MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీ కిడ్నీలు దెబ్బతిన్నాయని ఇలా తెలుసుకోండి..

మీ కిడ్నీలు దెబ్బతిన్నాయని ఇలా తెలుసుకోండి..

మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా? లేవా? అని నిర్ధారించుకోవడానికి ఖచ్చితమైన మార్గం వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకోవడం. ఒకవేళ మీ కిడ్నీలు దెబ్బతింటే మీలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 19 2022, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
kidney

kidney

మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. అవి దెబ్బతిన్నాయని అర్థం చేసుకోవాలి. డయాబెటీస్, వృద్ధాప్యం, కుటుంబ చరిత్ర, అధిక రక్తపోటు వంటి సమస్యల వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మూత్రపిండాల వ్యాధి గుండె, రక్తనాళాల వ్యాధి ప్రమాదాలను పెంచుతుంది. పాలీసిస్టిక్ మూత్రపిండాల వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రపిండాల్లో పెద్ద తిత్తులు (large cysts) ఏర్పడటానికి దారితీస్తుంది. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. మరోటి లూపస్. ఇది మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. లూపస్ నెఫ్రిటిస్ ను స్వయం ప్రతిరక్షక వ్యాధి అని పిలుస్తారు. ఇది మూత్రపిండాల్లో వ్యర్థాలను ఫిల్టర్ చేసే చిన్న రక్తనాళాల వాపునకు దారితీస్తుంది. మూత్రపిండాలు దెబ్బతిన్నవారికి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఇది ఒక్కొక్కరికి చివరికి డయాలసిస్ లేదా అవయవ మార్పిడి అవసరం కావొచ్చు. 

26

మన దేశంలో లక్షల మంది రకరకాల మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. అయినా దీని గురించి చాలా మందికి తెలియదు. అందుకే మూత్రపిండాల వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి ముదిరే వరకు ఎలాంటి తేడా ఉండదు. చాలా మంది అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసినా.. మూత్రపిండాల వ్యాధిని మాత్రం గుర్తించలేకపోతుంటారు. మూత్రపిండాల వ్యాధిని గుర్తించాలంటే వ్యాధి నిర్దారణ టెస్ట్ లు చేయించుకోవాలి. మూత్రపిండాల వ్యాధి బారిన పడితే  కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వీటిని బట్టి కూడా నిర్దారించొచ్చు. అవేంటంటే.. 

36

అలసట: మీరు ఏ పనిచేయపోయిన అలసిపోతున్నట్టైతే.. మీ మూత్రపిండాలు ఖచ్చితంగా దెబ్బతిన్నాయని అర్థం చేసుకోండి. నిర్ధారించుకోవడానికి హాస్పటల్ కు వెళ్లండి. ఇది ఆందోళనలను పెంచుతుంది. అంతేకాదు కొన్ని అంతర్లీన సమస్యలను కూడా కలిగిస్తుంది. 

ఆకలి లేకపోవడం: మూత్రపిండాలు దెబ్బతింటే కూడా  సరిగ్గా కాదు. ఇది మీ సమస్య ముదిరిందని సూచిస్తుంది. సాధారణంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. 

పాదాల వాపు, చీలమండలు: మూత్రపిండాల వ్యాధి ఉన్న వారిలో సాధారణంగా పాదాలు, చీలమండలు వాపునకు గురవుతాయి. 
 

46

ఉబ్బిన కళ్లు: కంటి చుట్టూ ఉబ్బితే కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది మూత్రపిండాల వ్యాధి సాధారణ లక్షణం. 

పొడి చర్మం, దురద: మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేకుంటే.. మన శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. దురద కూడా పెరుగుతుంది. అలాగే మన ఒంటి నుంచి దుర్వాసన వస్తుంది. 
 

56

మూత్రవిసర్జనలో మార్పులు:  మూత్రవిసర్జపై కూడా ఓ కన్నేసి ఉంచాలి. అంటే రోజులా కాకుండా సడెన్ గా మూత్రవిసర్జన తగ్గిపోవచ్చు. లేదా తరచుగా మూత్రవిసర్జన చేయడం. ముఖ్యంగా రాత్రిపూట. ఇవి మూత్రపిండాల వ్యాధికి సంకేతాలు. 

 

66

అధిక రక్తపోటు:  అధిక రక్తపోటు కూడా మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. హైపర్ టెన్షన్ తో బాధపడే వారు చాలా మటుకు మూత్రపిండాల వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Cost of Living In Goa: బీచ్ లైఫ్ అంటే ఇష్టమా.. మరి గోవాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతో తెలుసా?
Recommended image2
South Goa Food: సౌత్ గోవాలో ది బెస్ట్ హోటల్స్ ఇవే.. మార్టిన్స్ కార్నర్ నుంచి జెస్ట్ కేఫ్ వరకు టాప్ 9 ప్లేసెస్!
Recommended image3
Mixer Jar Blades: ఈ ఒక్క పని చేస్తే..నిమిషాల్లో మీ మిక్సీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved