MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • VAS vs Makutam Box Office: సూర్య సెంచరీ.. క్లీన్ బౌల్డ్ అయిన విశాల్! కలెక్షన్లలో ఎవరు టాప్?

VAS vs Makutam Box Office: సూర్య సెంచరీ.. క్లీన్ బౌల్డ్ అయిన విశాల్! కలెక్షన్లలో ఎవరు టాప్?

VAS vs Makutam Box Office: ఒకే రోజు విడుదలైన సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం' సినిమాల బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాల మూడు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ చూస్తే, సూర్య దెబ్బకి విశాల్‌ అడ్రస్‌ లేకుండాపోయాడు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 17 2026, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూర్య వర్సెస్‌ విశాల్‌
Image Credit : Asianet News

సూర్య వర్సెస్‌ విశాల్‌

సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 'సర్‌', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఇదే రోజు విశాల్‌ నటించిన `మకుటం`(మగుడం) మూవీ కూడా విడుదలైంది. కానీ దీనికి నెగటివ్‌ టాక్ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : others

సూర్య గత చిత్రాల్లోని యాక్షన్, మాస్ అంశాలకు భిన్నంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మంచి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడేస్తుంది. మమితా బైజు నటన కూడా యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. దీని ఫలితంగా, సినిమా విడుదలైన మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను దాటినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. సూర్య కెరీర్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.

Related Articles

Related image1
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?
Related image2
Agadha 3 Days Collections: అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్‌, 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్‌ రాజు బిగ్‌ మిస్టేక్‌
35
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కలెక్షన్లు
Image Credit : Srikara Studios

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కలెక్షన్లు

ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ.15.35 కోట్లు, రెండో రోజు రూ.22.25 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మూడో రోజు మొత్తం 4,876 షోలతో రూ.20.55 కోట్లు రాబట్టింది. అంతకుముందు రోజుతో పోలిస్తే వసూళ్లు 7.6 శాతం తగ్గినా, వరుసగా రెండో రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూలు చేయడం సినిమా స్ట్రాంగ్ హోల్డ్‌ను చూపిస్తోంది. మూడు రోజులు ముగిసేసరికి ఇండియాలో మొత్తం వసూళ్లు రూ.67.22 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో రూ.43 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.110.22 కోట్లకు చేరాయని సాక్నిల్క్ డేటా చెబుతోంది. ముఖ్యంగా మూడో రోజు తమిళనాడులో రూ.9.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో రూ.9.50 కోట్లు, కర్ణాటకలో రూ.2.90 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ కారణంగా రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
45
మకుటం కోసం దర్శకుడిగా మారిన విశాల్‌
Image Credit : X

మకుటం కోసం దర్శకుడిగా మారిన విశాల్‌

ఇదిలా ఉంటే, 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు పోటీగా ఆగస్టు 14న విడుదలైన విశాల్ 'మకుటం' సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోయింది. 'ఈట్టి', 'ఐంగరన్' చిత్రాల దర్శకుడు రవి అరసు మొదట ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేశారు. కథ, స్క్రీన్‌ప్లే పనుల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నటుడు విశాల్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

55
మకుటం కలెక్షన్లు
Image Credit : X

మకుటం కలెక్షన్లు

విడుదలైనప్పటి నుంచి 'మకుటం' సినిమాకు ఎక్కువగా నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్నిల్క్ డేటా ప్రకారం, ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఒకవైపు 'విశ్వనాథ్ అండ్ సన్స్' రోజూ రూ.20 కోట్లకు పైగా వసూలు చేస్తూ రూ.110 కోట్ల క్లబ్‌లో చేరితే, మరోవైపు `మకుటం` బిగ్గెస్ట్ డిజాస్టర్‌ దిశగా వెళ్తుండటం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Related Stories
Recommended image1
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?
Recommended image2
Agadha 3 Days Collections: అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్‌, 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్‌ రాజు బిగ్‌ మిస్టేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved