MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?

KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?

వరుణ్‌ తేజ్‌ మొత్తానికి ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఇటీవల `కొరియన్‌ కనకరాజు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పదిరోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత రాబట్టిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 17 2026, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హిట్‌ కొట్టాలనే కసితో సినిమా చేసిన వరుణ్‌ తేజ్‌
Image Credit : Asianet News

హిట్‌ కొట్టాలనే కసితో సినిమా చేసిన వరుణ్‌ తేజ్‌

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఇటీవల `కొరియన్‌ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించారు. ఆయన మొదటి సారి హర్రర్‌, థ్రిల్లర్‌, కామెడీ కాన్సెప్ట్ తో `కొరియన్‌ కనకరాజు` మూవీ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటించగా, సత్య, మురళీధర్‌ గౌడ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. దీనికి ముందు అటు వరుణ్‌ తేజ్‌, ఇటు మేర్లపాక గాంధీకి హిట్లు లేవు. దీంతో వీరిద్దరు ఎలాగైనా హిట్‌ కొట్టాలనే లక్ష్యంతో ఈ మూవీని చేశారు. చాలా కసితో చేశారని చెప్పొచ్చు. ఆ కసి సినిమాలో కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వరుణ్‌ తేజ్‌ కి హిట్‌ కి కారణమైన సత్య
Image Credit : Asianet News

వరుణ్‌ తేజ్‌ కి హిట్‌ కి కారణమైన సత్య

ఆగస్ట్ 7న `కొరియన్‌ కనకరాజు` మూవీ విడుదలైంది. కామెడీ అంశాలు బాగా వర్కౌట్‌ అయ్యాయి. దీంతో సినిమా జనాలకు కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సినిమాకి నిజమైన హీరో అయనే అని చెప్పొచ్చు. అంతగా సినిమాని నడిపించాడు. వరుణ్‌ కి హిట్‌ రావడానికి కారకుడయ్యాడు. అలాగే మేర్లపాక గాంధీ టేకింగ్‌, రైటింగ్‌, మ్యూజిక్‌ వంటివన్నీ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. మొత్తంగా వరుణ్‌ తేజ్‌ హిట్‌ కొట్టారు. బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. ఇక ఈ మూవీ విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఎంత లాభాలు సాధించిందనేది చూస్తే.

Related Articles

Related image1
OTT: చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే
Related image2
Agadha 3 Days Collections: అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్‌, 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్‌ రాజు బిగ్‌ మిస్టేక్‌
34
కొరియన్‌ కనకరాజు కలెక్షన్లు
Image Credit : Asianet News

కొరియన్‌ కనకరాజు కలెక్షన్లు

`కొరియన్‌ కనకరాజు` మూవీకి అయిన బడ్జెట్‌ రూ.38కోట్లు, థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.12కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌గానే దీనికి రూ.26కోట్ల వరకు వచ్చిందట. దీంతో పన్నెండు కోట్లని థియేట్రికల్‌గా నిర్ణయించారు. ఈ లెక్కన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఇప్పుడు లాభాల దిశగా వెళ్తోంది. ఈ సినిమాకి పదిరోజుల్లో రూ.31.15కోట్లు వచ్చాయి. అంటే రూ.16కోట్ల షేర్‌ వచ్చింది. నాలుగు కోట్లకుపైగానే లాభాలు పొందింది.

44
రెండో వారంలోనూ స్ట్రాంగ్‌గా కొరియన్‌ కనకరాజు కలెక్షన్లు
Image Credit : X/@UV_Creations

రెండో వారంలోనూ స్ట్రాంగ్‌గా కొరియన్‌ కనకరాజు కలెక్షన్లు

ఈ సినిమాకి పదవ రోజు(ఆదివారం) రూ.1.20కోట్లు వచ్చాయి. రెండో వారంలోనూ ఇది స్ట్రాంగ్‌ గా వసూళ్లని రాబట్టడం విశేషం. ఇక సోమవారం నుంచి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదే స్థాయిలో ఉంటే ఇది పెద్ద రేంజ్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. `కొరియన్‌ కనకరాజు` మూవీకి ఇండియాలో రూ.25.85కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాగా, రూ.22.50కోట్ల నెట్‌ వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ.5.30కోట్లు రావడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
OTT: చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే
Recommended image2
Agadha 3 Days Collections: అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్‌, 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్‌ రాజు బిగ్‌ మిస్టేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved