోజులకు సరిపడా మాత్రమే రుబ్బుకోవడం మంచిది.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, వర్షాకాలంలో కూడా ఇడ్లీలు దూదిలా మెత్తగా, దోసలు పర్ఫెక్ట్‌గా వస్తాయి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu: ఎప్పుడుపడితే అప్పుడు దుస్తులు ఉతికితే కష్టాలు మీ వెంటే.. ఈ తప్పులు చేయకండి
Recommended image2
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image3
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Related Stories
Recommended image1
Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Recommended image2
Jowar Roti: జొన్న రెట్టె, రాగి రొట్టే చేస్తుంటే విరిగిపోతున్నాయా? ఈ ఒక్క చిట్కాతో పర్ఫెక్ట్ గా, సాఫ్ట్ గా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved