MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్

King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్

King 100: నాగార్జున 100వ సినిమా ‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 29 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nagarjuna
Image Credit : Asianet News

Nagarjuna

అక్కినేని నాగార్జున 100వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి అమల చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగార్జున 100వ సినిమా టైటిల్‌ ‘కింగ్ 100’
Image Credit : Asianet News

నాగార్జున 100వ సినిమా టైటిల్‌ ‘కింగ్ 100’

నాగార్జున 100వ సినిమాకు ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే గ్లింప్స్‌ను పవర్‌ఫుల్‌గా రూపొందించారు. ఇప్పటివరకు నాగార్జున 100వ సినిమాలో ఎలాంటి కథను చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో ఉండగా, ఈ గ్లింప్స్‌తో సినిమాకు సంబంధించిన కీలక అంశాలపై ఓ క్లారిటీ వచ్చింది. ఇందులో నాగార్జున పేదవాడి స్థాయి నుంచి వేల కోట్లకు ఎదిగిన బిజినెస్‌మ్యాన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

35
వేల కోట్ల స్కామ్ లు
Image Credit : Asianet News

వేల కోట్ల స్కామ్ లు

ఆర్థికపరమైన స్కామ్‌లు, డబ్బు, అధికారం, పవర్‌గేమ్‌ చుట్టూ ఈ కథ సాగనున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. నాగార్జున స్వయంగా చెప్పిన వాయిస్‌ఓవర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. “మనుషుల్లో రెండు రకాలు.. డబ్బు ఉన్నోళ్లు, డబ్బు లేనోళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు.. డబ్బు ఉన్నప్పుడు వాళ్లే నన్ను కింగ్ అని పిలిచారు. ఈ ఐడెంటిటీ డబ్బు కంటే పవర్‌ఫుల్. దీనిని నిలబెట్టుకోవడానికి నేను పరిగెడుతూనే ఉండాలి” అంటూ నాగార్జున చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో హీరో పేదవాడి స్థాయి నుంచి వేల కోట్ల స్కామ్ లు చేసి బిజినెస్ టైకూన్ గా ఎదిగినట్లు గ్లింప్స్ లో చూపించారు.

45
దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
Image Credit : Asianet News

దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గ్లింప్స్‌కు మరింత బలాన్ని తీసుకొచ్చింది. నాగార్జున లుక్, ఆయన పాత్రలోని యాటిట్యూడ్, భారీ బిజినెస్‌ సామ్రాజ్యం, స్కామ్‌లు, పవర్‌గేమ్‌ వంటి అంశాలను గ్లింప్స్‌లో చూపించిన విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది.

55
‘కింగ్ 100’ విడుదల తేదీ
Image Credit : Asianet News

‘కింగ్ 100’ విడుదల తేదీ

ఇక ‘కింగ్ 100’ విడుదల తేదీని కూడా మేకర్స్‌ ప్రకటించారు. డిసెంబర్‌ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నాగార్జున 100వ సినిమా కావడం, కార్తీక్ దర్శకత్వం వహించడం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ‘కింగ్ 100’పై అంచనాలు భారీగా ఉన్నాయి. పూర్తి స్థాయి కథ, పాత్రలు, ఇతర నటీనటుల వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image2
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image3
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image2
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved