MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana: ఇక‌పై ఆహారం క‌ల్తీ చేయాలంటే వ‌ణ‌కాల్సిందే.. తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల నిర్ణ‌యం

Telangana: ఇక‌పై ఆహారం క‌ల్తీ చేయాలంటే వ‌ణ‌కాల్సిందే.. తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల నిర్ణ‌యం

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు మరో కీలక అడుగు వేసింది. ఆహార పదార్థాలు, మందులు, కాస్మెటిక్స్ నాణ్యతను మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్ర గ్స్ (TG SAFE) ఏర్పాటు చేసింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 16 2026, 11:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకే సంస్థ కింద ఫుడ్ సేఫ్టీ, Drugs కంట్రోల్
Image Credit : Asianet News

ఒకే సంస్థ కింద ఫుడ్ సేఫ్టీ, Drugs కంట్రోల్

కొత్త వ్యవస్థలో ఆహార భద్రత, ఔషధాల నియంత్రణకు సంబంధించిన అన్ని కీలక బాధ్యతలు TG SAFE ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తారు. ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, కాస్మెటిక్స్‌కు లైసెన్సులు మంజూరు చేయడం నుంచి తనిఖీలు, నమూనాల సేకరణ, ప్రయోగశాల పరీక్షలు, నిబంధనల అమలు వరకు అన్ని ప్రక్రియలు సమన్వయంతో కొనసాగనున్నాయి. దీంతో రెండు శాఖల మధ్య సమన్వయం మెరుగుపడి, నిర్ణయాలు వేగంగా అమలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కల్తీ ఆహారం, నకిలీ మందులపై ప్రత్యేక నిఘా
Image Credit : Asianet News

కల్తీ ఆహారం, నకిలీ మందులపై ప్రత్యేక నిఘా

రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ లేదా నాసిరకం మందులపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు TG SAFE ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఇంటెలిజెన్స్ ఆధారిత సమాచారం సేకరణతో పాటు రిస్క్ ఆధారిత తనిఖీలను నిర్వహించనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ నుంచి అవసరమైన సిబ్బందిని డీజీపీ కేటాయించనున్నారు. దీంతో అక్రమాలకు పాల్పడే వారిపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
మురికి కాలువ కోసం భూమి తవ్వుతుండ‌గా అద్భుతం.. బ‌య‌ట‌ప‌డ్డ‌ రూ. 98 కోట్ల నిధి
Related image2
Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం, వ‌చ్చే 2 రోజులు భారీ వ‌ర్షాలు
35
ఒకే ల్యాబ్ వ్యవస్థ.. ఆధునిక పర్యవేక్షణ
Image Credit : Asianet News

ఒకే ల్యాబ్ వ్యవస్థ.. ఆధునిక పర్యవేక్షణ

ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న ఫుడ్ టెస్టింగ్, డ్ర గ్స్ టెస్టింగ్ ప్రయోగశాలలను ఒకే ల్యాబొరేటరీ వ్యవస్థ కిందకు తీసుకురానున్నారు. దీంతో నమూనాల పరీక్షలు వేగంగా పూర్తికావడంతో పాటు రిపోర్టుల్లో సమన్వయం పెరుగుతుంది. అలాగే డ్ర గ్స్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ అండ్ ప్రాసిక్యూషన్, ల్యాబొరేటరీ, అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రత్యేక విభాగాలు TG SAFE పరిధిలో పనిచేయనున్నాయి. టెస్టింగ్, డేటా విశ్లేషణ, లీగల్ సపోర్ట్, ప్రయోగశాలల ఆధునీకరణ కోసం రాష్ట్రస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

45
తొలి దశలో క్యూర్ ప్రాంతంలో కార్యకలాపాలు
Image Credit : Asianet News

తొలి దశలో క్యూర్ ప్రాంతంలో కార్యకలాపాలు

ఫార్మా కంపెనీలు, ఆహార ఉత్పత్తి సంస్థలు అధికంగా ఉన్న క్యూర్ (CURE) ప్రాంతంలో తొలి దశలో TG SAFE కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాంతంలో నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసిన తర్వాత దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా సేవలను విస్తరించే అవకాశం ఉంది. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో వేగంగా స్పందించడంతో పాటు వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

55
TG SAFE కమిషనర్‌గా అవినాశ్ మొహంతి
Image Credit : Asianet News

TG SAFE కమిషనర్‌గా అవినాశ్ మొహంతి

TG SAFE తొలి కమిషనర్‌గా సీనియర్ అధికారి అవినాశ్ మొహంతిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన డ్ర గ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు బాధ్యతగా TG SAFE కమిషనర్ పదవిని కూడా అప్పగించారు. ఫుడ్ సేఫ్టీ, డ్ర గ్స్ కంట్రోల్ విభాగాల పరిపాలనా బాధ్యతలు ఇకపై కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. ఈ నిర్ణయానికి సంబంధించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 67 జారీ చేసింది. ఆగస్టు 15, 2026 నుంచి TG SAFE అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం, వ‌చ్చే 2 రోజులు భారీ వ‌ర్షాలు
Recommended image2
Shanarthi: శ‌నార్తి అంటే అర్థం ఏంటో తెలుసా.? అస‌లీ ప‌దం ఎక్క‌డి నుంచి వ‌చ్చిందంటే
Recommended image3
Weather Update: పసిఫిక్ నుంచి అరేబియా దాకా సముద్రంలో తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
Related Stories
Recommended image1
మురికి కాలువ కోసం భూమి తవ్వుతుండ‌గా అద్భుతం.. బ‌య‌ట‌ప‌డ్డ‌ రూ. 98 కోట్ల నిధి
Recommended image2
Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం, వ‌చ్చే 2 రోజులు భారీ వ‌ర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved