MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

India Skills Report 2026: ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026లో ఉద్యోగార్హతలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉద్యోగాల వేటలో యూపీ యూత్ టాప్
Image Credit : Gemini

ఉద్యోగాల వేటలో యూపీ యూత్ టాప్

భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన యువతకు అతి సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానం ఇప్పుడు వచ్చేసింది. కొత్తగా విడుదలైన 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026' (India Skills Report 2026) ప్రకారం, ఉద్యోగం సాధించే నైపుణ్యాలు, అర్హతలు ఉన్న వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నేటి జాబ్ మార్కెట్‌కు కావలసిన నైపుణ్యాలు, సంసిద్ధతలో యూపీ యువత అందరికంటే ముందున్నారని రిపోర్టు పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దేశంలో పెరుగుతున్న ఎంప్లాయబిలిటీ రేటు
Image Credit : AI-Generated (ChatGPT)

దేశంలో పెరుగుతున్న ఎంప్లాయబిలిటీ రేటు

ఈ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో యువత ఉద్యోగార్హత గణనీయంగా పెరిగింది. 2025లో ఈ రేటు 54.81 శాతంగా ఉండగా, 2026 నాటికి అది 56.35 శాతానికి చేరింది. అంటే మారుతున్న కార్పొరేట్ రంగానికి, కొత్త రకాల జాబ్స్ కోసం మన దేశ యూత్ మునుపటి కంటే చాలా వేగంగా అప్‌గ్రేడ్ అవుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Related Articles

Related image1
Famous Temples in South India: సౌత్ ఇండియాలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 హిందూ దేవాలయాలు
Related image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
36
ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఎలా తయారైంది?
Image Credit : Gemini AI

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఎలా తయారైంది?

ఈ రిపోర్టును ఈటీఎస్ (ETS) సంస్థ.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ఇతర ప్రముఖ సంస్థలతో కలిసి సంయుక్తంగా తయారు చేసింది. ఇందులో భాగంగా లక్షకు పైగా అభ్యర్థులు రాసిన 'గ్లోబల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్' (GET) ప్రతిభను విశ్లేషించారు. దాంతో పాటు 7 ప్రధాన రంగాలకు చెందిన 1,000 కంటే ఎక్కువ కంపెనీల అభిప్రాయాలు, సమాచారాన్ని సేకరించి ఈ రిపోర్టును రూపొందించారు.

46
టాప్ 10 రాష్ట్రాల జాబితా ఇదే
Image Credit : Asianet News

టాప్ 10 రాష్ట్రాల జాబితా ఇదే

రాష్ట్రాల వారీగా ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, మహారాష్ట్ర రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వరుసగా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. ఈ లిస్టులో టాప్ 10 లో ఏపీ, తెలంగాణలు లేవు. కానీ, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ వంటి జాతీయ స్థాయి నైపుణ్య సర్వేల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమ ప్రతిభను చాటుకున్నాయి. 18 నుండి 21 ఏళ్ల వయస్సు గల యువతలో ఉద్యోగ అర్హత (జోబ్-స్కిల్ రెడీనెస్) పరంగా తెలంగాణ 85.45 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, సంఖ్యాత్మక నైపుణ్యాలలో (78.68%) అగ్రస్థానం సాధించడంతో పాటు క్రిటికల్ థింకింగ్‌ విభాగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

మహిళా ఉద్యోగ అర్హత విభాగంలో తెలంగాణ 3వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచి, మహిళా సాధికారతలో జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలను సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు STEM, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ రంగాలకు అవసరమైన విశ్లేషణాత్మక ప్రతిభకు నిలయాలుగా మారుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగాలు విస్తరిస్తుండగా, రెండు రాష్ట్రాలు కూడా నాణ్యమైన మానవ వనరులను, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందిస్తూ కీలకమైన వర్క్‌ఫోర్స్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి.

56
చిన్న నగరాలే ఉద్యోగాలకు కేర్‌కేర్ అడ్రస్
Image Credit : Getty

చిన్న నగరాలే ఉద్యోగాలకు కేర్‌కేర్ అడ్రస్

టియర్-2, టియర్-3 నగరాలు ఇప్పుడు దేశ వర్క్‌ఫోర్స్‌లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. సాంకేతికత, వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, కొత్త ఇన్నోవేషన్ల వల్ల పనిచేసే పద్ధతులు వేగంగా మారుతున్నాయి. యువత, విద్యాసంస్థలు , కంపెనీలు ఈ మార్పులకు అనుగుణంగా తమను తాము వేగంగా మార్చుకుంటున్నాయి.

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 అంచనా ప్రకారం, భారత్‌లో గిగ్ వర్క్‌ఫోర్స్ 2030 నాటికి 23.5 మిలియన్లకు, అంటే దాదాపు 2.35 కోట్లకు చేరుకుంటుంది. దీనివల్ల ఫ్రీలాన్స్, కాంట్రాక్ట్, ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్లకు డిమాండ్ రాబోయే రోజుల్లో భారీగా పెరగనుంది.

66
ఏ రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువ?
Image Credit : Getty

ఏ రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువ?

ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాలెంట్‌లో 16 శాతం భారత్‌లోనే ఉంది. మన దేశంలో 6 లక్షలకు పైగా ఏఐ నిపుణులు ఉన్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ, మ్యానుఫ్యాక్చరింగ్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్‌కేర్ రంగాలు అత్యధికంగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. స్కిల్స్ ఉన్న యువతకు ఈ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విద్య
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
Recommended image2
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Recommended image3
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం
Related Stories
Recommended image1
Famous Temples in South India: సౌత్ ఇండియాలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 హిందూ దేవాలయాలు
Recommended image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved