MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!

Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!

Agnipariksha season 2 Review: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లకముందే చెత్త టాస్క్‌లతో అగ్నిపరీక్ష స్టేజ్ కంపుకొడుతోంది. సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. మరి అగ్నిపరీక్ష సీజన్ 2లో రెండో రౌండ్ ఎలా మొదలైందంటే..

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 20 2026, 08:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు..
Image Credit : Jio Hotstor

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు..

సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహిస్తున్న 'అగ్నిపరీక్ష' కార్యక్రమంలో అతిగా జరుగుతోంది. బిగ్ బాస్‌లోకి వెళ్లడం ఏమో గానీ, అంతకంటే ముందే అగ్నిపరీక్ష షోలోనే కంటెస్టెంట్లకు అసలైన టార్చర్ చూపిస్తున్నారు. సెలబ్రిటీలు నేరుగా బిగ్ బాస్‌లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్క్‌లు ఆడతారు. కానీ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్క్‌లను ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తోంది.అగ్నిపరీక్ష సీజన్ 2లో సెకండ్ రౌండ్ ప్రారంభమైంది. 18 మంది కంటెండర్లను కంటెస్టెంట్లుగా మార్చడానికే ఇంత టార్చర్ చూపిస్తే, ఇక హౌస్ లోపల ట్రోఫీ కోసం వీరు ఇంకెంత పెద్ద యుద్ధం చేయాలో!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెత్త టాస్క్‌తో మొదలైంది..
Image Credit : Jio Hotstor

చెత్త టాస్క్‌తో మొదలైంది..

మొత్తానికి అగ్నిపరీక్ష 2లో రెండో రౌండ్ ఒక చెత్త టాస్క్‌తో మొదలైంది. వారం రోజులు కుళ్లబెట్టిన చెత్త కంపును భరిస్తూ.. లాక్ ఓపెన్ చేసే కీ కోసం వెతకాలి. లాక్ తెరిచిన తర్వాత అందులో ఉన్న జ్యూస్‌ను పూర్తిగా తాగితేనే ఆ టాస్క్ పూర్తవుతుంది. ఈ టాస్క్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చినప్పటికీ, ఆఖరిగా అమన్, షాలినీ పోటీ పడ్డారు. ఇద్దరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ, చాలా చిన్న తేడాతో షాలినీ గెలిచి కంటెస్టెంట్‌గా మారింది. అమన్ చేసిన ప్రయత్నానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

Related Articles

Related image1
Samantha Babymoon: వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్
Related image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
35
ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు..
Image Credit : Asianet News

ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు..

ఇక రెండో రౌండ్‌లో రెండో టాస్క్.. బ్రేకప్ లవ్ స్టోరీ. ముందుగా లవ్ స్టోరీస్ గురించి యాంకర్ శ్రీముఖి అడగ్గా ఎవరూ స్పందించలేదు. కానీ బ్రేకప్ లవ్ స్టోరీస్ గురించి అడిగినప్పుడు మాత్రం అందరూ స్పందించారు. తమ ఎక్స్ లవర్‌కి ఫోన్ చేసి, మళ్లీ వారిని ప్రేమలోకి దింపిన వారిని 'డేరింగ్ పర్సన్'గా గుర్తించి కంటెస్టెంట్‌గా ప్రమోషన్ ఇస్తారు. ఈ టాస్క్ కోసం నలుగురు సిద్ధమవ్వగా, శివ సృష్టికి ఆ అవకాశం దక్కింది. ఆమె తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కి ఫోన్ చేయగా అతను తీవ్రంగా షాక్ అయ్యాడు. చివరికి అనుకున్న టాస్క్‌ను పూర్తి చేసి శివ సృష్టి కంటెస్టెంట్ల లిస్ట్‌లోకి చేరిపోయింది.

45
టాటూ టాస్క్ కామన్ అయిపోయింది..
Image Credit : Jio Hotstor

టాటూ టాస్క్ కామన్ అయిపోయింది..

అగ్నిపరీక్షలో మూడో టాస్క్.. టాటూ వేయించుకోవడం. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు టాటూ వేయించుకోవడం సాధారణమే. కానీ అగ్నిపరీక్ష 2లో సెకండ్ రౌండ్‌లోనే టాటూ వేయించుకోవడానికి దాదాపు అందరూ రెడీ అయ్యారు. అయితే ఈ అవకాశం కృష్ణకు వచ్చింది. అతను "తూ నా బ్రతుకు" అనే టాటూను చేతిపై వేయించుకుని ధైర్యం ప్రదర్శించి కంటెస్టెంట్‌గా మారాడు. అతను చూపించిన తెగువకు అందరూ ప్రశంసించారు.

55
తలరాతను మార్చుకునే అవకాశం..
Image Credit : Jio Hotstor

తలరాతను మార్చుకునే అవకాశం..

ఆ తర్వాత నాలుగో టాస్క్.. జుట్టు కత్తిరించుకోవడం. అమ్మాయిలలో ఎవరో ఒకరు తమ హెయిర్‌ను షార్ట్‌గా కట్ చేయించుకోవాలి. ఈ సాహసం ఎవరు చేస్తారని శ్రీముఖి ప్రశ్నించగా, అందరు అమ్మాయిలూ సిద్ధమడ్డారు. అయితే నెల్లూరు అమ్మాయి 'బాగి'కి ఈ అవకాశం వచ్చింది. ఆమె ధైర్యంగా తన హెయిర్ కట్ చేయించుకుని కంటెస్టెంట్‌గా నిలిచింది.

ఇక ఫైనల్ టాస్క్.. 'తలరాత మార్చుకునే అవకాశం'. నవదీప్ నాలుగు సీల్డ్ కార్డ్స్ పెట్టగా, అందులో నేరుగా కంటెస్టెంట్ అయ్యే అవకాశం లేదా ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నాయి. ఆ సీల్డ్ కవర్లలో ఏముందో ఎవరికీ తెలియదు. ఈ టాస్క్ చేయడానికి వెంకటేష్‌తో పాటు హేమంత్ సిద్ధమయ్యారు. ఇద్దరికీ ఒకే రకమైన కార్డ్ రావడంతో నిర్వాహకులు వారికి మరో టాస్క్ పెట్టారు. అందులో హేమంత్ గెలవడంతో కంటెస్టెంట్‌గా నిలబడగా, వెంకటేష్ ఇంటికి వెళ్లిపోయాడు.

ఫైనల్‌గా నలుగురు కంటెస్టెంట్లుగా మారి చివరి పోటీకి సిద్ధమయ్యారు. అగ్నిపరీక్ష సీజన్ 2లో రెండో రౌండ్ ఇంకా కొనసాగబోతోంది. రానున్న రోజుల్లో సామాన్యులు ఇంకెంత కఠినమైన టాస్క్‌లను ఎదుర్కోబోతున్నారో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Related Stories
Recommended image1
Samantha Babymoon: వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్
Recommended image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved