MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • సలహాలు వద్దు... కుదిరితే సహాయం చెయ్యి.. ఈ పక్షి కథ మీ ఆలోచననే మార్చేస్తుంది..!

సలహాలు వద్దు... కుదిరితే సహాయం చెయ్యి.. ఈ పక్షి కథ మీ ఆలోచననే మార్చేస్తుంది..!

Motivational Story: ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా... సలహాలు ఇవ్వడానికి అందరూ వచ్చేస్తూ ఉంటారు. సలహాలు ఎవరైనా ఇస్తారు. కానీ, పనికి రాని సలహా కంటే.. కుదిరితే సహాయం చేయాలి అని ఈ పక్షి కథ చెబుతోంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 20 2026, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తల్లి పక్షి ఆవేదన..
Image Credit : chat GPT

తల్లి పక్షి ఆవేదన..

ఓ రోజు ఓ తల్లి పక్షి.. సముద్రంలో నీటిని తన నోటితో తీసి బయట పారబోస్తూ ఉంటుంది. అది చూసిన మరో పక్షి.. వచ్చి తల్లి పక్షి చేస్తున్న పని చూసి నవ్వుతుంది. ‘ ఏం చేస్తున్నావ్ నువ్వు?’ అని అడుగుతుంది. దానికి ఆ తల్లి పక్షి.. ‘ నా బిడ్డలు ఈ సముద్రంలో పడిపోయాయి. సముద్రంలో నీటిని తీసేసి.. నా బిడ్డలను బయటకు తీసుకుంటున్నాను’ అని చెబుతుంది. ఆ మాటకు మరో పక్షి నవ్వి.. ‘సముద్రంలో నీటిని నువ్వు ఎంత కాలం తీస్తే.. నీ బిడ్డలు నీకు దొరుకుతారు..? ’ దీని వల్ల ఉపయోగం లేదు అని చెబుతుంది. దానికి ఆ తల్లి పక్షి.. ‘ కుదిరితే సహాయం చెయ్యి.. నీ సలహాలు నాకు వద్దు’ అని చెబుతుంది. దీంతో.. ఆ పక్షి.. కూడా తల్లి పక్షికి సహాయం చేయడం మొదలుపెడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఒక్కటైన పక్షులు..
Image Credit : chat GPT

ఒక్కటైన పక్షులు..

ఈ రెండు పక్షులు చేస్తున్న పనిని మరి కొన్ని పక్షులు చూశాయి. వచ్చి.. మొదటి పక్షి అడిగినట్లుగానే ఏం జరిగింది అని అడిగాయి. అందుకు.. తల్లి పక్షి చెప్పిన సమాధానం విని.. అవి కూడా తలా ఒక సలహా ఇవ్వడం మొదలుపెట్టాయి. కానీ.. తల్లి పక్షి వారి సలహాలు వినలేదు. ‘ కుదిరితే సహాయం చేయండి..’ అని మాత్రమే అడిగింది. దీంతో.. ఆ పక్షులు కూడా సహాయం చేయడం మొదలుపెట్టాయి. పక్షులన్నీ అక్కడికి చేరి.. తమ వంతు ప్రయత్నంగా... సముద్రంలో నీటిని తోడటం మొదలుపెట్టాయి.

33
పక్షులకు తోడుగా గరుడ పక్షి..
Image Credit : chat GPT

పక్షులకు తోడుగా గరుడ పక్షి..

ఈ పక్షులు పడుతున్న ఆవేదన మొత్తం దేవతా పక్షి గరుడకు తెలుస్తుంది. దీంతో... ఆ గరుడ పక్షి కూడా.. సహాయం చేయడానికి వస్తూ ఉంటుంది. అది చూసిన శ్రీ మహా విష్ణు.. గురుడను ఆపుతాడు. విషయం ఏంటి అని అడుగుతాడు. ‘ నేను కూడా వెళ్లి ఆ పక్షులకు సహాయం చేయాలి.. తల్లి పక్షికి.. పిల్ల పక్షులను చేర్చాలి’ అని చెబుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు.. నేను కూడా నీతో వస్తాను.. అని ఆ పక్షకుల దగ్గరకు వెళతారు. అక్కడకు వెళ్లి.. విష్ణుమూర్తి.. సముద్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ‘ మర్యాదగా.. ఆ పిల్ల పక్షులను తల్లి పక్షికి ఇచ్చేయమని.. లేకపోతే.. సముద్రంలో చుక్క నీరు కూడా లేకుండా చేస్తాను’ అని అంటారు. ఆ మాటలకు భయపడిపోయిన సముద్రుడు..తాను మింగేసిన పక్షి పిల్లలను బయటకు తీసి.. తల్లి పక్షికి అందిస్తాడు. దీంతో.. ఆ తల్లి పక్షి.. సంతోషంగా తన బిడ్డలను చేరుకుంటుంది.

సలహాలు వద్దు.. కుదిరితే సహాయం చెయ్యి..

ఆ పక్షులన్నీ.. తమ వల్ల ఏం అవుతుందిలే అనుకోకుండా.. సహాయం చేయడానికి ముందుకు రావడం వల్లే.. చివరకు ఆ సమస్య దైవం దాకా చేరి.. ఆ తల్లి పక్షికి న్యాయం జరిగింది. ఇదే కథ మన మనుషులకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా.. నోటికి వచ్చిన సలహాలు చెప్పడం కాదు.. వీలైతే సహాయం చేయడం నేర్చుకోవాలి. ఆ సహాయం వారిని కష్టం నుంచి బయట పడేసే అవకాశం ఉంటుంది. మనం చేసే చిన్న సహాయం.. వారికి ఎంతో పెద్ద కష్టాన్ని తీర్చవచ్చు. అందుకే.. వీలైతే సలహాలు ఇవ్వడం కాదు.. సహాయమే చేద్దాం..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
నీతి కథలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Idli History : ఇడ్లీ ఇండియన్ టిఫిన్ కాదా..! ఏ దేశం నుండి వచ్చిందో తెలుసా?
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Indian Food: 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం కొనుక్కుని తినేవారో తెలుసా?
Related Stories
Recommended image1
Kumkum: మీరు ఇంట్లో రోజూ వాడే కుంకుమ.. తయారయ్యేది ఈ గ్రామంలోనే..!
Recommended image2
Leafy Greens: ఆకుకూరలను తూకంతో ఎందుకు అమ్మరు?కట్టలు కట్టి అమ్మడం వెనక రీజన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved