MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • మాంసాహారాన్ని నీచు లేదా నీసు అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరెలా వచ్చింది?

మాంసాహారాన్ని నీచు లేదా నీసు అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరెలా వచ్చింది?

గ్రామాల్లోను, కొన్ని పట్టణ ప్రాంతాల్లో మాంసాహారాన్ని నీచు లేదా నీసు అని పిలుస్తుంటారు. ఎంతో మంది ఇష్టంగా తినే ఆహారానికి నీచు అనే పేరు ఎందుకు వచ్చింది? నీచం అనే పదం నుంచే నీచు కూడా పుట్టిందా?

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 21 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మాంసాన్ని నీచు అంటారెందుకు?
Image Credit : Gemini AI

మాంసాన్ని నీచు అంటారెందుకు?

ముక్క లేనిదే ముద్ద దిగదని ఎంతో మంది చెబుతుంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో రెస్టారెంట్లు నడిచేది కూడా నాన్ వెజ్ మీద ఆధారపడే. అయితే మన తెలుగు భాషలో మాంసాహారాన్ని లేదా నాన్-వెజ్ వంటకాలను ‘నీచు’ లేదా ‘నీసు’ అని పిలవడం కొందరికి అలవాటు. ఇలా ఎందుకు పిలుస్తారు? నీచమైన అనే పదం నుంచే ఈ పదాలు కూడా పుట్టాయా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు పెద్దలు చెబుతున్న ప్రకారం పచ్చి మాంసానికి ఉండే ప్రత్యేకమైన వాసన కారణంగా నీచు అని పిలవడం ప్రారంభమైంది. వండకముందు పచ్చి చేపలు, రొయ్యలు, మటన్ లేదా చికెన్‌కు రక్తం, కండరాలు, సహజ ఎంజైమ్‌ల వల్ల ఒక రకమైన ఘాటైన పచ్చి వాసన ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి తెలుగులో ఈ ప్రత్యేకమైన పచ్చి వాసనను 'నీచు వాసన' లేదా 'నీసు కంపు' అని పిలిచేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నీచు అంటే ఏమిటి?
Image Credit : Pixabay

నీచు అంటే ఏమిటి?

భాషా పరిణామం ప్రకారం సంస్కృతంలోని ‘నీచ’ అంటే అధమం లేదా అశుభ్రమైనదిగా భావించేది అని అర్థం. ఈ పదం క్రమేణా తెలుగులోకి చేరిందని భాషా నిపుణులు చెబుతారు. పూర్వ కాలంలో శాఖాహారాన్ని స్వచ్ఛమైన, సాత్విక ఆహారంగాను, రక్తంతో కూడిన జంతు మాంసాన్ని అశుచిగాను భావించేవారు. ఆ ఆలోచనా ధోరణి వల్ల పచ్చి మాంసానికి నీచు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా మొత్తం మాంసాహారాన్ని ‘నీచు’ అని పిలచుకోవడం మొదలుపెట్టారు.

33
చెడు పదం కాదు
Image Credit : Pixabay

చెడు పదం కాదు

కాలం గడుస్తున్న కొద్దీ ఆ వాసనను సూచించే పదమే మొత్తం మాంసాహార కూరలకు పర్యాయపదంగా మారిపోయింది. అందుకే పచ్చి వాసన పోవడానికి మాంసాన్ని పసుపు, ఉప్పు, నిమ్మరసంతో శుభ్రం చేయడం సాంప్రదాయంగా మారింది. చివరకు రోజువారీ సంభాషణల్లో నాన్-వెజ్ కూరలను సూచించడానికి ఇది స్థిరపడి, నీచు లేనిదే ముద్ద దిగదు అనడం మొదలుపెట్టారు. నీచు కాస్త గ్రామాల్లో ‘నీసు’గా మారింది. నిజానికి నీసు అనకూడదు.. నీచు సరైన పదం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
బ్రాయిల‌ర్ చికెన్ తింటే అమ్మాయిలు త్వ‌ర‌గా మెచ్యూర్ అవుతారా.? కోళ్ల‌కు నిజంగానే హార్మోన్స్ ఇస్తారా?
Recommended image2
Beautiful Villages In India : దేశంలోనే అత్యంత అందమైన 5 గ్రామాలు ఇవే
Recommended image3
Jeans: జీన్స్ ప్యాంటుకు జేబుల దగ్గర ఈ చిన్న బటన్స్ ఎందుకుంటాయో తెలుసా?
Related Stories
Recommended image1
బిర్యానీ, పులావ్‌లలో ఉప్పు తగ్గి చప్పగా ఉన్నాయా? నిమిషంలో ఉప్పును సరిచేసే సింపుల్ ట్రిక్
Recommended image2
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved