MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Countries: ఈ దేశాలకు అధ్యక్షుడు లేడు, ప్రధాని ఉండరు.. అయినా ప్రజలందరూ హ్యాపీగా బతుకుతున్నారు

Countries: ఈ దేశాలకు అధ్యక్షుడు లేడు, ప్రధాని ఉండరు.. అయినా ప్రజలందరూ హ్యాపీగా బతుకుతున్నారు

Countries: దాదాపు అన్ని దేశాలకు అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఉంటారు. కానీ కొన్ని దేశాలకు మాత్రం ఎలాంటి వారెవరూ లేకపోయినా ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ఆ దేశాలు ఏవి? అక్కడ పాలన చేసేది ఎవరో తెలుసుకోండి

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 19 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సౌదీ అరేబియా, ఒమన్ దేశాలు
Image Credit : X

సౌదీ అరేబియా, ఒమన్ దేశాలు

సౌదీ అరేబియాలో ఇప్పటికీ రాచరికం అమల్లో ఉంది. ఇక్కడ రాజే సర్వోన్నత అధికారి. అతడు ఏం చెబితే అదే జరుగుతుంది. దేశ వ్యవహారాలు, కీలక విధాన నిర్ణయాలు, జాతీయ పరిపాలన అంతా రాజు పర్యవేక్షణలోనే జరుగుతుంది. అందుకే ఇక్కడ అధ్యక్షుడి అవసరం లేదు. ప్రస్తుతం సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రాజుగా ఉన్నారు.

ఒమన్

ఒమన్‌ను సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ పాలిస్తున్నారు. దేశంపై ఆయనకు విస్తృత కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, విదేశీ సంబంధాలు, జాతీయ పరిపాలనను సుల్తానే నిర్దేశిస్తారు. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా అధ్యక్షుడి పదవి అవసరం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బ్రూనై, ఖతార్ దేశాలు
Image Credit : our own

బ్రూనై, ఖతార్ దేశాలు

బ్రూనైలో సుల్తాన్ హసనల్ బోల్కియా నేతృత్వంలో సంపూర్ణ రాచరికం ఉంది. ఆయన దేశానికి పాలకుడిగా ఉండటమే కాకుండా, ప్రధానమంత్రి విధులను కూడా నిర్వర్తిస్తారు. దీనివల్ల కార్యనిర్వాహక అధికారం మొత్తం ఒకే పదవిలో కేంద్రీకృతమై ఉంటుంది.

ఖతార్

ఖతార్ రాజకీయ వ్యవస్థ వారసత్వ రాచరికంపై ఆధారపడి ఉంది. దేశానికి అత్యున్నత అధికారి ఎమిర్. రాజకీయ, పరిపాలన, వ్యూహాత్మక నిర్ణయాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అధ్యక్షుడి అవసరం లేకుండానే దేశాన్ని నడిపిస్తున్నారు.

33
ఎస్వటిని, వాటికన్ సిటీ దేశాలు
Image Credit : X

ఎస్వటిని, వాటికన్ సిటీ దేశాలు

గతంలో ఎస్వటిని దేశాన్ని స్వాజిలాండ్‌గా పిలిచేవారు. ఆఫ్రికాలోని కొన్ని సంపూర్ణ రాచరిక దేశాలలో ఒకటి. ఇక్కడ రాజు మస్వాతి III పాలన, ప్రజా పరిపాలనపై విస్తృత అధికారాలు కలిగి ఉన్నారు. ఎన్నికైన జాతీయ నాయకుడికి బదులుగా, రాచరికమే దేశ రాజకీయ నిర్మాణానికి కేంద్రంగా ఉంది.

వాటికన్ సిటీ

వాటికన్ సిటీకి దేశాధినేత, సార్వభౌమాధికారి పోప్ మాత్రమే. రోమన్ క్యాథలిక్ చర్చి సుప్రీం నాయకుడిగా ఉన్న పోప్‌కు దేశ శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలపై సంపూర్ణ అధికారాలు ఉంటాయి. పోప్ పదవి వంశపారంపర్యమైనది కాదు. పోప్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్స్ రహస్య ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
US High Paying Jobs: అమెరికాలో ఏ ఉద్యోగాలకు అత్యధిక జీతం వస్తుంది? భారతీయులకు టాప్ 7 ఆప్షన్స్ ఇవే
Recommended image2
Gold Loan : గోల్డ్ లోన్ మొత్తం కట్టేశారా? అయినా బ్యాంక్ మీ నగలు ఇవ్వకపోతే ఏం చేయాాలో తెలుసా?
Recommended image3
Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
Related Stories
Recommended image1
పంచదార తినడం మానేస్తే చాలు ముఖం మెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే
Recommended image2
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved