MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Feature
  • Reynolds Pen: 90s కిడ్స్‌కి ఫేవరేట్‌ రెనాల్డ్స్ పెన్ను గుర్తుందా? రేనాల్డ్స్ చరిత్ర ఏంటంటే?

Reynolds Pen: 90s కిడ్స్‌కి ఫేవరేట్‌ రెనాల్డ్స్ పెన్ను గుర్తుందా? రేనాల్డ్స్ చరిత్ర ఏంటంటే?

Reynolds Pen: ప్రస్తుతం పెన్నుల వినియోగం చాలా తగ్గింది. ఎవర్ని చూసినా.. ట్యాబ్ లు, ఫోన్లు, లాప్ ట్యాప్ లు తప్పించి.. పెన్నులతో రాసేవారు లేరు. కానీ 90s కిడ్స్ కు పెన్ను మర్చిపోలేని జ్ఞాపకం. మరీముఖ్యంగా రేనాల్డ్స్ పెన్ను అంటే ఓ ఎమోషన్.

3 Min read
Author : Asianetnews Telugu Stories
Published : Aug 20 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్నో మధుర జ్ఞాపకాలు
Image Credit : Reynolds

ఎన్నో మధుర జ్ఞాపకాలు

90వ దశకంలోపిల్లలకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆటల నుంచి మొదలుపెడితే చదువుల దాకా ఎన్నింటితోనో పెనవేసుకున్న బంధాలు ఉన్నాయి. అందులోను స్కూల్ కు వెళ్లిన 90s కిడ్స్ కు మర్చిపోలేని జ్ఞాపకం రెనాల్డ్స్' (Reynolds) పెన్ను.అప్పట్లో రాత పరీక్షల నుండి క్లాస్ నోట్స్ వరకు ప్రతీ దానికి రెనాల్డ్స్ పెన్ను వాడటమే ఒక ట్రెండ్. ముఖ్యంగా Reynolds 045 (Fine Carbure) మోడల్ ఆ రోజుల్లో స్కూల్ పిల్లలకి ఐకానిక్ చిహ్నంగా మారింది. మరి ఇప్పుడు ఆ పెన్నులు ఉన్నాయా? వాడుతున్నారా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిల్లలు ఈ పెన్నులను ఎందుకు అంతగా ఇష్టపడేవారు?
Image Credit : Reynolds

పిల్లలు ఈ పెన్నులను ఎందుకు అంతగా ఇష్టపడేవారు?

90s కాలంలో జెల్ పెన్నులు లేదా ఫ్యాన్సీ పెన్నుల వినియోగం చాలా తక్కువ. ఆ సమయంలో రెనాల్డ్స్ పెన్నులు చాలా ఎక్కువగా దొరికేవి. అంతే కాదు సరసమైన ధరతో పాటు ఎక్కువ రోజులు మన్నిక, ఈ పెన్నుల ఆకారం కూడా పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఈ పెన్నును స్టేటస్ సింబల్ గా చూసేవారు. జేబులో ఒక రెనాల్డ్స్ పెన్ పెట్టుకోవడం అప్పట్లో విద్యార్థులకు ఎంతో గర్వకారణంగా ఉండేది.

Related Articles

Related image1
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!
Related image2
Samantha Babymoon: వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్
35
రాయడానికి మాత్రమే కాదు..
Image Credit : Reynolds

రాయడానికి మాత్రమే కాదు..

రెనాల్డ్స్ పెన్నులు రాయడానికి చాలా అనుకూలంగా ఉండేవి. చాలా థిక్ గా అక్షరాలు రాయడానికి ఉపయోగపడేవి. బోర్డు పరీక్షలు లేదా వార్షిక పరీక్షల సమయంలో చేతికి అలసట రాకుండా స్పీడ్ గా రాయడానికి విద్యార్థులు కేవలం రెనాల్డ్స్ 045 లేదా 'జైపాన్' (Jaipan) మోడళ్లనే నమ్ముకునేవారు. అంతే కాదు ఈ పెన్నులను రకరకాలుగా వాడేవారు. ఆటలు ఆడటానికి కూడా ఈ పెన్నులు ఉపయోగపడేవి. ఈ పెన్నుల్లో రిఫిల్ అయిపోతే కొత్త రిఫిల్ మార్చుకునే సదుపాయం ఉండేది. ఈ పెన్నుకు ఉన్న గాజు మూతలో తమ పేర్లు రాసుకున్న పేపర్ చిటీలను అమర్చుకునేవారు. ఇక పెన్ను మూతతో రకరకాల శబ్దాలు చేయడం, పెన్నులోని రీఫిల్ , స్ప్రింగ్‌లతో ఆడుకోవడం నాటి పిల్లలకు ఒక మంచి జ్ఞాపకం.

45
రెనాల్డ్స్ పెన్ను ప్రత్యేకతలు
Image Credit : Reynolds

రెనాల్డ్స్ పెన్ను ప్రత్యేకతలు

రెనాల్డ్స్ పెన్ను ఆకారం అన్నింటికంటే డిఫరెంట్ గా ఉండేది. లైట్ వెయిట్ తో పాటు తెల్లటి బాడీ, నీలిరంగు మూతతో చాలా తేలికగా ఉండి, ఎక్కువ సమయం రాసినా చేయి నొప్పి పుట్టకుండా ఉండేది.పెన్ను చివర ఉండే టంగ్ స్టన్ కార్బైడ్ బాల్ ద్వారా ఇంక్ లీక్ అవ్వకుండా, పేపర్‌పై సున్నితంగా జారేది. దాంతో స్మూత్ రైటింగ్ వచ్చేది. అంతే కాదు ఈ పెన్నులు ఎక్కవకాలం ఉపయోగించుకునే విధంగా ఉండేవి. ఒక చిన్న రీఫిల్‌తో వేలాది పదాలు రాసేందుకు వీలయ్యే సాంకేతికత ఇందులో ఉండేది. వీటితో పాటు సరసమైన ధరలకు ఈ పెన్నులు దొరికేవి. అప్పట్లో రూ. 5 మాత్రమే ఉండటం వల్ల సామాన్య విద్యార్థులకు కూడా సులభంగా అందుబాటులో ఉండేది.

55
రెనాల్డ్స్ పెన్నుల చరిత్ర
Image Credit : Reynolds

రెనాల్డ్స్ పెన్నుల చరిత్ర

రెనాల్డ్స్ బ్రాండ్‌ను 1945లో అమెరికాకు చెందిన మిల్టన్ రెనాల్డ్స్ (Milton Reynolds) ప్రారంభించారు. ఇది బాల్ పాయింట్ పెన్నుల తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ విప్లవాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో రెనాల్డ్స్ పెన్నులను చెన్నైకి చెందిన 'జిఎం పెన్స్ అండ్ ప్లాస్టిక్స్' (GM Pens International) భాగస్వామ్యంతో తయారు చేసి విక్రయించేవారు. నాణ్యత, సరసమైన ధరల కారణంగా భారతదేశంలో బాల్ పాయింట్ పెన్నుల మార్కెట్‌లో ఇది అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాత కాలంలో బ్రాండ్ హక్కుల మార్పులు జరిగినప్పటికీ, క్వాలిటీలో తన మార్క్ ను కాపాడుకుంది.

ఇప్పుడు ఈ పెన్నులు వాడుకలో ఉన్నాయా?

రెనాల్డ్స్ పెన్నులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. కొన్ని మార్పుల వల్ల ఇవి మార్కెట్ నుండి వెళ్లిపోయాయని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చినప్పటికీ, కంపెనీ అధికారికంగా స్పందిస్తూ Reynolds 045 ఉత్పత్తి ఆగిపోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెనాల్డ్స్ కంపెనీ పాత ఐకానిక్ 045 మోడల్‌తో పాటు నేటి తరానికి అనుగుణంగా ట్రిమ్స్ (Trimmax), జెల్ పెన్స్, ఫౌంటెన్ పెన్స్ వంటి అధునాతన మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఆన్‌లైన్ స్టోర్లలో, స్థానిక స్టేషనరీ షాపులలో ఇవి ఇప్పటికీ లభిస్తున్నాయి. అప్పట్లో 5 రూపాయలు ఉన్న రెనాల్డ్స్ పెన్ను.. ఇప్పుడు 10 రూపాయలకు పెరిగింది. నాటి 90s కిడ్స్ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఇప్పటికీ ఈ పెన్నులను ఉపయోగిస్తుండటం విశేషం.

About the Author

AT
Asianetnews Telugu Stories
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇష్ట‌మైన ఆహారం చూడ‌గానే, నోటిలో లాలాజ‌లం ఎందుకు వ‌స్తుంది.. దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే
Recommended image2
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Recommended image3
Rare Trees: ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Related Stories
Recommended image1
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!
Recommended image2
Samantha Babymoon: వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved