MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Kumkum: మీరు ఇంట్లో రోజూ వాడే కుంకుమ.. తయారయ్యేది ఈ గ్రామంలోనే..!

Kumkum: మీరు ఇంట్లో రోజూ వాడే కుంకుమ.. తయారయ్యేది ఈ గ్రామంలోనే..!

Kumkum: హిందువులు అందరి ఇంట్లో కచ్చితంగా కుంకుమ ఉంటుంది. మనం కొనే ఈ కుంకుమ ఎక్కడ తయారౌతుందో తెలుసా? దాదాపు మన దేశంలో తయారయ్యే కుంకుమ ఓ గ్రామంలో తయారౌతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 19 2026, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కుంకుమ తయారు చేసే గ్రామం...
Image Credit : our own

కుంకుమ తయారు చేసే గ్రామం...

మన దేశంలో పండగలు, శుభాకార్యలు, పూజలు ఏది ఉన్నా.. కచ్చితంగా వాటికి కుంకుమ ఉండాల్సిందే. పూజలకు మాత్రమే కాదు.. హిందూ మహిళలు నిత్యం కుంకుమను తమ నుదుటిపై ధరిస్తారు. మన దేశంలో కుంకుమను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మనం నిత్యం వాడే కుంకుమ ఎక్కడ తయారౌతుంది? ఆ గ్రామ కథేంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కుంకుమ తయారు చేసే గ్రామం...
Image Credit : Chat GPT

కుంకుమ తయారు చేసే గ్రామం...

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా తాకాలో కైమ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం కుంకుమ తయారీకి దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశం మొత్తానికి ఇదే గ్రామం నుంచి కుంకుమ వెళ్తుంది అని చెప్పలేం కానీ.. దాదాపు.. ఎక్కువ శాతం ఇక్కడి నుంచే పంపిణీ జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామం నుంచి... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుంది. ఈ గ్రామంలో.. ఒకప్పుడు ప్రతి రోజూ 70 నుంచి 80 టన్నుల కుంకుమ తయారౌతుంది. ఈ మధ్యకాలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కుంకుమ తయారీ పెరగడంతో.. కాస్త తయారీ కూడా తగ్గింది. ప్రస్తుతం అయితే ప్రతిరోజూ 40 నుంచి 50 టన్నుల వరకు తయారౌతుందని స్థానికులు చెబుతున్నారు.

33
కుంకుమ తయారీ బిజినెస్ కాదు ఒక ఎమోషన్..
Image Credit : Chat GPT

కుంకుమ తయారీ బిజినెస్ కాదు ఒక ఎమోషన్..

ఈ గ్రామానికి కుంకుమ తయారీ అనేది ఒక వ్యాపారం మాత్రమే కాదు ఒక ప్యూర్ ఎమోషన్. ఈ కుంకుమ తయారీ.. ఈ మధ్య మొదలుపెట్ట లేదు. దాదాపు 300 సంవత్సరాలుగా ఈ గ్రామస్థులు కుంకుమ తయారు చేస్తున్నారు. తరతరాలుగా కుటుంబ వారసత్వంగా వారు ఈ కుంకుమ తయారు చేస్తూ వస్తున్నారు. ఈ గ్రామంలో కుంకుమ తయారీ కోసం దాదాపు 20 కుంకుమ తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. వీటిలో వందల కొద్దీ కార్మికులు పని చేస్తుంటారు. వారిందరికీ ఈ కుంకుమ తయారు చేయడమే జీవనాధారం. కుంకుమ ప్రధాన తయారీ కాగా.. గంధం, పసుపు లాంటివి కూడా వీరు తయారు చేస్తారు.

దేవాలయాలకు కూడా ఇదే కుంకుమ..

మన దేశంలోని చాలా ప్రముఖ దేవాలయాలకు కూడా కుంకుమ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. అయోధ్య రామ మందిర ప్రారంభ వేడుకల్లోనూ ఇక్కడి నుంచి పంపిన కుంకుమే వాడినట్లు స్థానికులు చెబుతుంటారు.

కుంకుమే కాదు.. అని తక్కువ అంచనా వేయకండి.. ఇక్కడ కేవలం కుంకుమ తోనే ప్రతి సంవత్సరం దాదాపు రూ.200 కోట్లకు పైగా వ్యాపారం చేస్తుంటారని స్థానిక మీడియా వర్గాలు చెబుతున్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా ఆపాలి?
Recommended image2
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
River : నదులే ఈ రాష్ట్రానికి పేరు పెట్టాయా..! ఇంతకీ ఈ రాష్ట్రమేది, ఆ నదులేవి?
Related Stories
Recommended image1
Leafy Greens: ఆకుకూరలను తూకంతో ఎందుకు అమ్మరు?కట్టలు కట్టి అమ్మడం వెనక రీజన్ ఏంటి?
Recommended image2
Costly Wedding Venue: ఇక్కడ ఒక్క రోజుకి అయ్యే పెళ్లి ఖర్చుతో.. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved