MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడి సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?

New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడి సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?

New Film Opening: `ఎస్‌ ఆర్‌ కళ్యాణమండపం` సినిమా దర్శకుడు, కమిటీ కుర్రోళ్లు మూవీలో నటించిన హీరో కలిసి రూపొందిస్తున్న కొత్త సినిమా నేడు సోమవారం ప్రారంభమైంది. ఈ మూవీ కాన్సెప్ట్ అదిరిపోయింది.

1 Min read
Author : Aithagoni Raju
Published : Sep 07 2026, 08:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
కమిటీ కుర్రోళ్ల ఫేమ్‌ హీరోతో.. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` దర్శకుడి సినిమా
Image Credit : Asianet News

కమిటీ కుర్రోళ్ల ఫేమ్‌ హీరోతో.. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` దర్శకుడి సినిమా

కమిటీ కుర్రోళ్లు చిత్రంతో ఆకట్టుకున్న ఈశ్వర్‌ రాచి రాజు సోలో హీరోగా మారిపోయాడు. ఆయన హీరోగా కొత్త సినిమా నేడు ప్రారంభమైంది. ఇందులో నందు, లిఖిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` మూవీకి దర్శకత్వం వహించిన శ్రీధర్‌ గాదె ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. ఇక శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో "హైవే" వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే హర్రర్‌ స్టోరీ
Image Credit : Asianet News

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే హర్రర్‌ స్టోరీ

సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. `విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వినూత్నంగా ఉండి ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

ఇందులో పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సతీష్‌ రెడ్డి మాసం కెమెరామెన్‌గా, సాయికార్తీక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, శ్రీధర్‌, వీబీజే ఎడిటర్స్ గా వ్యవహరిస్తున్నారు.

Related Articles

Related image1
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Related image2
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora Skincare: 52 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న మలైకా.. ఆమె నైట్ స్కిన్‌కేర్ సీక్రెట్ ఇదే!
Recommended image2
Reality Show: బిగ్ బాస్ ని మించిన వింత, కాంట్రవర్షియల్ రియాలిటీ షోలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Recommended image3
Sreeleela: అందానికే అసూయ పుట్టించేలా మహేష్ బాబు హీరోయిన్ లేటెస్ట్ లుక్! రాధలా మారిన శ్రీలీల..
Related Stories
Recommended image1
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image2
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved