దూదిలాంటి మెత్తటి ఇడ్లీలంటే ఇష్టపడని వారుండరు. అలాంటి ఇడ్లీల కోసం పాటించాల్సిన కొన్ని టిప్స్ మీకోసం.
ఇడ్లీల కోసం బియ్యాన్ని మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెడితే చాలు. ఎక్కువ సేపు నానబెట్టకూడదు.
మినపప్పును రెండు గంటల నుంచి మూడు గంటల వరకు నానబెట్టాలి. అంతకంటే ఎక్కువ సేపు నానబెడితే పిండి పులిసిపోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయి.
ఇడ్లీ పిండిని గ్రైండర్లో రుబ్బేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల పిండి మెత్తగా వస్తుంది. దీంతో ఇడ్లీలు మృదువుగా ఉంటాయి.
బియ్యం రుబ్బేటప్పుడు నీటిలో నానబెట్టిన మెంతులు, కొద్దిగా అన్నం కూడా వేసి రుబ్బితే ఇడ్లీలు మరింత సాఫ్ట్‌గా వస్తాయి.
ఇడ్లీ పిండి మెత్తగా ఉండటానికి నానబెట్టిన అటుకులను కూడా కలిపి రుబ్బుకోవచ్చు. దీనివల్ల ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి.
Bangle Designs: చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. ఓ లుక్కేయండి!
Mangalsutra Bracelets: డైలీవేర్ కి లైట్‌వెయిట్ నల్లపూసల బ్రేస్లెట్స్
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?