MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు

Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు

Mandi Chicken Biryani: చికెన్ మండీ ఇంట్లో చేసుకోవడం కష్టంగా ఉందని రెస్టారెంట్ కు వెళ్తున్నారా? అయితే ఇలా ఒక్కసారి అరేబియన్ స్టైల్ చికెన్ మండీ ఇంట్లో ట్రై చేయండి. స్మోకీ ఫ్లేవర్‍తో నోరూరించే రెసిపీ మీ కోసం. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఉంది.

3 Min read
Author : Nandini Arava
Published : Aug 29 2026, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అరేబియన్ స్టైల్ మండి బిర్యానీ
Image Credit : amma chethi vanta/youtube

అరేబియన్ స్టైల్ మండి బిర్యానీ

చాలా మందికి చికెన్ మండి, మటన్ మండి అంటే ఇష్టం. దాని కోసమని వీకెండ్ వస్తే చాలు...రెస్టారెంట్ కు క్యూ కడతారు. ఇంట్లో చేయాలంటే ప్రాసెస్ పెద్దదని, కష్టమని ఫీలవుతారు. కానీ ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తం కంచాలు కంచాలు లాగించేస్తారు. ఎంతో రుచిగా ఉండే ఈ అరేబియన్ స్టైల్ మండి బిర్యానీకి ఫిదా అయిపోతారు

కావలసిన పదార్థాలు

కేజీన్నర చికెన్-లెగ్ పీసెస్ తీసుకోవాలి

బాస్మతీ రైస్-అరకిలో నుంచి ముప్పావు కిలో

చికెన్ మండి మసాలా

ఆయిల్

యాలకులు

దాల్చిన చెక్క

లవంగాలు

ఎండిన నిమ్మకాయ ముక్కలు

మిరియాలు

అల్లం వెల్లుల్లి పేస్ట్

పచ్చిమిర్చి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
చికెన్ మండి మసాలా తయారీ
Image Credit : amma chethi vanta/youtube

చికెన్ మండి మసాలా తయారీ

ధనియాలు-టేబుల్ స్పూన్, మిరియాలు-టేబుల్ స్పూన్, జీలకర్ర-టేబుల్ స్పూన్, సోంపు-టేబుల్ స్పూన్, దాల్చినచెక్క-2 ఇంచీలు, లవంగాలు-7-8, యాలకలు-6, నల్ల యాలక్కాయ-1, బిర్యానీ ఆకు-1, జాజికాయ- చిన్న ముక్క, జాపత్రి-పువ్వులో సగం, సొంటి-హాఫ్ ఇంచ్, ఎండిన నిమ్మకాయ-హాఫ్ ముక్క, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు...ఇవన్నీ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

Related Articles

Related image1
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Related image2
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
37
చికెన్ మారినేట్
Image Credit : amma chethi vanta/youtube

చికెన్ మారినేట్

మొదట చికెన్ పీస్ లకు గాట్లు పెట్టుకుని ఉప్పు, ఒక నిమ్మకాయ రసం పిండి, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మసాజ్ చేసి గంట పాటు మారినేట్ చేసుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ కూడా మారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక అనాస పువ్వు, 2-3 ఇంచ్ ల దాల్చిన చెక్క, మూడు యాలకులు, 6 మిరియాలు, 4 లవంగాలు, ఎండిన నిమ్మతొక్కలు, టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ వేయాలి. దానిపైన 6-8 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కావాలంటే కాస్త వాటర్ వేసుకుని అటు ఇటూ తిప్పుతూ 80-90 శాతం ఉడికించాలి. ఆ తర్వాత చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉండే నీళ్లను కూడా ఉంచాలి, పడేయకూడదు.

47
చికెన్ పై క్రిస్పీ లేయర్ వచ్చే వరకూ ఫ్రై
Image Credit : amma chethi vanta/youtube

చికెన్ పై క్రిస్పీ లేయర్ వచ్చే వరకూ ఫ్రై

ఇప్పుడు ముప్పావు కేజీ బాస్మతీ రైస్ కడిగి అరగంటపాటు నాననివ్వాలి. ఇప్పుడు చల్లారిన చికెన్ లో 3 టేబుల్ స్పూన్ మండి మసాలా వేసుకుని మొత్తం అంటేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి చికెన్ పై క్రిస్పీ లేయర్ వచ్చే వరకూ ఫ్రై చేయాలి. కొంచెం పైన ఉప్పు చల్లుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు ఉప్పు తగ్గి ఉంటుంది. అందుకే మళ్లీ కాస్త పైన ఉప్పు స్ప్రింకిల్ చేసుకోవాలి.

57
చికెన్ స్టాక్ ఇందులో వేసుకోవాలి
Image Credit : amma chethi vanta/youtube

చికెన్ స్టాక్ ఇందులో వేసుకోవాలి

ఇప్పుడు మరో పాన్ లో నూనె, నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్ మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో 2-3 ఉల్లిపాయ ముక్కలు, 7-8 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అది వేగాక అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులోనే అరకప్పు పెరుగు, కాస్త ఉప్పు వేసి కలిపి ఇప్పుడు మిగిలిన మండి మసాలా వేసేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన చికెన్ వాటర్ వేసేసుకోవాలి. రైస్ కి సరిపడా ఎసరు వేసేసుకోవాలి. ఏ గ్లాస్ తో బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ ని కొలుచుకోవాలి. ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర నుంచి ఒకటి ముప్పావు గ్లాస్ దాకా వాటర్ పడుతుంది. సో టోటల్ గా మూడు గ్లాసుల బాస్మతి రైస్ కి ఐదు గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవాలి. చికెన్ స్టాక్ తో కలిపి. ఎసరు వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ ని అడ్జస్ట్ చేయండి. మూత పెట్టి ఎసరు మరిగేంత వరకు కూడా ఉడికించాలి.

67
10 మినిట్స్ పాటు దమ్ చేయాలి
Image Credit : amma chethi vanta/youtube

10 మినిట్స్ పాటు దమ్ చేయాలి

నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని నీళ్లు లేకుండా వాడ్ చేసి ఆ రైస్ మొత్తాన్ని కూడా ఎసరులోకి వేసేసి కలిపేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రైస్ కాస్త దగ్గరికి ఉడికేంత వరకు కూడా కుక్ చేయాలి. మూత పెట్టుకుని ఉడికించాలి. మధ్యలో ఒకటి రెండు సార్లు గరిటతో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించాలి. ఇలా రైస్ అనేది కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సాఫ్రాన్ వాటర్ ని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం. మళ్లీ మూత పెట్టి రైస్ ని కుక్ చేయండి. రైస్ అడుగున కాస్త చెమ్మ ఉన్నప్పుడే లైట్ గా చెమ్మ ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మండి పీసెస్ బిర్యానీ పైన సర్దేసేయండి. లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పాటు దమ్ చేయండి.

77
స్మోకీ ఫ్లేవర్ కోసం
Image Credit : amma chethi vanta/youtube

స్మోకీ ఫ్లేవర్ కోసం

ఈ బిర్యానీకి ఫైనల్ టచ్ కింద స్మోక్ ని ఇవ్వాలి. బొగ్గులు ఉంటే బొగ్గుల్ని కాల్చుకుని అయినా చేయొచ్చు లేదంటే కొబ్బరి చిప్పలు బ్యాక్ సైడ్ ఉండే చిప్పల్ని కాస్త కాల్చేసి నిప్పులు అయ్యాక ఇలా చిన్న గిన్నెలోకి వేసుకొని సెంటర్ లోకి పెట్టి కాస్త నెయ్యిని గాని బటర్ ని గాని వేసి వెంటనే మూత పెట్టేసేయండి. ఆ స్మోక్ అంతా కూడా బిర్యానీకి చికెన్ పీసెస్ కి చక్కగా పడుతుంది. అలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉంచితే సరిపోతుంది. అంతే నోరూరించే అరేబియన్ చికెన్ మండీ రెడీ.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: సిగ్గు పడ్డట్లు అస్సలు అనిపించలేదు, మరిది సినిమాపై రష్మిక క్రేజీ కామెంట్స్
Recommended image2
EPIC Trailer: ఎపిక్ ట్రైలర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కెమిస్ట్రీ అదిరిందిగా.. హిట్ కొట్టేసినట్లేనా
Recommended image3
Ashika Ranganath: రవితేజ హీరోయిన్ కొత్త లుక్ వైరల్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫోటోలు ఇవే
Related Stories
Recommended image1
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image2
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved