MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Samosa: సమోసా ఏ దేశంలో పుట్టింది? మనదేశంలోకి ఎప్పుడు, ఎలా అడుగుపెట్టింది?

Samosa: సమోసా ఏ దేశంలో పుట్టింది? మనదేశంలోకి ఎప్పుడు, ఎలా అడుగుపెట్టింది?

Samosa: సమోసా మనదేశంలోని ప్రతి వీధిలో అమ్ముతూనే ఉంటారు. అసలు ఇది మనదేశపు వంటకమే కాదు.. కానీ ఇప్పుడు మనదేశంలో సమోసానే ఎక్కువగా అమ్ముడుపోతోంది. అసలు సమోసా ఎక్కడ పుట్టింది? మన దేశానికి ఎలా వచ్చింది? ఈ వివరాలు తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 19 2026, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సమోసా ఎక్కడ పుట్టింది?
Image Credit : Gemini AI

సమోసా ఎక్కడ పుట్టింది?

భారతీయులకు సాయంత్రం సమయంలో సమోసా ప్రతిరోజూ తినేవారు ఎంతో మంది. గల్లీలోని చిన్న బండి మొదలుకొని పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ల దాకా ఎక్కడ చూసినా కనిపించే రుచికరమైన స్నాక్ ఇది. నిజానికి సమోసా మనదేశానికి చెందినది కాదు. సమోసా మూలాలు 10వ శతాబ్దానికి చెందిన మధ్యప్రాచ్యం , మధ్య ఆసియా ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రాచీన పర్షియాలో దీనిని 'సంబోసగ్' (Sanbosag) లేదా 'సంబుసక్' (Sambusak) అని పిలిచేవారు. ఆ కాలంలో చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించే వర్తకులు, యాత్రికులు మార్గమధ్యంలో ఆహారంగా తీసుకువెళ్లడానికి మైదా పిండి పొరల్లో మాంసం, డ్రై ఫ్రూట్స్, నట్స్ నింపి నిప్పులపై లేదా నూనెలో వేయించి సమోసాలను తయారుచేసేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మనదేశానికి సమోసా ప్రయాణం
Image Credit : Pixabay

మనదేశానికి సమోసా ప్రయాణం

ఈ విదేశీ వంటకం 13వ, 14వ శతాబ్దాల కాలంలో సిల్క్ రోడ్ వర్తకులు, మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులు, వంటవాళ్ల ద్వారా భారత్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ సుల్తానుల పాలనలో రాజభవనాల్లో జరిగే విందులలో సమోసాను ఎంతో ప్రత్యేకమైన వంటకంగా వడ్డించేవారని ప్రసిద్ధ రచయిత అమీర్ ఖుస్రో, మొరాకో యాత్రికుడు ఇబ్న్ బతూతా తమ రచనల్లో చెప్పారు. అప్పట్లో ఇది మాంసంతో కూడిన రాజభోజనంగా మాత్రమే ఉండేది. అయితే 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు భారతదేశానికి బంగాళాదుంపలను (ఆలూ) పరిచయం చేయడంతో సమోసా రుచి మారింది. భారతీయ వంటగాళ్లు మాంసానికి బదులుగా ఉడకబెట్టిన ఆలూ, పచ్చి బఠానీలు, అల్లం, ధనియాలు, గరం మసాలాలను స్టఫింగ్‌గా ఉపయోగించడం ప్రారంభించారు.

Related Articles

Related image1
Countries: ఈ దేశాలకు అధ్యక్షుడు లేడు, ప్రధాని ఉండరు.. అయినా ప్రజలందరూ హ్యాపీగా బతుకుతున్నారు
Related image2
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
33
పేదవారి స్నాక్
Image Credit : Pixabay

పేదవారి స్నాక్

మాంసం బదులు బంగాళాదుంపలు చేరడంతో సమోసా సామాన్య ప్రజల నిత్య జీవితంలో భాగమైంది. తక్కువ ధర, తింటే పొట్ట నిండే గుణం, అద్భుతమైన మసాలా రుచి వల్ల ఇది దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రాంతాన్ని బట్టి ఉత్తరాదిలో ఆలూ-సమోసా, హైదరాబాద్‌లో కీమా సమోసా, గుజరాత్‌లో వెజ్-పన్నీర్ సమోసాలుగా వివిధ రూపాల్లో తయారుచేస్తున్నారు. పుదీనా చట్నీ, తీపి చింతపండు చట్నీలతో వేడివేడిగా వడ్డించే సమోసా.. దేశ సరిహద్దులు దాటి వచ్చి నేడు భారతీయ ఆహార సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచింది. వర్షం పడుతున్నా, అతిథులు వచ్చినా అందరి మొదటి ఎంపికగా నిలుస్తూ భారతీయుల ఆల్‌టైమ్ ఫేవరెట్ స్నాక్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Recommended image2
Psychology: నచ్చినవాళ్లు మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు బాధగా అనిపిస్తుంది? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image3
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Related Stories
Recommended image1
Countries: ఈ దేశాలకు అధ్యక్షుడు లేడు, ప్రధాని ఉండరు.. అయినా ప్రజలందరూ హ్యాపీగా బతుకుతున్నారు
Recommended image2
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved