MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!

Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!

పక్షులు చెట్టు కొమ్మల మీద నిద్రపోతున్నప్పుడు కింద పడవు కదా… ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంటుంది. ఇందుకు పక్షుల్లోని 'టెండన్ లాకింగ్ మెకానిజం' ఉపయోగపడుతుంది. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 21 2026, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గాలివాన వచ్చినా పక్షులు కింద పడవు.. ఎందుకో తెలుసా?
Image Credit : Gemini AI

గాలివాన వచ్చినా పక్షులు కింద పడవు.. ఎందుకో తెలుసా?

ప్రయాణ సమయంలో చాలామంది చిన్న కునుకు తీస్తుంటారు… ఈ సమయంలో కొందరు అటూఇటు తూలుతుంటారు. కొన్నిసార్లు పక్కనున్న ప్రయాణికులపై పడుతుంటారు. ఇక మరికొందరయితే ఇంట్లో మంచంపై నిద్రపోతున్నా అటూఇటూ దొర్లుతారు… ఒక్కోసారి మంచం మీద నుంచి కింద పడుతుంటారు. ఇలా నిద్రపోతున్నప్పుడు మనిషి శరీరంపై నియంత్రణ కోల్పోతాడు… కానీ పక్షులు చిటారుకొమ్మన నిద్రపోతున్నా నియంత్రణ కోల్పోదు, కిందపడదు. ఎంత పెద్ద గాలివాన వచ్చినా అవి కొమ్మను గట్టిగా పట్టుకునే ఉంటాయి… ఇలాంటి సమయంలో వాటి కాళ్లకు ఏమైనా ఫెవికాల్ ఉంటుందా అనిపిస్తుంది కదా. దీని వెనుక ఎలాంటి మ్యాజిక్ లేదు, ఒక సూపర్ బయాలజీ దాగుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏమిటీ టెండన్ లాకింగ్ మెకానిజం?
Image Credit : Pixabay

ఏమిటీ టెండన్ లాకింగ్ మెకానిజం?

పక్షుల కాళ్లలో ఒక స్పెషల్ ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సైన్స్‌లో దీన్ని 'టెండన్ లాకింగ్ మెకానిజం' (Tendon Locking Mechanism) అని పిలుస్తారు. పక్షి కాలి వెనుక భాగంలో ఒక పొడవైన స్నాయువు (కండరాన్ని ఎముకతో కలిపేది) ఉంటుంది. ఇది కాలి పైభాగంలోని కండరాన్ని, కాలి వేళ్ల ఎముకలను కలుపుతుంది. పక్షి కొమ్మ మీద కూర్చుని మోకాలిని మడవగానే, ఈ స్నాయువు ఆటోమేటిక్‌గా టైట్ అయిపోతుంది.

మనం చేతిలో ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడు పిడికిలి ఎలా బిగుసుకుంటుందో, ఇది కూడా అంతే. పక్షి కొమ్మమీద వాలగానే కాలి వేళ్లు ఆటోమేటిక్‌గా గట్టిగా పట్టుకుంటాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని కోసం పక్షి ఎలాంటి ఎనర్జీని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక 'పాసివ్ సిస్టమ్'.

34
పక్షులు కొమ్మలపై ఎలా నిద్రపోగలవు?
Image Credit : Pixabay

పక్షులు కొమ్మలపై ఎలా నిద్రపోగలవు?

పక్షి కొమ్మపై కూర్చున్నంత సేపు ‘టెండన్ లాకింగ్ మెకానిజం’ ఓపెన్ అవ్వదు. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే నిద్రలో పక్షి కండరాలన్ని రిలాక్స్ అయితే ఈ లాక్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే పక్షి ఎంత గాఢంగా నిద్రపోతే, అంత గట్టిగా కొమ్మను పట్టుకుంటుంది. కాబట్టి మనుషుల్లాగా నిద్రలో కండరాలు వదులై కింద పడిపోతామనే భయం వాటికి అస్సలు ఉండదు.

పక్షి మళ్లీ గాల్లో ఎగరాలి అనుకున్నప్పుడు అది మోకాలిని తిన్నగా చేసి నిలబడుతుంది. వెంటనే ఆ స్నాయువు వదులై వేళ్ల లాక్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అది ఈజీగా ఎగిరిపోతుంది. ఇలా పక్షుల్లోని ప్రత్యేక మెకానిజమే పక్షులు చెట్లపైనుండి కిందపడకుండా కాపాడుతుంది.

44
పక్షుల శరీర నిర్మాణం కూడా మరో కారణమే...
Image Credit : Pixabay

పక్షుల శరీర నిర్మాణం కూడా మరో కారణమే...

కొమ్మలపై నిద్రపోయే సమయంలో పక్షులు కిందపడకపోడానికి మరో కారణం కూడా ఉంది. చాలా పక్షులు నిద్రపోయేటప్పుడు తమ శరీర బరువును పూర్తిగా కిందికి వదిలేస్తాయి. దీనివల్ల వాటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ (గురుత్వాకర్షణ కేంద్రం) చెట్టు కొమ్మకు సరిగ్గా పైనే ఉంటుంది. దీంతో వాటి బ్యాలెన్స్ అస్సలు మిస్ అవ్వదు.

ప్రకృతి పక్షుల శరీర నిర్మాణాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసిందో ఆలోచించండి..! చిన్న లాకింగ్ సిస్టమ్, సైన్స్ సూత్రం ఆధారంగా అవి కింద పడిపోతామనే భయం లేకుండా చెట్టు కొమ్మల మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : నదులే ఈ రాష్ట్రానికి పేరు పెట్టాయా..! ఇంతకీ ఈ రాష్ట్రమేది, ఆ నదులేవి?
Recommended image2
Two Headed Snakes: రెండు తలల పాము నిజంగానే ఉంటుందా? వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజం ఇదే
Recommended image3
మాంసాహారాన్ని నీచు లేదా నీసు అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరెలా వచ్చింది?
Related Stories
Recommended image1
Color Changing Birds: ఊసరవెల్లి కంటే స్పీడ్‌గా రంగులు మార్చే పక్షులు.. చూస్తే షాక్ అవుతారు !
Recommended image2
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved