MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం

Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం

ఎపిక్‌ సినిమాకి `బేబీ` జోడీ ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యని ఎంపిక చేయడంపై దర్శకుడు ఆదిత్య హాసన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు. హీరోయిన్‌ ని నిర్మాతనే ఎంపిక చేశాడని తెలిపారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 07 2026, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వైష్ణవి ఛాయిస్‌ నిర్మాత నాగవంశీదే
Image Credit : Asianet News

వైష్ణవి ఛాయిస్‌ నిర్మాత నాగవంశీదే

`ఎపిక్‌` మూవీకి `బేబీ` జోడీని రిపీట్‌ చేయడంపై దర్శకుడు ఆదిత్య హాసన్‌ స్పందించారు. వైష్ణవి చైతన్యని నాగవంశీనే తీసుకున్నారని, ఆమె నా ఛాయిస్‌ కాదని, కానీ ఆనంద్‌ దేవరకొండ మాత్రం నా ఛాయిసే అని తెలిపారు. ఆయన దర్శకుడిగా `ఎపిక్‌` ఫస్ట్ సెమిస్టర్‌` మూవీ తెరకెక్కింది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎపిక్‌ మూవీ స్టోరీ ఇదే
Image Credit : Asianet News

ఎపిక్‌ మూవీ స్టోరీ ఇదే

తాజాగా సోమవారం దర్శకుడు ఆదిత్య హాసన్‌ మీడియాతో మాట్లాడుతూ, తన లైఫ్‌ గురించి, సినిమా గురించి వెల్లడించారు. వనపర్తి నుంచి వచ్చిన ఆదిత్య హాసన్‌ హైదరాబాద్‌లో డిగ్రీ చేసి మాస్టర్‌ కోసం యూకే వెళ్లాడు. అక్కడ కొన్ని అనుభవాలను ఫేస్‌ చేశారు. డిగ్రీ చదివే సమయంలోనే ఆయనకు దర్శకుడిగా మారాలనిపించింది. తన జీవితంలో జరిగిన సంఘటనలతో, తాను చూసిన సంఘటనలతో `90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` మూవీని రూపొందించారు. ఈ సిరీస్‌ మంచి ఆదరణ పొందడంతో దీనికి సీక్వెల్‌గా `ఎపిక్‌` మూవీని రూపొందించారు. అందులోని చిన్నబ్బాయి యూకే వెళ్లి చదువుకుంటే ఏం చేశాడు? అతని జర్నీ ఎలా ఉంటుందనేది ఈ మూవీలో చూపించబోతున్నారట.

Related Articles

Related image1
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Related image2
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
34
రొమాన్స్ మాత్రమే కాదు అవి కూడా ఉంటాయి
Image Credit : Asianet News

రొమాన్స్ మాత్రమే కాదు అవి కూడా ఉంటాయి

ఈ సినిమాకి హీరోగా ఆనంద్‌ దేవరకొండని తాను తీసుకున్నట్టు తెలిపారు. ఆనంద్‌ తన ఛాయిస్‌ అన్నాడు. కాకపోతే వైష్ణవిని ముందు అనుకోలేదని తెలిపారు. నిర్మాత నాగవంశీనే ఆమె పేరుని సజెస్ట్ చేశాడని, బేబీ జోడీ బాగుంటుందన్నారు. బిజినెస్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఆయన ఎంపిక చేవారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే మొదట ఒత్తిడిగా అనిపించింది. ఆ తర్వాత ఓకే హ్యాండిల్‌ చేయోచ్చు, దాన్ని మించి చేయోచ్చు అనే ఫీలింగ్‌ కలిగిందన్నారు. ట్రైలర్‌లో చూపించినట్టు రొమాన్స్ మాత్రమే కాదు, వాళ్ల జర్నీ ఉంటుంది. హీరోహీరోయిన్ల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమా సాగుతుంది. రెండు పాత్రలను బ్యాలెన్స్ చేశాను. అలాగే క్యాస్ట్, మతాల గురించి ఒక స్టేట్‌మెంట్‌ ఉండదు, సరదాగా కొన్ని డైలాగ్‌లు పెట్టాం. దీనికితోడు సినిమాలో రొమాన్స్ మాత్రమే కాదు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొంత రియల్‌ లైఫ్‌ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఫన్‌, లవ్‌, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ మేళవింపుగా మూవీ ఉంటుందన్నారు.

44
యూనివర్స్ లా `90 మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌`
Image Credit : Asianet News

యూనివర్స్ లా `90 మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌`

`90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్ సిరీస్‌ నుంచి వరుసగా సినిమాలు వస్తాయని తెలిపారు. `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌` తర్వాత రెండో సెమిస్టర్‌ ఉంటుందన్నారు. ఈ మూవీ రిలీజ్‌ అయిన తర్వాత నెక్ట్స్ అదే సినిమా స్టార్ట్ అవుతుందన్నారు. హీరోహీరోయిన్లు జాబ్‌లు, పెళ్లి కి సంబంధించిన అంశాలను అందులో చూపిస్తానని వెల్లడించారు. అలాగే `90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` కి సీజన్‌ 2 కూడా ఉంటుందన్నారు. ఇంకోవైపు పెద్ద కొడుకు స్టోరీతో ఒక మూవీ ఉంటుందని, అమ్మాయి వెర్షన్‌లో మరో సినిమా ఉంటుందని, దీన్ని ఒక సిరీస్‌లాగా, యూనివర్స్ లాగా తీసుకెళ్లే ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు ఆదిత్య హాసన్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Movie Interval : సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? దీని వెనుక పెద్ద కథే ఉంది!
Recommended image2
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image3
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Related Stories
Recommended image1
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image2
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved