- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి చదువు గురించి తెలుసుకున్న మల్లిక.. జ్ఞానాంబ దగ్గర సర్టిఫికెట్లు కొట్టేసిన రామచంద్ర!
Janaki Kalaganaledu: జానకి చదువు గురించి తెలుసుకున్న మల్లిక.. జ్ఞానాంబ దగ్గర సర్టిఫికెట్లు కొట్టేసిన రామచంద్ర!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఉంటుంది. మంచి కుటుంబ కథతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు జులై 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర(ramachandra), జానకి గోవిందరాజుల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే గోవిందరాజు అక్కడికి వచ్చి బీరువా బీగాలను చూపించి నేను మీ అమ్మని గదిలోకి రాకుండా చూసుకుంటాను నువ్వు దొంగ చాటుగా వెళ్లి ఆ పేపర్ లను తీసుకొచ్చేయ్ అనడంతో రామచంద్ర, జానకి(Janaki)షాక్ అవుతారు. ఇక చాటుగా ఉంటూ వారి మాటలు వింటు ఉంటుంది మల్లిక.
అప్పుడు రామచంద్ర దొంగతనంగా తీసుకోవాలి అనడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు జానకి(janaki) మాత్రం టెన్షన్ పడుతూ వద్దు మామయ్య ఇలా చేస్తే అత్తయ్యను ఇంకా మోసం చేసినట్టే అవుతుంది అంటుంది. కానీ గోవిందరాజు(govindaraju)మాత్రం జానకికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ గోవిందరాజు మాత్రం వారిద్దరికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.
ఆ తర్వాత రామచంద్ర(ramachandra)చేతిలో తాళాలు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు గోవిందరాజు. అప్పుడు మల్లిక(mallika)ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబను, గోవిందరాజులు మాట్లాడటానికి అని పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు జ్ఞానాంబను మాటలతో మభ్యపెడుతూ ఉంటాడు గోవిందరాజు. అప్పుడు అదంతా చూస్తున్న మల్లిక ఏదో గూడుపుఠాణి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత గోవిందరాజు,జ్ఞానాంబ(jnanamba)కు గోరింటాకు పెడుతూ ఉండగా రామచంద్ర వాళ్ళు తొంగిచూస్తూ ఉంటారు. అప్పుడు గోవిందరాజు వారిని వెళ్ల ముంటూ సైగలు చేస్తూ ఉంటాడు. అప్పుడు అదంతా చూస్తున్న మల్లిక షాక్ లో ఉంటుంది. అప్పుడు జానకి(janaki) ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు రామచంద్ర జానకి పేపర్లను తీసుకొని బయటికి వస్తాడు.
ఆ విషయాన్ని గోవిందరాజు(govindaraju)కీ చెప్పడంతో సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు జానకి వాళ్ళు దొంగ చాటుగా వెళుతూ ఉండగా అది చూసి మల్లిక ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు మల్లిక ఏదో ఒక రకంగా ఆ ప్లాన్ ని బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మల్లిక(mallika)తన తమ్ముడికి ఫోన్ చేసి ప్లాన్ వివరిస్తుంది. ఇక రామచంద్ర జానకి టెన్షన్ పడుతూ బండిపై వెళ్తూ మాట్లాడుతూ వెళ్తుంటారు.
అప్పుడు మల్లిక(mallika)తన తమ్ముడిని జానకి వాళ్ళ వెంటనే ఫాలో అవుతూ ఆ పేపర్లు ఎవరికి ఇస్తారు నాకు చెప్పు అని చెబుతుంది. అందుకు జానకి తమ్ముడు కూడా సరే అని చెప్పి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తర్వాత జానకి(janaki) వాళ్ళు కాలేజీకి వెళ్తారు. జానకి తమ్ముడు వారిని ఫాలో అవుతూ వెళ్తూనే ఉంటాడు. ఆ తర్వాత మల్లిక తమ్ముడు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెబుతాడు.