MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Rare Trees: ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Rare Trees: ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Rare Trees: ప్రపంచంలో కొన్ని చెట్లు మన ఊహకు అందని విధంగా ఉంటాయి. ఇవి చూడటానికి వింతగా ఉండటమే కాదు.. వీటి వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. మరి ప్రపంచంలో అత్యంత విచిత్రంగా కనిపించే 5 చెట్లు ఏంటి? ఎక్కడ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 19 2026, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విచిత్రమైన 5 చెట్లు
Image Credit : ChatGPT

విచిత్రమైన 5 చెట్లు

ప్రపంచంలో మనం ఎప్పుడూ చూడని ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు చాలా పెద్దగా ఉంటే, మరికొన్ని వింత ఆకారాల్లో పెరుగుతాయి. ఇంకొన్ని చెట్లకు పండ్లు కాండానికే కాస్తాయి, మరికొన్ని చెట్ల కాండం రంగురంగులుగా కనిపిస్తుంది. ప్రకృతి సృష్టించిన ఇలాంటి అద్భుతమైన 5 రకాల చెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బావాబాబ్ చెట్టు
Image Credit : ChatGPT

బావాబాబ్ చెట్టు

బావాబాబ్ చెట్లు ప్రధానంగా ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటి కాండం చాలా పెద్దగా, లావుగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే చెట్టు కాండం ఒక పెద్ద సీసాలా కనిపిస్తుంది. కరవు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ చెట్లు జీవించగలవు. వాటి కాండంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండటం ఇందుకు కారణం. బావాబాబ్ చెట్లు చాలా కాలం జీవిస్తాయి. కొన్ని చెట్లు వందల సంవత్సరాలు, మరికొన్ని వెయ్యి సంవత్సరాలకు పైగా జీవించినట్లు అంచనాలు ఉన్నాయి.

Related Articles

Related image1
Hyderabad: హైదరాబాద్ దగ్గర్లో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. వీకెండ్‌లో వెళ్లడానికి బెస్ట్!
Related image2
Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!
36
డ్రాగన్ బ్లెడ్ ట్రీ
Image Credit : ChatGPT

డ్రాగన్ బ్లెడ్ ట్రీ

డ్రాగన్ బ్లెడ్ ట్రీ యెమెన్‌కు చెందిన సోకోత్రా ద్వీపంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పై భాగంలో కొమ్మలు గొడుగులా విస్తరించి ఉంటాయి. అందుకే దూరం నుంచి చూస్తే ఇది పెద్ద గొడుగులా కనిపిస్తుంది. ఈ చెట్టును తొలిచినప్పుడు ఎర్రటి పదార్థం బయటకు వస్తుంది. దాని కారణంగానే దీనికి డ్రాగన్ బ్లెడ్ ట్రీ అనే పేరు వచ్చింది.

46
బ్రిస్టిల్‌కోన్ పైన్
Image Credit : AI

బ్రిస్టిల్‌కోన్ పైన్

అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో కనిపించే బ్రిస్టిల్‌కోన్ పైన్ చెట్లు వాటి వయసు కారణంగా ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే చెట్లలో ఒకటి. కొన్ని బ్రిస్టిల్‌కోన్ పైన్ చెట్లు వేల సంవత్సరాల వయసు కలిగి ఉంటాయి. మంచు, బలమైన గాలులు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి పెరుగుతాయి. కఠినమైన వాతావరణం కారణంగా వీటి ఆకారం కూడా సాధారణ చెట్లలా ఉండదు. కొమ్మలు వంకరగా, కాండం కొంత భాగం ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది.

56
జబుటికాబా చెట్టు
Image Credit : AI

జబుటికాబా చెట్టు

బ్రెజిల్‌లో కనిపించే జబుటికాబా చెట్టు చూడటానికి సాధారణంగానే ఉంటుంది. కానీ దీనికి పండ్లు వచ్చే విధానం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా చెట్లకు పండ్లు కొమ్మల చివర కాస్తాయి. కానీ జబుటికాబా చెట్టుకు పండ్లు నేరుగా కాండం, పెద్ద కొమ్మలపైనే కాస్తాయి.

66
రెయిన్‌బో యూకలిప్టస్
Image Credit : AI

రెయిన్‌బో యూకలిప్టస్

ఈ చెట్టును చూస్తే ఎవరో కాండంపై రంగులు వేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ రంగులన్నీ ప్రకృతి సహజంగా ఇచ్చినవే. రెయిన్‌బో యూకలిప్టస్ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, న్యూ గినియా వంటి ప్రాంతాల్లో సహజంగా కనిపిస్తుంది. ఈ చెట్టు బెరడు పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. కొత్త బెరడు బయటకు వచ్చినప్పుడు మొదట ఆకుపచ్చగా కనిపిస్తుంది. తరువాత అది నీలం, ఊదా, ఎరుపు, నారింజ, గోధుమ వంటి రంగుల్లోకి మారుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triphala Tree: నల్లమలలో త్రిఫల వృక్షం.. ఒక్క కాయ తింటే ముసలితనమే రాదా? ఆ సంజీవని చెట్టు ఎక్కడుంది?
Recommended image2
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image3
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Related Stories
Recommended image1
Hyderabad: హైదరాబాద్ దగ్గర్లో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. వీకెండ్‌లో వెళ్లడానికి బెస్ట్!
Recommended image2
Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved