MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anirudh Kavya Wedding: అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఎక్కడో తెలుసా? వాహ్‌

Anirudh Kavya Wedding: అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఎక్కడో తెలుసా? వాహ్‌

Anirudh Kavya Wedding: సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్‌ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వీరిద్దరూ విదేశాల్లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 19 2026, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి ఫిక్స్ ?
Image Credit : Asianet News

అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి ఫిక్స్ ?

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌ల పెళ్లి గురించి కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చకు కొత్త ఊపు వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, ఈ జంట నవంబర్ 10న గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

నవంబర్ 10న పెళ్లా?

అనిరుధ్, కావ్యల పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. చాలా కాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వీరి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు వచ్చిన వార్తలో నవంబర్ 10 పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంతకుముందు పెళ్లి వెన్యూ సీషెల్స్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు గ్రీస్‌లో పెళ్లి జరగవచ్చనే టాక్ నడుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంధువు కామెంట్.. పెరిగిన అనిరుధ్‌, కావ్య పెళ్లి చర్చ!
Image Credit : Instagram

బంధువు కామెంట్.. పెరిగిన అనిరుధ్‌, కావ్య పెళ్లి చర్చ!

ఈ పెళ్లి చర్చకు ఊపు రావడానికి ముఖ్య కారణాల్లో ఒకటి, అనిరుధ్ బంధువు, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన ఒక కామెంట్. గత జూన్‌లో, అనిరుధ్, కావ్యల పెళ్లి త్వరలో జరుగుతుందని ఆయన మాట్లాడారు. ఇదే ఈ వదంతులకు మరింత బలాన్నిచ్చింది. అయినప్పటికీ, ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ పెద్దగా హడావుడి లేకుండా, కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నారట. గ్రీస్‌లో పెళ్లి తర్వాత, ఇద్దరూ కలిసి హనీమూన్‌ గ్రాండ్‌గానే ప్లాన్‌ చేసుకున్నారట.

34
అధికారిక ప్రకటన ఇంకా రాలేదు
Image Credit : Instagram

అధికారిక ప్రకటన ఇంకా రాలేదు

ఇన్ని వార్తలు వస్తున్నా, ఈ పెళ్లి వార్తలను అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఇరు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి నవంబర్ 10న గ్రీస్‌లో పెళ్లి ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

పెళ్లికి ముందు ఫుల్ బిజీ!

ఈ రూమర్స్ మధ్యలో, అనిరుధ్ తన కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'వై దిస్ కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అతను, ప్రస్తుతం బిగ్‌ మూవీస్‌కి సంగీతం అందిస్తున్నాడు. పెళ్లికి ముందే తన కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేయాలని చూస్తున్నాడట. అతని అప్‌కమింగ్ ప్రాజెక్టులలో 'ది ప్యారడైజ్', 'జైలర్ 2' వంటి సినిమాలు ఉన్నాయి. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ మూవీస్‌ ఉన్నాయి. వీటితో పాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా మ్యూజిక్ పనులను కూడా పెళ్లికి ముందే పూర్తి చేసే అవకాశం ఉంది.

44
అనిరుధ్-కావ్య పెళ్లిపై ఎందుకింత చర్చ?
Image Credit : stockPhoto

అనిరుధ్-కావ్య పెళ్లిపై ఎందుకింత చర్చ?

అనిరుధ్, భారతీయ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత దర్శకులలో ఒకడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ తన మ్యూజిక్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు. మరోవైపు, కావ్య మారన్, సన్ గ్రూప్, సన్‌రైజర్స్ హైదరాబాద్(ఐపీఎల్‌ ) టీమ్ ద్వారా అందరికీ సుపరిచితురాలు. ముఖ్యంగా, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో ఆమె ఇచ్చే రియాక్షన్లు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తాయి. అందుకే, సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన ఈ ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సహజంగానే భారీ అంచనాలను సృష్టించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Recommended image2
Sivakarthikeyan Salary: మాట్లాడుకున్న దానికంటే డబుల్ డిమాండ్‌ చేసిన శివకార్తికేయన్‌.. దెబ్బకి నిర్మాత షాక్‌
Recommended image3
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Recommended image2
RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved