Blinking Benefits: కన్నార్పడం మర్చితే.. కళ్లుపోతయ్ జాగ్రత్త..
Blinking Benefits: ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నప్పుడో, టీవీ చూస్తున్నప్పుడో లేకపోతే ఫోన్ లో పూర్తిగా లీనమైనప్పుడో చాలా మంది కనురెప్పలను బ్లింక్ చేయడం మర్చిపోతుంటారు. కానీ ఇలా చేయడం చాలా ప్రమాదకరం.

కనురెప్పలు మాటిమాటికీ ఆర్పడం సహజ విషయం. మనకు తెలియకుండానే కనురెప్పలు వాటికవే బ్లింక్ అవుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి బ్లింక్ అవవు. మనం కూడా ఆ విషయాలను పెద్దగా పట్టించుకోం. ముఖ్యంగా టీవీలో లీనమైనప్పుడో, ఫోన్ లో మునిగిపోయినప్పుడే, లేకపోతే ఏదైన చదువుతున్నప్పుడో కనురెప్పలను ఆర్పడం మర్చిపోతుంటాం. నిజానికి ఇలా చేయడం కంటి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సేపు కనురెప్పలను బ్లింక్ చేయకుండా చూస్తే కళ్లు చాలా త్వరగా అలసిపోతాయి. అంతేకాదు దీనివల్ల కళ్లు డ్రైగా మారతాయి. అలాగే కంటిలో చెత్త కూడా పేరుకుపోయే ప్రమాదం ఉంది.
Eye beauty
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కనురెప్పలను తరచుగా బ్లింక్ చేస్తూ ఉండాలి. లేదంటే కళ్లు తొందరగా వృద్ధాప్యానికి గురవుతాయి. అలాగే కంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కంటిరెప్పలను తరచుగా ఆర్పకపోతే కంటిలో మలినాలు అలాగే ఉండిపోతాయి. ముఖ్యంగా కళ్లు డీహైడ్రేషన్ బారిన పడతాయి. దీంతో కంటిలో మంట మొదలవుతుంది. అంతేకాదు కళ్లు విపరీతంగా అలసిపోతాయి కూడా.
అందుకే తరచుగా కళ్లను ఆర్పుతూ ఉండాలి. అప్పుడే కంటి సమస్యలు పోతాయి. కంటిచూపు కూడా బాగుంటుంది. కళ్లు హైడ్రేట్ గా ఉంచి.. కంటిలో ఉండే మలినాలు బయటకు పోతాయి. ఇందుకోసం మీరు తప్పనిసరిగా రెండు సెకన్ల పాటు కళ్లను క్లోజ్ చేసి తెరవాలి. రోజులో వీలైనన్ని ఎక్కువ సార్లు ఇలా చేస్తే కళ్లు రిలాక్స్ అవుతాయి. కంటి సమస్యలు పోతాయి. ముఖ్యంగా కంప్యూటర్, ల్యాప్ టాప్, టీవీ, ఫోన్ ను ఎక్కువ సేపు చూసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని కళ్లకు రెస్ట్ ఇవ్వాలి.
ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల పాటు మీకు దూరంలో ఉన్న వస్తువులను తీక్షణంగా చూడాలి. దీనివల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. వెలుతురు ఎక్కువగా ఉంటే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ ను పెట్టుకోవాలి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా వాటి జీవిత కాలాన్ని కూడా పెంచడానికి సహాయపడతాయి.