MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే

Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే

Biryani Business: బిర్యానీ వ్యాపారంలో ఉన్న అవకాశాలను ఈ కథనం వివరిస్తుంది. రోజూ 50 ప్లేట్ల బిర్యానీని రూ.90 చొప్పున అమ్మితే, నెలకు రూ.1.35 లక్షల ఆదాయం సంపాదించవచ్చని అంచనా. దీనికి సంబంధించిన పూర్తి లెక్కలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 19 2026, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తక్కువ పెట్టుబడితో బిర్యానీ బిజినెస్
Image Credit : Gemini AI

తక్కువ పెట్టుబడితో బిర్యానీ బిజినెస్

బిర్యానీకి లవర్స్ ఎక్కువ. ప్రతిరోజూ బిర్యానీ తినేవారు కూడా ఎక్కువే. అందుకే బిర్యానీ బిజినెస్ బాగా నడుస్తుంది. దీనికి పెట్టే పెట్టుబడి కూడా తక్కువే. అందుకే చిన్నగా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. రోడ్డు పక్కన చిన్న బండిపై కూడా బిర్యానీ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. ఒక ప్లేట్ బిర్యానీ రూ.90 ధర నిర్ణయించి.. రోజూ 50 ప్లేట్లు అమ్మితే నెలకు రూ.1.35 లక్షల ఆదాయం వస్తుంది. సరుకులు, అద్దె, సిబ్బంది జీతాలు, గ్యాస్, ఇతర ఖర్చులు తీసేస్తేనే అసలు లాభం తెలుస్తుంది.

ఏ వ్యాపారంలోనైనా అమ్మకాలు మాత్రమే సరిపోవు. ఫుడ్ క్వాలిటీ, ధర, లొకేషన్, కస్టమర్లు, సరుకుల ఖర్చు, రోజువారీ నిర్వహణ వంటివి లాభాన్ని నిర్ణయించే కీలకమైన అంశాలు. ఉదాహరణకు, ఒక ప్లేట్ బిర్యానీని రూ.90కి అమ్ముతున్నారని అనుకుందాం. రోజూ 50 ప్లేట్లు అమ్మితే, ఒక రోజు మొత్తం అమ్మకం రూ.4,500 అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నెల ఆదాయం ఎంత?
Image Credit : social media

నెల ఆదాయం ఎంత?

బిర్యానీ బిజినెస్ 30 రోజుల పాటూ అమ్మకాలు జరిగితే, నెల మొత్తం ఆదాయం రూ.1.35 లక్షలు అవుతుంది. కానీ ఈ రూ.1.35 లక్షలు మొత్తం లాభం అనుకుంటే పొరపాటే. అసలు లాభం తెలియాలంటే అన్ని ఖర్చులనూ తీసేయాలి. బిర్యానీ తయారీకి అవసరమైన బియ్యం, మాంసం, నూనె, మసాలాలు, కూరగాయల వంటి సరుకులకు నిరంతరం ఖర్చు అవుతుంది. వీటితో పాటు షాప్ లేదా కిచెన్ అద్దె, సిబ్బంది జీతాలు, కరెంట్, గ్యాస్, నీళ్లు, ప్యాకింగ్, రవాణా ఖర్చులు కూడా ఉంటాయి.

Related Articles

Related image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Related image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
33
అసలు లాభం ఇది
Image Credit : social media

అసలు లాభం ఇది

ఇలాంటి ఖర్చులన్నీ కలిపి నెలకు సుమారు రూ.80,000 వరకు కావచ్చని అంచనా. ఆ స్థాయిలో ఖర్చులు పోగా, రూ.1.35 లక్షల ఆదాయంలో సుమారు రూ.55,000 మిగలవచ్చు. అమ్మకాలు ఇంకా పెరిగితే లాభాలు భాగా కనిపిస్తాయి. దగ్గర్లోని ఆఫీసులు, కంపెనీలు, చిన్న చిన్న ఫంక్షన్లు, కుటుంబ వేడుకలకు బల్క్ ఆర్డర్లు తీసుకోవచ్చు.

చివరగా, రోజుకు 50 ప్లేట్లు అమ్మడం అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అసలు అమ్మకాలు లొకేషన్, ధర, ఫుడ్ క్వాలిటీ, పోటీ, సరుకుల ధరలు, కస్టమర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా, రూ.1.35 లక్షలు అనేది నెలవారీ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కాగా, రూ.55,000 అనేది ఇచ్చిన ఖర్చుల అంచనా ఆధారంగా మిగిలిన మొత్తం మాత్రమే. వ్యాపారం ప్రారంభించే ముందు, చిన్న స్థాయిలో ఒక ట్రయల్ రన్ చేసి, రోజువారీ అమ్మకాలు, ఖర్చులను రికార్డ్ చేసుకోవడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved