MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఇప్పటికీ నెంబర్‌ వన్‌ సమంతనే.. ఆమె స్టామినాకిదే నిదర్శనం.. టాప్‌ హీరోయిన్లంతా దిగదుడుపే

ఇప్పటికీ నెంబర్‌ వన్‌ సమంతనే.. ఆమె స్టామినాకిదే నిదర్శనం.. టాప్‌ హీరోయిన్లంతా దిగదుడుపే

సమంత క్లిష్ట సమయంలోనూ తన సత్తాని చాటుతుంది. ఇటు సినిమాల పరంగా, అటు క్రేజ్‌ పరంగా ఆమె దుమ్మురేపుతుంది. మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో నిరూపించుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 24 2022, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత ఇటీవల `యశోద` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్‌గా చిత్రంగా, సరోగసి నేపథ్యంలో సాగే మెడికల్ మాఫియా కథతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఇప్పటికీ సెటిల్డ్ గా రన్‌ అవుతుంది. దాదాపు 35కోట్లు వసూలు చేసి బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. లాభాల బాటలో రన్‌ అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఓ వైపు భర్తతో విడిపోయి, మరోవైపు అనారోగ్యంతో పోరాడుతూ సమంత చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించడం, కలెక్షన్ల పరంగానూ అదరగొడుతున్న నేపథ్యంలో సమంత స్టామినాకి అద్దం పడుతుంది. స్టార్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా తన మార్కెట్‌ని చాటుకుంది సమంత. పాన్‌ ఇండియా వైడ్‌గా తన పవర్‌ని చూపించింది.
 

36

ఇందులో యాక్షన్‌తో అదరగొట్టింది సమంత. స్టార్ హీరోల రేంజ్‌లో యాక్షన్‌ చేసింది. యాక్షన్‌ చేయాలంటే హీరోలే ఉండాల్సిన అవసరం లేదని, ఆ లోటు లేకుండా చేసింది. వెండితెరపై విశ్వరూపం చూపించారు. దీనికోసం సమంత చాలా శ్రమించింది. ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందట. ప్రత్యేకమైన ట్రైనర్ల ద్వారా శిక్షణ తీసుకుందట. రోజుకి కొన్ని గంటలపాటు జిమ్‌లో టైమ్‌ స్పెండ్‌ చేసేదట. అంతగానూ కష్టపడటం వల్లే సినిమాలో యాక్షన్‌తో అదరగొట్టిందని అంటోంది యూనిట్‌.

46

ఇప్పుడు మరో రూపంలోనూ తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా ఆమె నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. `ఓర్మాక్స్ మీడియా` ప్రకటించిన జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలవడం విశేషం. మోస్ట్ పాపులర్‌ ఫిమేల్‌ స్టార్స్ జాబితాలో సమంత ఫస్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత అలియాభట్‌ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార మూడో స్థానంలో, కాజల్‌ నాలుగు, దీపికా పదుకొనె ఐదు, రష్మిక ఆరు, కత్రినా ఏడు, అనుష్క ఎనిమిది, కీర్తిసురేష్‌ తొమ్మిది, త్రిష పదవ స్థానంలో నిలిచారు. పూజా, తమన్నా, ఐశ్వర్య, కరీనా, కంగనా వంటి హీరోయిన్లకి ఇందులో స్థానం దక్కకపోవడం గమనార్హం. 
 

56

సమంత `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌తోనే ఇండియా వైడ్‌గా ఆకట్టుకుంది. గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగచైతన్యతో విడాకుల మ్యాటర్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఆమెపై అందరినిలోనూ సింపతి పెంచింది. మరోవైపు ఇటీవల తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పడం వంటి అంశాలు ఆమెని పాపులర్‌గా మార్చాయి. 

66

సమంత `యశోద` సక్సెస్‌ ఆనందంలో కొత్త సినిమాల విషయంలో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగబోతుంది. ప్రస్తుతం ఆమె `శాకుంతలం`, `ఖుషి` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు బాలీవుడ్‌లో రెండు సినిమాలు, ఓ ఇంటర్నేషనల్‌ మూవీ చేయబోతుంది సమంత. అయితే ఆమె మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాన్నుంచి కోలుకుంటుంది సమంత. అందుకు మరికొంత సమయం పడుతుందని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved