MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Yash: అల్లు అరవింద్‌, రష్మిక మందన్నా ఇద్దరికీ కలిపి ఇచ్చిపడేసిన యష్‌.. అంత చులకనగా మాట్లాడతారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మిక మందన్నా ఇద్దరికీ కలిపి ఇచ్చిపడేసిన యష్‌.. అంత చులకనగా మాట్లాడతారా?

హీరో యష్‌ త్వరలో `టాక్సిక్‌` సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తనని చులకన చేసిన మాట్లాడిన అటు అల్లు అరవింద్‌, ఇటు రష్మిక మందన్నాలకు ఇచ్చిపడేశారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 18 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాక్సిక్‌ మూవీతో రాబోతున్న యష్‌
Image Credit : instagram/@thenameisyash

టాక్సిక్‌ మూవీతో రాబోతున్న యష్‌

రాక్‌ స్టార్‌ యష్‌.. టాక్సిక్‌ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. `కేజీఎఫ్‌ 2` తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌తో థియేటర్లోకి వస్తున్నారు యష్‌. ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. మార్చిలోనే రిలీజ్‌ కావాల్సింది. యుద్ధ ప్రభావంతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్‌ కాబోతుంది. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్‌, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. యష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రష్మిక, అల్లు అరవింద్‌ కామెంట్లపై యష్‌ రియాక్షన్‌
Image Credit : Asianet News

రష్మిక, అల్లు అరవింద్‌ కామెంట్లపై యష్‌ రియాక్షన్‌

ట్రైలర్‌ ప్రారంభంలో బోల్డ్ గా ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఇటీవల ట్రైలర్‌ ని రిలీజ్‌ చేశారు. అది తలా తోక లేనట్టుగా ఉంది. కథ ఏంటో క్లారిటీ లేదు. యాక్షన్‌ పార్ట్ ని, రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు. అదే సమయంలో సినిమాలోని మెయిన్‌ ట్విస్ట్ ని రివీల్‌ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు యష్‌. అందులో భాగంగా ఆయన రష్మిక మందన్నా కామెంట్లకి, అదే సమయంలో అల్లు అరవింద్‌ కామెంట్లకి స్పందించారు. గతంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఇచ్చి పడేయడం విశేషం.

34
అల్లు అరవింద్‌కి దిమ్మతిరిగే కౌంటర్‌
Image Credit : youtube/@aha

అల్లు అరవింద్‌కి దిమ్మతిరిగే కౌంటర్‌

స్టార్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్.. ఒకప్పుడు `కేజీఎఫ్‌`కి ముందు యష్‌ ఎవరికీ తెలియదన్నారు. ఈ సినిమా తర్వాతనే అందరికి తెలుసు అని మాట్లాడారు. దీనికి యష్‌ రియాక్ట్ అవుతూ, `కేజీఎఫ్‌` తన లైఫ్‌ని మార్చిందనేది నిజమే అని, సినిమా సక్సెస్‌ కేవలం నిర్మాతది మాత్రమే కాదని, దాని వెనుక సమష్టి కృషి ఉంటుందన్నారు. హీరో సరిగ్గా నటించకపోతే సినిమా హిట్‌ కాలేదని, ఎవరికి ఎంత క్రెడిట్‌ ఇవ్వాలో ఆడియెన్స్ కి తెలుసు అని అదిరిపోయే సమాధానం చెప్పారు.

44
రష్మిక మందన్నాకి క్రేజీ కౌంటర్‌
Image Credit : youtube/zee telugu

రష్మిక మందన్నాకి క్రేజీ కౌంటర్‌

ఈ సందర్భంగానే రష్మిక మందన్నా 2017లో చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. యష్‌ షో ఆఫ్‌(పోజులు కొట్టే వ్యక్తి) పర్సన్‌ అని రష్మిక గతంలో చెప్పింది. దీనికి యష్‌ స్పందిస్తూ, ప్రతి ఒక్కరు తమ సొంత ఆలోచనలు కలిగి ఉంటారని, ఆమె ఇంటెన్షన్‌ ఏంటో తనకు తెలియదని, తను అప్పుడే కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తుందని, ఆమె వ్యక్తిగత అభిప్రాయం తన నిజ స్వభావాన్ని మార్చలేదని చెప్పారు. యష్‌ అటు అల్లు అరవింద్‌, ఇటు రష్మిక మందన్నా కామెంట్లకి చాలా హుందాగా రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో వాళ్లకి ఇవ్వాల్సిన కౌంటర్‌ ఇచ్చిపడేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
రష్మిక మందన్న
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Related Stories
Recommended image1
Agadha 4 Days Collections: సోమవారం పడిపోయిన అగధ కలెక్షన్లు.. 4వ రోజు ఎంఎస్‌ రాజు మూవీకి వచ్చింది ఇవే
Recommended image2
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved