MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!

Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 లో అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పటి వరకు హోల్డ్‌లో ఉన్న వారి నుంచి ఒక్కసారిగా 8 మందిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. ఇక అసలు సమరం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 19 2026, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే ప్రయత్నం
Image Credit : Asianet News

సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే ప్రయత్నం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే ప్రయత్నంలో భాగంగా.. 'అగ్నిపరీక్ష సీజన్ 2' రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి వచ్చిన వారిలో ఇప్పటికే కొంతమంది సెకండ్ రౌండ్ వరకు వెళ్లగా, ముగ్గురు జడ్జిల నుంచి గ్రీన్ కార్డ్ సాధించి ఫైనల్స్‌కు చేరిన వారు ముగ్గురు ఉన్నారు. ఇక ఆ ముగ్గురితో పోటీ పడటానికి ఇప్పటి వరకు హోల్డ్‌లో ఉన్న 26 మంది నుంచి మరో 8 మందిని ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేశారు. దాంతో హోల్డ్‌లో ఉన్న టీమ్ సంఖ్య 18కి చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జపాన్ నుంచి తెలుగు బిగ్ బాస్ కు..
Image Credit : JioHotstor

జపాన్ నుంచి తెలుగు బిగ్ బాస్ కు..

తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్నా రెడ్డి, ఫుతా (జపాన్), అభిజ్ఞ, హేమంత్, ప్రియాంక ఐదుగురు తమ టాలెంట్‌ను చూపించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో చాలా ఆసక్తికరంగా అనిపించింది జపాన్ నుంచి వచ్చిన ఫుతా మాత్రమే. ఫుతా జపాన్ దేశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయనకు తెలుగు అంటే చాలా అభిమానం. చాలా కాలంగా తెలుగు నేర్చుకుంటూ.. జపాన్, తెలుగు మిక్సింగ్ వీడియోలు కూడా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ, తెలుగు సినిమా డైలాగ్స్ కూడా చెప్తుంటాడు. తనను తాను ఒక మ్యూజిషియన్‌గా పరిచయం చేసుకున్నాడు ఫుతా. అయితే తెలుగు సరిగ్గా రాని కారణంగా హౌస్‌లో సర్వైవ్ అవ్వలేడని మిగతా జడ్జెస్ రిజెక్ట్ చేయగా, అభిజిత్ మాత్రమే అతనికి గ్రీన్ కార్డ్ ఇచ్చి ఫైనల్ రౌండ్‌కు పంపించాడు.

Related Articles

Related image1
NTR: లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?
Related image2
Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
34
ఫాదర్ సెంటిమెంట్‌తో కన్నీళ్లు తెప్పించారు..
Image Credit : JioHotstor

ఫాదర్ సెంటిమెంట్‌తో కన్నీళ్లు తెప్పించారు..

ఈ ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు ఫాదర్ సెంటిమెంట్‌తో కంటతడి పెట్టించారు. ముందుగా జ్యోత్స్నా రెడ్డి చాలా జోష్‌తో వచ్చి, మధ్యలో తండ్రి జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తనను ఎంత ప్రేమిస్తారో, ఆయనకు బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. సడెన్‌గా తన తండ్రి మరణం గురించి చెబుతూ, ఆయన వాయిస్ ఎక్కడ మర్చిపోతానో అని ఆమె పడే తపన అందరినీ కంటతడి పెట్టించింది. ఇక మరో కంటెస్టెంట్ హేమంత్ కూడా తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కానీ తన తండ్రితో మాట్లాడకపోవడానికి సరైన కారణం చెప్పలేకపోయాడు. లైవ్‌లో అతను తన తండ్రితో మాట్లాడిన విధానం కొంతమందికి నచ్చలేదు. అయినప్పటికీ, అతను హౌస్‌లో ఉండాలని బిందు మాధవి అతన్ని ఫైనల్స్‌కు పంపించింది.

44
పర్వాలేదనిపించారు..
Image Credit : JioHotstor

పర్వాలేదనిపించారు..

ఇక మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్ల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ అనిపించలేదు. ముఖ్యంగా ప్రియాంక చాలా కష్టపడి తనలో ఉన్న జోష్‌ను బయటకు తీయాలని చూసింది. కానీ ఆమెలో ఉన్న అసలు టాలెంట్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఇక సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ నుంచి వచ్చిన అభిజ్ఞ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. ఆమె జెన్యూన్‌గా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తనకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తుంది.. గలగలా మాట్లాడేస్తుంది. దాంతో ఆమెకు నవదీప్ 'చదువుకున్న తింగరి' అని పేరు కూడా పెట్టాడు. ఫైనల్‌గా అగ్నిపరీక్ష మొదటి పార్ట్ పూర్తయింది. అసలు సమరం ఇప్పుడే మొదలైంది. ముందు ముందు వీరిలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేది ఎవరో వేచి చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Related Stories
Recommended image1
NTR: లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?
Recommended image2
Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved