MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Food
  • Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..

Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..

Chepala Ulli Karam: సండే వచ్చిందంటే కాస్త స్పెషల్‌గా, రుచిగా, స్పైషీగా, నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. అందరికీ ఖాళీ దొరికేది సండేనే కాబట్టి. అందరూ ఎంజాయ్ చేసేలా మీ లంచ్‌లోకి అదిరిపోయే ఈ చేపల ఉల్లి కారం చేసుకోండి. ఒక మెతుకు కూడా మిగలదు. లొట్ట లేస్తారు.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 05 2026, 07:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చేపల ఉల్లి కారం రెసిపీ
Image Credit : shravani's kitchen/youtube

చేపల ఉల్లి కారం రెసిపీ

సండే వచ్చిందంటే కాస్త స్పెషల్‌గా, రుచిగా, స్పైషీగా, నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. అందరికీ ఖాళీ దొరికేది సండేనే కాబట్టి. అందరూ ఎంజాయ్ చేసేలా మీ లంచ్‌లోకి అదిరిపోయే ఈ చేపల ఉల్లి కారం చేసుకోండి. ఒక మెతుకు కూడా మిగలదు. లొట్ట లేస్తారు. రుచిగా అన్నం అంతా కూడా ఈ చేపల ఉల్లి కారంతోనే తినేస్తారు. మరి ఎలా చేసుకోవాలో రెసీపీ చూసేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చేపలకు మసాలా మారినేషనే అసలైన రుచి
Image Credit : shravani's kitchen/youtube

చేపలకు మసాలా మారినేషనే అసలైన రుచి

సుమారు 500 గ్రాముల అంటే అర కేజీ చేప ముక్కలు తీసుకోవాలి. ముందుగానే చేపలకు ఉప్పుని బాగా పట్టించి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే చేపల్ని కడిగాక నీళ్లు ఏమీ లేకుండా మొత్తం నీళ్లను పడేయాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి కొంచెం ఉప్పు కారాన్ని పట్టించాలి. ఒక టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని మరో అర టీ స్పూన్ ఉప్పుని చిటికెడంత పసుపుని తీసుకొని అన్నిటికీ బాగా పట్టించాలి. కొంచెం కొంచెంగా ఉప్పు కారం ధనియాల పొడిని తీసుకొని ముందుగా చేప ముక్కలకు బాగా పట్టించాలి. 

ఉప్పు కారం ధనియాల పొడిని ముందుగా చేప ముక్కలకు పట్టించడం వలన చేప ముక్క అనేది లోపలి వరకు కూడా ఆ రుచి అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి ఇలా అన్ని చేప ముక్కలకు బాగా పట్టించాలి. ఒక 10, 15 నిమిషాలు వీటిని ఇలాగే వదిలేయాలి. మీకు టైం ఉంటే ఇలా ఉప్పు కారం పట్టించాక గంట రెండు గంటలైనా పక్కన పెట్టొచ్చు.

Related Articles

Related image1
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Related image2
Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు
35
మసాలా పొడి, ఉల్లిపాయ పేస్ట్
Image Credit : shravani's kitchen/youtube

మసాలా పొడి, ఉల్లిపాయ పేస్ట్

ఇప్పుడు ఇంకొక పాన్ ని తీసుకొని ఇందులోకి అర టీ స్పూన్ మెంతులను అర టీ స్పూన్ జీలకర్రను అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలను తీసుకొని లో ఫ్లేమ్ లో వీటిని దోరగా వేపండి. తర్వాత వాటిని మిక్సీ పట్టి పొడి చేసుకోండి.

ఈలోగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలను గ్యాస్ పైన కాల్చుకోవాలి. ఉల్లిపొట్టు బాగా కాలిపోయేంత వరకు కాల్చి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లాక పేస్ట్ చేసుకోండి. అందులోనే కాసింత అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బండి.

45
ఉల్లికారం గ్రేవీ రెడీ
Image Credit : shravani's kitchen/youtube

ఉల్లికారం గ్రేవీ రెడీ

ఇప్పుడు చేపల ఉల్లి కారం చేయడానికి మళ్లీ ఇదే పాన్ లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని కరివేపాకు రెబ్బల్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్, అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఫ్రై చేయండి. ఇదే టైం లో గ్రైండ్ చేసిన 2 టమాటాల పేస్ట్ ని అందులోనే వేసేయండి. పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టీ స్పూన్ల కారం, గ్రైండ్ చేసిన ధనియాల పొడి కూడా వేసి బాగా కలపండి. ఈ గ్రేవీ పేస్ట్ అనేది మరీ ముద్దగా, మరీ నీళ్లలాగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి.

55
10 నిమిషాల్లో ఘుమఘుమలాడే చేపల ఉల్లికారం రెడీ
Image Credit : shravani's kitchen/youtube

10 నిమిషాల్లో ఘుమఘుమలాడే చేపల ఉల్లికారం రెడీ

ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకోవాలి, మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి. మూడు నిమిషాల తర్వాత మరోవైపు తిప్పి ఉడికించండి. చేపలను ఎక్కువ మారినేషన్ చేయడం వల్ల ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరి. కొంచెం పుల్లగా కావాలంటే పైన నిమ్మరసం వేసుకుంటే చాలు. నోరూరించే చేపల ఉల్లికారం రెడీ.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Recommended image2
Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved