MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్

Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు.

3 Min read
Author : Tirumala Dornala
Published : Sep 18 2026, 10:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
'ప్రేమనే ఊరిలో' సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్
Image Credit : Asianet News

'ప్రేమనే ఊరిలో' సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక శనివారం నాడు మరో పాటను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ తో పాటు కామాక్షి భాస్కర్ల పాల్గొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రేమనే ఊరిలో’ సినిమాతో నిర్మాతగా
Image Credit : Asianet News

ప్రేమనే ఊరిలో’ సినిమాతో నిర్మాతగా

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిలే చాలా బాగుంది. టీజర్‌లో శ్రీకాంత్ గారి వాయిస్ ఓవర్ బాగుంది. తణికెళ్ల భరణి గారు రిలీజ్ చేసిన పాట కూడా బాగుంది. ఈ ప్రమోషన్స్‌లో నన్ను భాగస్వామిని చేసిన సురేష్ గారికి థాంక్స్. ఈ సినిమాతో శ్రీనివాస్ గారికి మంచి విజయం దక్కాలి. ఆర్టిస్టులు తెరపై అద్భుతంగా కనిపించారు. ‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చందు శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ సినిమాతో నిర్మాతగా అడుగు పెడుతున్నాను. చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాను. దేవేందర్ గారు నాకు బిజినెస్‌లో హెల్ప్ చేశారు. ఆయన వల్లే ఈ సినిమా నాకు తెలిసింది. పోస్టర్ చూసిన వెంటనే నాకు ఎంతో నచ్చింది. టీజర్ చూసిన వెంటనే సురేష్ గారికి ఫోన్ చేశాను. శ్రుతి, దేవేందర్, నేను కలిసి ఈ టీజర్‌ను సురేష్‌కి చూపించాం. అదే రోజు సినిమాని మేమంతా చూశాం. జెన్ జీ ఆడియెన్స్‌ని కూడా మూవీని చూపించాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌కి సినిమా చాలా నచ్చింది. రాంబాబు మాకు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. శ్రీరామ్, రమిక, తపస్విని అద్భుతంగా నటించారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

34
తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం
Image Credit : Asianet News

తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘నేను గతంలో చేసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’ రేంజ్‌లో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి దూరంగా ఉండమని చందుకి సలహా ఇస్తుంటాను. అయితే ఈ మూవీ గురించి చెప్పినప్పుడు, చూసినప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. మనం కలిసి ఇకపై జర్నీ స్టార్ట్ చేద్దాం అని చందుతో అన్నాను. ‘ప్రేమనే ఊరిలో’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. శ్రీరామ్, రమిక, తపస్వినిలకు ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. కన్నడ, తెలుగులో ఈ సినిమాకి మంచి విజయం దక్కుతుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రూపాయి పెడితే ఐదు రూపాయల లాభం తీసుకు వచ్చే సినిమా అవుతుంది. నా ప్రాజెక్ట్‌లోకి సాకేత్ వచ్చాడంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు థాంక్స్. మా ‘ప్రేమనే ఊరిలో’ సినిమాకి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రం కోసం హైదరాబాద్‌కి రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు అంతులేని ప్రేమను చూపిస్తారు. నాకు కన్నడ ఇండస్ట్రీతో పాటుగా తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ‘ప్రేమనే ఊరిలో’ సోల్ ఫుల్, ఎమోషనల్, మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. తెలుగులో సినిమాలు చేయాలని ఉంది. నాక్కూడా ఇక్కడి ప్రేక్షకులు కొంత ప్రేమను ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

44
ఇదొక ఫీల్ గుడ్ మూవీ
Image Credit : Asianet News

ఇదొక ఫీల్ గుడ్ మూవీ

నటి తపస్విని మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. ప్రతీ ఒక్కరికీ మా సినిమా కనెక్ట్ అవుతుంది. సెప్టెంబర్ 25న మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటి రమిక మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రంలో అవకాశం ఇచ్చిన మనోజ్ గారికి థాంక్స్. మనోజ్ గారు ఓ మంచి కథతో సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీలోని ప్రతీ పాత్ర ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతుంది. కన్నడ, తెలుగులో ఇదే నా తొలి చిత్రం. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. మా సినిమా సెప్టెంబర్ 25న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
Pawan Kalyan: కార్ల కింద చేతులు పెట్టిన పవన్ కళ్యాణ్, ముట్టుకుని చూసి లెజెండ్రీ సింగర్ ఏమన్నారో తెలుసా
Recommended image2
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved