MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • ఫోన్‌లో చూస్తూ చెవిలో గులిమిని క్లీన్ చేసుకోవ‌చ్చు.. అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్

ఫోన్‌లో చూస్తూ చెవిలో గులిమిని క్లీన్ చేసుకోవ‌చ్చు.. అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్

Ear Cleaner: చెవిలో పేరుకుపోయిన గులిమిని బ‌య‌ట‌కు తీయ‌డానికి ఈయ‌ర్ బ‌డ్స్ మొద‌లు పిన్నీసుల‌కు వ‌ర‌కు ఉప‌యోగిస్తుంటాం. అయితే మారిన కాలానికి అనుగుణంగా చెవిలో గులిమి తీసే ప్రొడ‌క్ట్స్ కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. అలాంటి ఓ ప్రొడక్ట్ వివరాలు.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 22 2026, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెవి లోపల స్పష్టంగా కనిపించేలా కెమెరా
Image Credit : Amazon.in

చెవి లోపల స్పష్టంగా కనిపించేలా కెమెరా

అమెజాన్‌లో Portronics Xlife Smart Wireless Ear Otoscope Cleaner పేరుతో ఈ ప్రొడ‌క్ట్ అందుబాటులో ఉంది. ఇందులో కెమెరా ఉండటంతో చెవి లోపలి భాగాన్ని స్మార్ట్‌ఫోన్‌లో చూస్తూ గులిమిని శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది. ధ‌ర విష‌యానికొస్తే ఈ ప్రొడ‌క్ట్ అస‌లు ధ‌ర రూ. 2499 కాగా 64 శాతం డిస్కౌంట్‌తో రూ. 890కి ల‌భిస్తోంది. ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. ఈ గ్యాడ్జెట్‌లో 1080p ఫుల్ HD కెమెరా ఉంది. దీంతో చెవి లోపలి భాగాన్ని ఫోన్ స్క్రీన్‌పై చూడొచ్చు. అలాగే ఇందులో 3MP కెమెరా, 6 LED లైట్లు ఉండటంతో చెవి లోపల కొంత మెరుగైన వెలుతురు లభిస్తుంది. చెవిలో గులిమి ఎక్కడ ఉందో గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫోన్‌కు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు
Image Credit : Amazon.in

ఫోన్‌కు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు

ఈ గ్యాడ్జెట్‌ను స్మార్ట్‌ఫోన్‌కు 2.4GHz Wi-Fi ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కంపెనీ అందించే Xlife యాప్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి గ్యాడ్జెట్ Wi-Fiకి కనెక్ట్ చేస్తే కెమెరా చూపించే దృశ్యాలను నేరుగా మొబైల్‌లో చూడొచ్చు. కెమెరా 20 FPS వేగంతో వీడియోను చూపిస్తుంది.

35
చిన్న సైజులో 3.5mm కెమెరా
Image Credit : Amazon.in

చిన్న సైజులో 3.5mm కెమెరా

ఈ చెవి క్లీనింగ్ గ్యాడ్జెట్ బరువు కేవలం 11 గ్రాములు మాత్రమే. ఇందులో 3.5mm లెన్స్ ఉంటుంది. అలాగే 3-యాక్సిస్ గైరోస్కోప్ ఉండటంతో చెవి లోపలి భాగాన్ని వివిధ కోణాల్లో చూడటానికి ఉపయోగపడుతుంది. చిన్నగా ఉండటంతో ఇంట్లో ఉపయోగించుకోవడంతో పాటు అవసరమైనప్పుడు వెంట తీసుకెళ్లడం కూడా సులభమే.

45
వీడియోలను రికార్డ్ చేసి సేవ్ చేసుకోవచ్చు
Image Credit : Amazon.in

వీడియోలను రికార్డ్ చేసి సేవ్ చేసుకోవచ్చు

ఈ గ్యాడ్జెట్‌తో చెవి లోపలి భాగాన్ని చూస్తూ అవసరమైతే వీడియోను క్యాప్చర్ చేసుకోవచ్చు. చెవిలో సాధారణంగా కనిపించని ఏదైనా సమస్య ఉన్నట్లు అనిపిస్తే ఆ వీడియోను డాక్టర్‌కు చూపించేందుకు ఉపయోగపడుతుంది. అయితే చెవి లోపల గ్యాడ్జెట్‌ను పెట్టి స్వయంగా గులిమి తీసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

55
ప్ర‌ధాన ఫీచ‌ర్లు ఇవి
Image Credit : Amazon.in

ప్ర‌ధాన ఫీచ‌ర్లు ఇవి

ఈ ప్రొడ‌క్ట్‌లో 1080p ఫుల్ HD కెమెరా, 3MP కెమెరా, 6 LED లైట్లు, 3.5mm లెన్స్, 3-యాక్సిస్ గైరోస్కోప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 11 గ్రాముల బరువు ఉండటం దీని మరో ప్రత్యేకత. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కెమెరాను కంట్రోల్ చేస్తూ చెవి లోపలి భాగాన్ని చూసుకోవచ్చు. అయితే ఇది వైద్య పరికరానికి ప్రత్యామ్నాయం కాదు. చెవి నొప్పి, రక్తస్రావం, వినికిడి తగ్గడం లేదా గులిమి ఎక్కువగా పేరుకుపోయిన సందర్భాల్లో స్వయంగా క్లీనింగ్ చేయకుండా ENT వైద్యుడిని సంప్రదించడం సురక్షితం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio AI Glasses: క‌ళ్ల‌ద్దాల‌తో UPI పేమెంట్స్ చేయొచ్చు.. జియో నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్
Recommended image2
Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ సేల్స్.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్ల పై బిగ్ డిస్కౌంట్స్.. టాప్ 5 డీల్స్ ఇవే
Recommended image3
Flipkart Big Billion Days: ధమాకా ఆఫర్.. రూ. 5,799 కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఛాన్స్
Related Stories
Recommended image1
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Recommended image2
వందే భార‌త్ రైలు కిలోమీట‌ర్ న‌డిస్తే.. ఎంత విద్యుత్ ఖ‌ర్చ‌వుతుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved