MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీలీలా దెబ్బకి బేజారెత్తిపోతున్నా రష్మిక, పూజా, కృతి శెట్టి.. `ధమాకా` బ్యూటీ జోరు మామూలుగా లేదుగా

శ్రీలీలా దెబ్బకి బేజారెత్తిపోతున్నా రష్మిక, పూజా, కృతి శెట్టి.. `ధమాకా` బ్యూటీ జోరు మామూలుగా లేదుగా

కుర్ర హీరోయిన్‌ శ్రీలీలా ఇప్పుడు దూకుడుమీదుంది. అందరి చూపు ఆమెపైనే పడింది. వరుస ఆఫర్లు అందుకుంటుంది. అదే సమయంలో స్టార్‌ హీరోయిన్లు రష్మిక, పూజా, కృతి శెట్టిలకు ఝలకు ఇస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 29 2022, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

శ్రీలీలా.. టాలీవుడ్‌లో ఇప్పుడు జోరుగా వినిపిస్తున్న పేరు. `పెళ్లిసందడి`తో మెరిసిన ఈ సోయగం ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయిపోయింది. `ధమాకా` చిత్ర సక్సెస్‌తో మరింత జోరుపెంచింది. ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. టాలీవుడ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. అంతేకాదు, ఇతర స్టార్‌ హీరోయిన్ల ఆఫర్లని కొల్లకొడుతుండటం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

శ్రీలీలా క్రేజ్‌కి అందరి చూపు ఈ బ్యూటీపైనే పడుతుంది. ఇదిప్పుడు తోటి హీరోయిన్లకి పెద్ద దెబ్బగా మారుతుంది. వారికి ప్రధానంగా పోటీగా మారబోతుందని చెప్పొచ్చు. జనరల్‌గా తోటి హీరోయిన్లు పెరిగిపోతుంటే, తమ అవకాశాలను చేజిక్కుంచుకుంటుంటే వాళ్లలో జలసీ ఫీలింగ్‌ ఉంటుంది. స్టార్‌ ఇమేజ్‌ కలిగిన హీరోయిన్లు ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 

38

పూజా హెగ్డే జోరు గతేడాది వరకు సాగింది. ఆమె సినిమా చేస్తే దానికి తిరుగేలేదు. సక్సెస్‌ గ్యారంటీ అనే టాక్‌ పడింది. దిల్‌రాజు లాంటి వాళ్లైతే ఏకంగా గోల్డెన్‌ లెగ్‌, లక్కీ హీరోయిన్‌ వంటి ట్యాగ్‌లు కూడా యాడ్‌ చేశారు. కానీ ఈ ఏడాది ఈ బ్యూటీకి కలిసి రాలేదు. వరుసగా పరాజయాలు చవిచూసింది. `ఆచార్య`,`రాధేశ్యామ్‌`, `బీస్ట్`, `సర్కస్‌` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో తెలుగులోనూ ఈ బ్యూటీ క్రేజ్‌ పడిపోతుంది. 

48

రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌ పేరుతెచ్చుకుంది. పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. `పుష్ప`తో ఆమె క్రేజ్‌ ఇండియాకి పాకింది. కానీ ఈ ఏడాది ఆమె జోరు తగ్గింది. తెలుగులో చేసిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా బోల్తా కొట్టింది. మరోవైపు హిందీలో చేసిన `గుడ్‌ బై` డిజాస్టర్‌ అయ్యింది. మరో సినిమా `మిషన్‌ మజ్ను`జనవరి 20న రిలీజ్‌ కాబోతుంది. దీనిపై పెద్దగా బజ్‌ లేదు. అలాగే విజయ్‌ తో నటించిన `వారసుడు` ఈ సంక్రాంతికి రాబోతుంది. 
 

58

అయితే రష్మికాకి సక్సెస్‌ లేకపోవడంతో గతేడాది ఉన్న జోరు, క్రేజ్‌ ఇప్పుడు కనిపించడం లేదు. గ్లామర్‌తో మెప్పిస్తుంది తప్ప, సినిమాల పరంగా ఆ స్థాయి జోరు కనిపించడం లేదు. పైగా ఆమె అవకాశాలను ఇతర హీరోయిన్లు దక్కించుకోవడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. 
 

68

ఇంకోవైపు `ఉప్పెన` చిత్రంతో ఉవ్వెత్తున ఎగిసిపడింది కృతి శెట్టి. ఆమెకి ఆ ఒక్క సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు`, `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాల్లో నటించింది. ఇందులో `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` యావరేజ్‌ గా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత మూడు సినిమాలు బోల్తా కొట్టాయి. 

78

ప్రస్తుతం రెండు మూడు సినిమాలు మాత్రమే ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. అదే సమయంలో ఆ స్థాయి క్రేజ్‌ కూడా పడిపోయింది. ఈ అమ్మడు కూడా ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఆ జోరు కనిపించడం లేదు. ఇవన్నీ ఇప్పుడు శ్రీలీలాకి ప్లస్‌గా మారుతున్నాయి. ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మిడిల్‌ రేంజ్‌ హీరోల నుంచి స్టార్‌ హీరోల సినిమాల వరకు ఆమెకి అవకాశాలు క్యూ కడుతుండటం విశేషం. 

88

తాజాగా `ధమాకా` చిత్రంతో ఆకట్టుకున్న శ్రీలీలా ఇప్పుడు `మహేష్‌-త్రివిక్రమ్‌` సినిమాలో, అలాగే బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి చిత్రంలో, దీంతోపాటు కన్నడ, తెలుగు బైలింగ్వల్‌ మూవీ, బోయపాటి-రామ్‌ చిత్రంలో, నవీన్‌ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు` చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇవి కేవలం అధికారికంగా ప్రకటించినవి మాత్రమే, ఇవి కాక ఇంకా చర్చల దశలో మరో నాలుగైదు సినిమాలుంటాయని టాక్‌. ఇవన్నీ పూజా, రష్మిక, కృతి లాంటి హీరోయిన్లకి అవకాశాలను ఈ బ్యూటీ దక్కించుకుంటుందని చర్చ నడుస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Suman: ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం
Recommended image2
Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌
Recommended image3
Rajamouli: ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved