Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • సగ్గుబియ్యం మన ఆరోగ్యానికి ఎంత మంచివో..!

సగ్గుబియ్యం మన ఆరోగ్యానికి ఎంత మంచివో..!

సబుదానా లేదా సగ్గుబియ్యం మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఇవి శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు పెరగడం నుంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు ఇవి ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి. 

Mahesh Rajamoni | Published : Dec 19 2022, 02:59 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

సాబుదానా అనేది ఒక పిండి పదార్ధం. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే వ్యాయామం ఇంకా మెరుగ్గా చేయడానికి సహాయపడతాయి. షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషదంతో సమానం. అసలు సాబుదానా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడ తెలుసుకుందాం.. 
 

28
Asianet Image

బలానికి మంచి మూలం

సగ్గుబియ్యంలో  షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. పిండి పదార్థం కూడా దీనిలో ఉంటుంది. సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఇవి గ్లూకోజ్ ను ఉత్పత్తి చేసి.. శరీరానికి శక్తిని ఇస్తాయి. అంతేకాదు రోజు వారి పనులను మరింత మెరుగ్గా చేసుకోగలిగే శక్తిని స్తాయిని పెంచుతాయి. శక్తి వనరుకు సాబుదానా మంచి ఉదాహరణ. 
 

38
Asianet Image

రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది

సగ్గుబియ్యం అధిక రక్తపోటు పేషెంట్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది హై బీపీని కూడా నియంత్రిస్తుంది. రక్తపోటు కంట్రోల్ లో ఉండాలంటే వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 
 

48
<p>sabudana</p>

<p>sabudana</p>

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

సగ్గు బియ్యంలో డ్యూటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన జీర్ణవ్యస్థను ఆరోగ్యంగా ఉంచడానికి , మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. వీటిని తింటే అజీర్థి అనే సమస్యే ఉండదు. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. 
 

58
Asianet Image

బరువు పెరగడానికి సహాయపడుతుంది

బరువు పెరగాలనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. వీటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు. మీకు తెలుసా.. వీటిని తింటే మీ శరీరంలో ఇనుము లోపం ఉండే ఛాన్సే ఉండదు. బరువు తక్కువగా ఉన్నామని ఫీలైతే వీటితో రకరకాల రెసిపీలు చేసుకుని తినండి. ఎంచక్కా బరువు పెరుగుతారు. 
 

68
Asianet Image

గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

సగ్గుబియ్యం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ బి, డైటరీ ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగుతాయి. ఈ మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు జుట్టు, చర్మానికి కూడా ఇవి ప్రయోజనకరంగానే ఉంటాయి. 
 

78
Asianet Image

ఎముకలకు బలం

సగ్గుబియ్యం ఎముకలను బలంగా చేయడానికి కూడా సహాయపడతాయి. సగ్గుబియ్యంలో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తింటే ఎముక ఆరోగ్యం బాగుంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముక అరుగుదల ఉండదు. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 
 

88
Asianet Image

మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి 

రెగ్యులర్ గా సాబుదానాను తీసుకోవడం వల్ల శారీరక ఎదుగుదల బాగుంటుంది. అంతేకాదు ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది కూడా. సాబుదానాలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
జీవనశైలి
 
Recommended Stories
Top Stories