MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Agadha 4 Days Collections: సోమవారం పడిపోయిన అగధ కలెక్షన్లు.. 4వ రోజు ఎంఎస్‌ రాజు మూవీకి వచ్చింది ఇవే

Agadha 4 Days Collections: సోమవారం పడిపోయిన అగధ కలెక్షన్లు.. 4వ రోజు ఎంఎస్‌ రాజు మూవీకి వచ్చింది ఇవే

Agadha 4 Days Collections: దర్శక, నిర్మాత ఎంఎస్‌ రాజు రూపొందించిన `అగధ` మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. ఈ మూవీ వీకెండ్‌లో పెద్దగా సత్తా చాటలేకపోయింది. మరి సోమవారం కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 18 2026, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌గా సందడి చేస్తోన్న అగధ
Image Credit : Asianet News

మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌గా సందడి చేస్తోన్న అగధ

ఎంఎస్‌ రాజు దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కమర్షియల్‌ గా హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. దర్శకుడిగా అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కమర్షియల్‌ హిట్‌ కోసం ఈజీ ఫార్ములా అయిన థ్రిల్లర్‌ ని ఎంచుకున్నారు. మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ అంశాలతో ఈ మూవీని నడిపించారు. అయితే హర్రర్‌ సినిమాల్లో చాలా వరకు కామెడీని జోడిస్తారు. కానీ ఈ సినిమాని సీరియస్‌గా నడిపించారు ఎంఎస్‌ రాజు. దీంతో ఇది ఆడియెన్స్ ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాక్సాఫీసు వద్ద అగధ స్ట్రగుల్‌
Image Credit : Asianet News

బాక్సాఫీసు వద్ద అగధ స్ట్రగుల్‌

ఎంఎస్‌ రాజు అగధ మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతుంది. దీనికి ప్రారంభం నుంచి స్ట్రగుల్స్ తప్పడం లేదు. భారీ అంచనాలతో సినిమాని రిలీజ్‌ చేశారు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో వెనకబడింది సినిమా. అది కలెక్షన్లపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక ఈ సినిమా నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్‌లో డీసెంట్‌గానే కలెక్షన్లని రాబట్టింది. మరి సోమవారం వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, 30శాతానికిపైగానే డ్రాప్‌ కనిపిస్తుంది.

Related Articles

Related image1
Suma Kanakala: యాంకర్‌ సుమ హీరోయిన్‌గా ఎందుకు సినిమాలు మానేసిందో తెలుసా? ఇది అస్సలు ఊహించరు
Related image2
Anasuya into Politics: రాజకీయాల్లోకి అనసూయ.. తెరవెనుక అసలు ప్లాన్‌ ఇదేనా?
34
అగధ 4 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

అగధ 4 రోజుల కలెక్షన్లు

4వ రోజు `అగధ` చిత్రానికి ఇండియాలో రూ.15లక్షలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై లక్షలు రాబట్టింది. దీంతో నాల్గు రోజుల్లో ఈ సినిమాకి ఇండియాలో సుమారు రూ.1.38కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.1.50కోట్లు వచ్చినట్టు ట్రేడ్‌ సైట్లు వెల్లడించాయి. అంటే దాదాపు రూ.80లక్షల షేర్‌ వచ్చింది. సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.10కోట్లు. థియేట్రికల్‌ బిజినెస్‌ని ఐదు కోట్లుగా లెక్క కట్టారు. ఇప్పటి వరకు కోటి షేర్‌ కూడా రాలేదు. సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.4.30కోట్ల షేర్‌ రావాలి. అంటే ఎనిమిది కోట్లకుపైగానే గ్రాస్‌ రావాలి. అది సాధ్యమా అనేది చూడాలి.

44
అగధ కథ ఇదే
Image Credit : Asianet News

అగధ కథ ఇదే

ఎంఎస్‌ రాజు దర్శకుడిగా రూపొందించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్‌ మెయిన్‌ లీడ్‌గా చేసింది. మహాదేవి పాత్రలో ఒదిగిపోయింది. ఆమెతోపాటు శ్రావణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, భాను చందర్‌, జోవికా విజయ్‌ కుమార్‌, షిజ్జు వంటి వారు నటించారు. అగధ అనే ఒక నెగటివ్‌ శక్తి చనిపోయిన ఆత్మలను తనలోకి తీసుకొని శక్తిని పెంచుకుంటుంది. దేవతలు తనని పాతాళంలోకి తొక్కేసిన నేపథ్యంలో.. తాను వారికంటే బలంగా మారి దేవతలనే అంతం చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో మహాదేవి కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తుంది. ఆ అగధ నుంచి తన కుటుంబాన్ని మహాదేవి ఎలా కాపాడుకుందనేది సినిమా.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: ఆరెంజ్ చీరలో శోభిత వైరల్ లుక్..పెళ్ళిలో అదరగొట్టేసిందిగా
Recommended image2
Agadha: ’అగధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి.. మరిచిపోలేం
Recommended image3
Bandla Ganesh: ప్రాణ స్నేహితుడు, భక్తుడు ఇద్దరూ కలిసిపోయారు..పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ
Related Stories
Recommended image1
Suma Kanakala: యాంకర్‌ సుమ హీరోయిన్‌గా ఎందుకు సినిమాలు మానేసిందో తెలుసా? ఇది అస్సలు ఊహించరు
Recommended image2
Anasuya into Politics: రాజకీయాల్లోకి అనసూయ.. తెరవెనుక అసలు ప్లాన్‌ ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved