MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

చలికాలంలో వెచ్చదనం చాలా అవసరం. కానీ ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా.. కాళ్లు మాత్రం ఇంకా చల్లగానే ఉంటాయి. అందుకే చాలా మంది రాత్రిళ్లు కాళ్లకు సాక్సులు వేసుకుని నిద్రపోతారు. దీనివల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 09 2022, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
socks

socks

ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండే వాళ్లు రోజుకు 6 నుంచి 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. కానీ పని కారణంగా చాలా మందికి తగినంత నిద్ర దొరకదు. రాత్రిపూట కంటినిండా నిద్రపోని వారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సరిగ్గా నిద్రపోవాలంటే మంచి డైట్ ను ఫాలో అవ్వాలి. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిళ్లు హాయిగా పడుకోవాలంటే బాడీ టెంపరేచర్ కూడా సరిగ్గా ఉండాలి. చలికాలంలో బాడీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా పాదాలు మరీ  చల్లగా అయిపోతుంటాయి. దీనివల్ల రక్తనాళాలు ఇరుక్కా మారుతాయి. దీనివల్ల రక్తం తక్కువగా సరఫరా అవుతుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. పడుకునే ముందు పాదాలను వేడిచేయడం వల్ల మీ మెదడుకు ఇది నిద్రవేళ అని స్పష్టంగా సంకేతాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. రాత్రిపూట మీ పాదాలు వేడిగా ఉండటానికి మంచి మార్గం సాక్సులను వేసుకోవడం. అయితే కొంతమంది ఈ సీజన్ లో రోజంతా సాక్సులను వేసుకుంటే.. ఇంకొంతమంది కేవలం నిద్రపోయే ముందు మాత్రమే వేసుకుంటారు. సాక్స్ లు మీ పాదాలను వెచ్చగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నైట్ టైం సాక్స్ ధరించి నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటివల్ల నిద్ర సమస్యలు తొలగిపోవడంతో పాటుగా హాయిగా నిద్రడుతుంది కూడా. సాక్స్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

38

సాక్సులను వేసుకునే విషయంలో ఈ తప్పులు చేయకూడదు

సైజు

సాక్స్ లను వేసుకుని పడుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అయితే సాక్స్ లను వేసుకునేటప్పుడు వాటి సైజును చెక్ చేయడం మర్చిపోకూడదు. ఎందుకంటే మరీ టైట్ గా ఉండే సాక్స్ లను వేసుకుని పడుకుంటే రక్త ప్రవాహం తగ్గే ప్రమాదం ఉంది.
 

48


సాక్స్ ల పరిశుభ్రత

 ఒకే జత సాక్స్  లను ను చాలా రోజులపాటు ఉపయోగించేవారున్నారు. కొంతమంది పాదాలకు నూనె రాసి ఆ తర్వాత సాక్సులను వేసుకుంటారు. దీనివల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయని. కానీ సాక్సులను మాత్రం శుభ్రం చేయలేదు. మురికిగా ఉండే సాక్స్ లను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే సంక్రమణకు దారితీస్తుంది. వాష్ చేయని సాక్సుల వాసన ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతిరోజూ వాడే సాక్స్ లను శుభ్రం చేసుకోండి. ఏదేమైనా మీ సాక్స్ లు తాజాగా ఉండేలా చూసుకోవడం మంచిది. 
 

58

మెరుగైన రక్త ప్రసరణ

రాత్రిపూట సాక్స్ లను వేసుకుని నిద్రపోతే రక్త ప్రసరణ మెరుగ్గాజరుగుతుంది. కొన్ని అధ్యయనాలు కూడా దీనిని నిరూపించాయి. పలు నివేదికల ప్రకారం సాక్స్ లను ధరించి నిద్రపోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులను, కండరాలను బలోపేతం చేస్తుంది.
 

68

రుతువిరతి సమస్యకు పరిష్కారం

రుతువిరతి సమయంలో నిద్ర సమస్యలు రావడం సర్వ సాధారణం. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో సాక్స్ లను ధరించి నిద్రపోవడం వల్ల ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందని భావిస్తారు. కానీ ఇది తప్పు. వెచ్చని పాదాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరిస్తుంది.
 

78

తొందరగా నిద్రపట్టేలా చేస్తుంది

చాలా మంది ఎంతసేపు కన్ను మూసినా నిద్రమాత్రం అస్సలు పోరు. మంచంపై అటూ ఇటూ దొర్లి దొర్లి ఎప్పటికో నిద్రపోతారు. ఇలాంటి వారికి సాక్సులు బగా ఉపయోగపడతాయి. ఎందుకంటే సాక్స్ వేసుకుని పడుకోవడం వల్ల మీరు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. చేతులు, కాళ్ళకు రక్త ప్రవాహం పెరిగేకొద్దీ మీ శరీర ఉష్ణోగ్రత మెరుగ్గా ఉంటుంది. దీంతో మీరు త్వరగా నిద్రపోతారు.
 

88

పాదాల పగుళ్లకు ఇది చక్కటి పరిష్కారం

శీతాకాలంలో మడమలు ఎక్కువగా పగుళుంటాయి. దీనివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. అంతేకాదు కొంతమందికి పగుళ్ల నుంచి రక్తస్రావం కూడా అవుతుంది. మడమ పొడి గాలికి గురైతే సమస్య పెరుగుతుంది. అందుకే ఇలాంటి సమయంలో సాక్స్ లను వేసుకుని నిద్రపోతే.. మీ కాలులోని తేమ అలాగే ఉంటుంది. అలాగే చర్మం మృదువుగా తయారవుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image2
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Recommended image3
Tiles Cleaning: కిచెన్ లో టైల్స్ పై నూనె పడిందా? ఒకే ఒక్క నిమిషం లో టైల్స్ ని ఇలా శుభ్రం చేసేయండి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved