MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • White Rice: చద్దన్నం Vs వేడి అన్నం.. రెండింటిలో ఏది మంచిది? ఏది తింటే ఆరోగ్యం..?

White Rice: చద్దన్నం Vs వేడి అన్నం.. రెండింటిలో ఏది మంచిది? ఏది తింటే ఆరోగ్యం..?

White Rice: మీకు అన్నం వేడి వేడిగా పొగలు కక్కుతున్నప్పుడు తినడం ఇష్టమా? లేక.. అన్నం ఆరిపోయిన తర్వాత తినడం ఇష్టమా? ఈ రెండింటిలో ఏది మనకు మంచిదో తెలుసా?

3 Min read
Author : ramya Sridhar
Published : Sep 05 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
White rice
Image Credit : Getty

White rice

మన దేశంలో ప్రతి ఇంట్లో ప్రతిరోజూ ప్రధానంగా తీసుకునే ఆహారం అన్నం. మూడు పూటలా అన్నం తింటేనే భోజనం చేసిన ఫీలింగ్ ఉంటుంది. అయితే.. దాదాపు అందరికీ వేడి వేడిగా అన్నం తినడం నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి పెట్టుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుంది. కానీ, ఆరోగ్యానికి ఏది మంచిది? వేడి తినడం మంచిదా? లేక.. ఆరిపోయిన అన్నం తినడం మంచిదా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేడి అన్నం, ఆరిపోయిన అన్నానికి తేడా ఏంటి..?
Image Credit : Asianet News

వేడి అన్నం, ఆరిపోయిన అన్నానికి తేడా ఏంటి..?

ఎక్కువ మందికి వేడిగా అన్నం తినడమే నచ్చుతుంది. కానీ, పరిశోధనల ప్రకారం, వేడి అన్నం కంటే.. వండి చల్లార్చిన అన్నంలో శరీరానికి అత్యంత మేలు చేసే రెసిస్టెంట్ స్టార్చ్ అనే పోషకపదార్థం ఉంటుంది. సాధారణంగా బియ్యంలో స్టార్చ్ అంటే పిండి పదార్థం ఉంటుంది. మనం బియ్యాన్ని ఉడికించినప్పుడు.. అందులోని స్టార్చ్ వేడి నీటిని పీల్చుకొని ఉబ్బి.. గ్లూకోజ్ గా మారతాయి. అందుకే, వేడి అన్నం తిన్న వెంటనే ఈజీగా జీర్ణమై గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. అయితే, వండిన అన్నాన్ని కాసేపు పక్కన పెట్టి.. చల్లారినప్పుడు లేదా 12 నుంచి 24 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచినప్పుడు ఒక విచిత్రమైన రసాయనిక మార్పు జరుగుతుంది. దీనినే సైంటిఫిక్ గా రెట్రో గ్రేడేషన్ అని అంటారు. అంతేకాదు.. ఈ ప్రక్రియలో అన్నంలోని పిండి పదార్థాలు దగ్గరకు చేరతాయి. దీనినే రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. ఇది చిన్న పేగులో సులభంగా జీర్ణం కాకుండా, దాదాపు డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) లాగా పనిచేస్తూ పెద్ద పేగుకు చేరుకుంటుంది.

Related Articles

Related image1
Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Related image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
34
రెసిస్టెంట్ స్టార్చ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Image Credit : Gemini AI

రెసిస్టెంట్ స్టార్చ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

సాధారణంగా వేడి అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అన్నం తిన్న వెంటనే బ్లడ్ షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. కానీ, చల్లారిన లేదా ఫ్రిజ్‌లో పెట్టి తీసిన అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరగడం వల్ల దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవ్వడం వల్ల రక్తంలోకి గ్లూకోజ్ చాలా నిదానంగా విడుదలై, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

జీర్ణవ్యవస్థ, పేగు ఆరోగ్యం : రెసిస్టెంట్ స్టార్చ్ చిన్న పేగులో కరగకుండా పెద్ద పేగులోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉండే మన శరీరానికి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా దీనిని ఆహారంగా వినియోగించుకుంటాయి. ఈ ప్రక్రియలో 'బ్యూటిరేట్' వంటి షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి పేగు గోడలను దృఢంగా మార్చడంతో పాటు, కాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి.

బరువు తగ్గడానికి సహాయం : చల్లారిన అన్నం తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. రెసిస్టెంట్ స్టార్చ్ వల్ల ఆకలిని పెంచే హార్మోన్లు అదుపులో ఉంటాయి. దీనివల్ల మాటిమాటికీ ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గి, శరీరంలో క్యాలరీల వినియోగం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి మార్గం.

44
చల్లారిన అన్నాన్ని మళ్లీ వేడి చేస్తే రెసిస్టెంట్ స్టార్చ్ పోతుందా?
Image Credit : Gemini AI

చల్లారిన అన్నాన్ని మళ్లీ వేడి చేస్తే రెసిస్టెంట్ స్టార్చ్ పోతుందా?

చాలామందికి ఉండే పెద్ద అనుమానం ఏమిటంటే, చల్లారిన లేదా ఫ్రిజ్‌లో ఉంచిన అన్నాన్ని తినేముందు మళ్లీ వేడి చేస్తే అందులోని రెసిస్టెంట్ స్టార్చ్ నశిస్తుందా? అని. పరిశోధనల ప్రకారం, ఒకసారి స్టార్చ్ రెట్రోగ్రేడేషన్ ద్వారా దృఢమైన ఆకృతిలోకి మారిన తర్వాత, దానిని మళ్లీ సాధారణంగా వేడి చేసినా అందులోని రెసిస్టెంట్ స్టార్చ్ గుణాలు పోవు. చాలావరకు ఆ గుణాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఫ్రిజ్‌లో ఉంచిన అన్నాన్ని వేడి చేసుకుని తిన్నా కూడా సాధారణ వేడి అన్నం కంటే మెరుగైన ప్రయోజనాలే లభిస్తాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు..

చల్లారిన అన్నం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటల కంటే ఎక్కువ సమయం బయట ఉంచకూడదు. దీనివల్ల బాసిల్లస్ సిరియస్ అనే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. చల్లారిన వెంటనే అన్నాన్ని మూత ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 24 గంటల లోపు వినియోగించడం సురక్షితం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే..చల్లారిన తర్వాత అన్నం తినడమే ఆరోగ్యానికి మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Crispy Vada: హోటల్ గారెలు కరకరలాడేలా ఎందుకు వస్తాయో తెలుసా? ఇదే ఆ చిట్కా
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Related Stories
Recommended image1
Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved