MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Feature
  • పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?

పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?

భారతదేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆగస్టు 18న ఈ వేడుకలు జరుగుతాయి. అలా ఎందుకు చేసుకుంటారో తెలుసా?

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 19 2026, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం
Image Credit : Nehru Memorial Museum and Library

ఆ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం

మన దేశమంతా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటాము. కానీ పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆరోజు నిర్వహించుకోరు. వారికి ఆగస్టు 18న స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకుంటారు. అందుకే ఆ రోజే నిర్వహించుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాలు ఆగస్టు 18నే స్వాతంత్య్ర దినోత్సవం సెలెబ్రేట్ చేసుకుంటాయి. అలా ఎందుకు చేసుకుంటారో తెలుసుకోండి.

1947లో భారత విభజన సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం సరిహద్దుల విభజన బాధ్యతను లండన్‌కు చెందిన న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ కు అప్పగించింది. అంతకుముందు ఎన్నడూ భారతదేశానికి రాని రాడ్‌క్లిఫ్, సరిహద్దు కమిషన్లకు ఛైర్మన్‌గా వ్యవహరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హిందూ జనాభా ఎక్కువగా ఉండడంతో
Image Credit : Getty

హిందూ జనాభా ఎక్కువగా ఉండడంతో

వారు గీసిన ప్రాథమిక మ్యాప్ ప్రకారం పశ్చిమ బెంగాల్ లోని హిందూ జనాభా ఎక్కువగా ఉన్న నదియా, మాల్దా, ముర్షిదాబాద్, దినాజ్‌పూర్ వంటి ప్రాంతాలను పొరపాటున తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) భూభాగంలో చూపించారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే, ఈ ప్రాంతాల ప్రజలు తాము ఏ దేశంలో ఉన్నామో తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Related Articles

Related image1
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Related image2
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
33
చివరికి ఏం జరిగింది?
Image Credit : Nehru Memorial Museum and Library/Wikimedia Commons

చివరికి ఏం జరిగింది?

తాత్కాలిక మ్యాప్ ఆధారంగా ఆగస్టు 14, 15 తేదీలలో నదియాలోని కృష్ణనగర్, మాల్దాలోని ఇంగ్లీష్ బజార్ వంటి ప్రభుత్వ భవనాలపై పాకిస్తాన్ జాతీయ జెండాలను కూడా ఎగురవేశారు.

ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, హిందూ మహాసభ నాయకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, నదియా రాజకుటుంబీకులు తీవ్ర నిరసనలు వ్యక్తంచేసి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్‌ను ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన మౌంట్‌బాటన్, రాడ్‌క్లిఫ్‌ను సరిహద్దులను సరిచేయాల్సిందిగా ఆదేశించారు. ఆగస్టు 17 రాత్రి ఆల్ ఇండియా రేడియో ద్వారా సవరించిన మ్యాప్ వివరాలను ప్రకటించారు. దీని ప్రకారం ఈ ముస్లిమేతర మెజారిటీ ప్రాంతాలు భారతదేశంలోనే ఉంటాయని స్పష్టమైంది. రేడియో ప్రకటన తర్వాత, 1947 ఆగస్టు 18 మధ్యాహ్నం ఆయా ప్రాంతాల్లోని పాకిస్తాన్ జెండాలను తొలగించి, మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఎగురవేశారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rare Trees: ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Recommended image2
Samosa: సమోసా ఏ దేశంలో పుట్టింది? మనదేశంలోకి ఎప్పుడు, ఎలా అడుగుపెట్టింది?
Recommended image3
Countries: ఈ దేశాలకు అధ్యక్షుడు లేడు, ప్రధాని ఉండరు.. అయినా ప్రజలందరూ హ్యాపీగా బతుకుతున్నారు
Related Stories
Recommended image1
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Recommended image2
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved