MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • KL Rahul Love Story: బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు.. కేఎల్ రాహుల్ - అథియా శెట్టి లవ్ స్టోరీ ఇదే

KL Rahul Love Story: బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు.. కేఎల్ రాహుల్ - అథియా శెట్టి లవ్ స్టోరీ ఇదే

KL Rahul Love Story: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, నటి అథియా శెట్టి లవ్ స్టోరీ మీకు తెలుసా? బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు సాగిన ప్రయాణం.. వీరిద్దరి చదువు, వివాహం, ఆస్తుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సునీల్ శెట్టి కూతురితో టీమిండియా స్టార్ ప్రేమ ప్రయాణం.. ఆస్తి ఎంతో తెలిస్తే షాకే
Image Credit : Asianet News

సునీల్ శెట్టి కూతురితో టీమిండియా స్టార్ ప్రేమ ప్రయాణం.. ఆస్తి ఎంతో తెలిస్తే షాకే

టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు, నటి అథియా శెట్టిల బంధం స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కన్నడిగుడైన కేఎల్ రాహుల్, అథియా శెట్టి మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు, వారి సంబంధం పెళ్లి వరకు ఎలా సాగింది, వారి చదువు, ఆస్తుల వివరాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బెంగళూరులో మొదలైన సీక్రెట్ లవ్ స్టోరీ
Image Credit : our own

బెంగళూరులో మొదలైన సీక్రెట్ లవ్ స్టోరీ

కేఎల్ రాహుల్ (కణ్ణూర్ లోకేష్ రాహుల్) కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన కుటుంబం మంగళూరు ప్రాంతానికి చెందినది. వీరిద్దరి ప్రేమకథ 2019 ప్రారంభంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో మొదలైంది. వీరిద్ధరికీ తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మొదటి భేటీలోనే ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో మంచి స్నేహితులుగా మారారు. అయితే తమ లవ్ మేటర్ బయటకు రాకుండా చాలా కాలం పాటు మీడియా కంటికి చిక్కకుండా సీక్రెట్‌గా ఉంచారు.

Related Articles

Related image1
Weather Update: తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Related image2
India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
36
రూమర్లు నుంచి అఫీషియల్ పోస్ట్ వరకు
Image Credit : Asianet News

రూమర్లు నుంచి అఫీషియల్ పోస్ట్ వరకు

వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ చేసిన ఒక కామెంట్ ద్వారా మొదట బయటకు వచ్చాయి. అథియా సోషల్ మీడియా పోస్ట్‌పై ఆయన సరదాగా కామెంట్ చేయడంతో అభిమానులు అనుమానించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా పిక్స్ ఆధారంగా నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేశారు. చివరకు 2021లో అథియా బర్త్‌డే సందర్భంగా కేఎల్ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రొమాంటిక్ పిక్ షేర్ చేస్తూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు.

46
తోడుగా ప్రయాణం.. ఖండాలాలో గ్రాండ్ వెడ్డింగ్
Image Credit : Asianet News

తోడుగా ప్రయాణం.. ఖండాలాలో గ్రాండ్ వెడ్డింగ్

ప్రేమను ఒప్పుకున్న తర్వాత అథియా, కేఎల్ రాహుల్ ఆందోళన లేకుండా జంటగా కనిపించడం మొదలుపెట్టారు. రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ టూర్లకు అథియా వెళ్లేది. ఇద్దరూ కలిసి కొన్ని బ్రాండ్ ప్రకటనల్లో కూడా నటించారు. అథియా సోదరుడు అహాన్ శెట్టి నటించిన 'తడప్' సినిమా ప్రీమియర్ షోకు రాహుల్ హాజరై శెట్టి ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు. చివరికి జనవరి 23, 2023న మహారాష్ట్రలోని ఖండాలాలో ఉన్న సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు వివాహబంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత మార్చి 2025లో ఈ దంపతులు ఒక ముద్దుల పాపకు జన్మనిచ్చారు.

56
కేఎల్ రాహుల్, అథియా శెట్టిలు ఏం చదువుకున్నారు?
Image Credit : @Athiya Shetty

కేఎల్ రాహుల్, అథియా శెట్టిలు ఏం చదువుకున్నారు?

క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన కేఎల్ రాహుల్ చదువులోనూ ముందున్నారు. సూరత్కల్‌లోని ఎన్‌ఐటీకే (NITK) ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పాఠశాల విద్యను, మంగళూరులోని సెయింట్ అలోసియస్ కాలేజీలో పియుసి (PUC) పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ పట్టా పొందారు.

అటు అథియా శెట్టి ముంబైలోని ప్రముఖ ది కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలలో చదువుకున్నారు. అనంతరం అమెరికాలోని ప్రసిద్ధ 'న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ' (NYFA) నుంచి ఫిల్మ్‌మేకింగ్ అండ్ లిబరల్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు.

66
ఇద్దరి నెట్ వర్త్ ఎంతంటే?
Image Credit : ANI

ఇద్దరి నెట్ వర్త్ ఎంతంటే?

క్రికెట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కేఎల్ రాహుల్ భారీగానే ఆర్జించారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, ఐపీఎల్ శాలరీ, ప్రముఖ బ్రాండ్ల ప్రచారాల ద్వారా కేఎల్ రాహుల్ మొత్తం ఆస్తి విలువ దాదాపు ₹101 కోట్లుగా అంచనా.

ఇక అథియా శెట్టి సినిమాలతో పాటు ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్‌లు, డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా సంపాదిస్తున్నారు. ఆమె నికర ఆస్తి విలువ సుమారు ₹30 కోట్ల నుంచి ₹45 కోట్ల వరకు ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Related Stories
Recommended image1
Weather Update: తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Recommended image2
India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved