MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • High blood pressure: రోజుకు ఇన్ని గ్లాసుల నీటిని తాగితే హై బీపీ తగ్గుతుంది..

High blood pressure: రోజుకు ఇన్ని గ్లాసుల నీటిని తాగితే హై బీపీ తగ్గుతుంది..

High blood pressure: శరీరంలో సరిపడా నీరు లేకపోతే ఎన్నో రోగాలు చుట్టుకుంటాయి. అందుకే శరీరానికి అవసరమయ్యే  నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే అధిక పోటు సమస్య ఉన్నవారు కొంతపరిమాణంలో నీళ్లను తాగితే బీపీ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 18 2022, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అధిక రక్తపోటు ఎన్నో ప్రమాదరకమైన రోగాలకు దారితీస్తుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అయితే నీళ్లు అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. బాడీ హైడేట్రేడ్ గా ఉంటే గుండె సమర్థవంతంగా పనిచేస్తూ.. శరీరం మొత్తానికి రక్తాన్నిసరఫరా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే అధిక రక్తపోటు దానంతట అదే నియంత్రణలో ఉంటుంది. ఉప్పును మోతాదుకు మించితీసుకోకుండా ఉండటం, శారీరక శ్రమ చేయడం, ఆల్కహాల్ ను ఎక్కువగా సేవించకపోవడం, ధూమపానం అలవాటును మానుకోవడం, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా హైబీపీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

39

వీటితో పాటుగా పుష్కలంగా నీరు తాగితే అధిక రక్తపోటు తగ్గుతుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. అయితే రక్తపోటును తగ్గించేందుకు వీరు కొంత పరిమాణంలో నీళ్లను రెగ్యులర్ గా తాగాలని నిపుణులు చెబుతున్నారు. 
 

49

బీపీ తగ్గాలంటే ఎంత నీటిని తాగాలి

రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని ( 240 మి.లీ) తాగితే అధిక రక్తపోటు తగ్గుతుందని పలువురు డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే నీళ్లను ఇంత పరిమాణంలో తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు, అదనపు సోడియం బయటకు పోతుంది. దీంతో అధిక రక్తపోటు పెరిగే ప్రమాదం తగ్గుతుంది. 

59

క్రాన్ బెర్రీ జ్యూస్ కూడా సహాయపడుతుంది

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్రాన్ బెర్రీ జ్యూస్ కూడా హైబీపీని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ  జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి. మంటను తగ్గిస్తాయి. అలాగే రక్తనాళాలను సడలిస్తాయి. మొత్తంగా ఇవి రక్తపోటు లెవెల్స్ పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

 

69

అంతేకాదు ఈ క్రాన్ బెర్రీ జ్యూస్ శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అంతేకాదు శరీరంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను సైతం చంపేస్తుంది. ఆక్సికరణ ఒత్తిడి కూడా తగ్గుతుంది. 
 

79
high blood pressure

high blood pressure

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 79 ఏడ్ల మధ్య వయసున్న 1.28 బిలియన్ల వయోజనులు హైబీపీతో బాధపడుతున్నారు. 

89

హైబీపీ ఖచ్చితమైన లక్షణాలను చూపదు. ఇది తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే గుండె వైఫల్యం, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతకమైన రోగాల రూపంలో లక్షణాలను తెలియజేస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. 

99

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అధిక ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా పొగాకు, ఆల్కహాల్ వినియోగాలను పూర్తిగా తగ్గించాలి. ఇవి ఊబకాయం, హైపర్ టెన్షన్ కు ప్రధాన కారకాలు. కూరగాయలు, తాజా పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి. ఇవి హైబీపీ సమస్యను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pedicure Designs: టాప్ 10 ట్రెండింగ్ పెడిక్యూర్ లుక్స్‌.. ఎంత బాగున్నాయో!
Recommended image2
Gold Locket: 2 గ్రాముల్లోనే చైన్ కి అదిరిపోయే గోల్డ్ లాకెట్స్
Recommended image3
Instant Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో ఇడ్లీ రెడీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved