Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
woman-life Sep 05 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
కోడి గుడ్డు..
కోడి గుడ్డులో ప్రోటీన్, బయోటిన్, సెలీనియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో రెండు గుడ్లు తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
కరివేపాకు
కరివేపాకులో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్.. జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu
పాలకూర
పాలకూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్ల చుట్టూ కొల్లాజెన్ ఏర్పడటంలో సాయపడుతుంది. అలాగే, శరీరం ఐరన్‌ను గ్రహించుకోవడానికి కూడా ఇది అవసరం.
Image credits: Getty
Telugu
ఉసిరికాయ
ఉసిరిలో విటమిన్ సి సహజంగా, అత్యధికంగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
పీనట్ బటర్
పీనట్ బటర్‌లో బయోటిన్, ప్రోటీన్, విటమిన్ ఇ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా, బలంగా మారుస్తాయి.
Image credits: Freepik
Telugu
నువ్వులు
నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.
Image credits: Getty
Telugu
పెరుగు
పెరుగులో ప్రోటీన్, విటమిన్ బి5, ప్రోబయోటిక్స్ ఉంటాయి. విటమిన్ బి5 తలకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
చిలగడదుంప
చిలగడదుంపలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది తలలో సహజ నూనెలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.