MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ

Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఇంద్ర చిత్రం ఇప్పుడు అత్యుత్తమ 4కే యూహెచ్‌డీ క్వాలిటీలో అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు మరోసారి ఇంద్రసేనారెడ్డి మ్యానియాను ఆస్వాదించనున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 07 2026, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Indra 4k
Image Credit : Asianet News

Indra 4k

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరపురాని చిత్రాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. 2002లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో థియేటర్ల వద్ద భారీ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడగా, ఇంద్రసేనారెడ్డి పాత్రలో చిరంజీవి చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన డ్యాన్సులు, ముఖ్యంగా వీణ స్టెప్పు అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం చిరంజీవి స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అత్యాధునిక సాంకేతికతతో 4కే రీమాస్టర్డ్ వెర్షన్‌
Image Credit : Asianet News

అత్యాధునిక సాంకేతికతతో 4కే రీమాస్టర్డ్ వెర్షన్‌

ఇప్పుడు ఈ చిత్రాన్ని కొత్త తరం ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా నిర్మాత సంస్థ వైజయంతీ మూవీస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర చిత్రాన్ని అత్యాధునిక సాంకేతికతతో 4కే రీమాస్టర్డ్ వెర్షన్‌గా సిద్ధం చేసినట్లు సంస్థ వెల్లడించింది. పాత చిత్రాన్ని మెరుగైన విజువల్ క్వాలిటీతో అందుబాటులోకి తీసుకురావడం మెగాస్టార్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Related Articles

Related image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Related image2
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
33
ఇంద్ర ఫుల్ మూవీ 4కే యూహెచ్‌డీ వెర్షన్ యూట్యూబ్‌లో..
Image Credit : Asianet News

ఇంద్ర ఫుల్ మూవీ 4కే యూహెచ్‌డీ వెర్షన్ యూట్యూబ్‌లో..

సరికొత్త హంగులతో కూడిన ఇంద్ర ఫుల్ మూవీ 4కే యూహెచ్‌డీ వెర్షన్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉండనున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. థియేటర్లలో అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు యూట్యూబ్ లో అత్యుత్తమ క్వాలిటీలో చూసే అవకాశం ప్రేక్షకులకు లభించింది. చిరంజీవి అభిమానులతో పాటు అప్పట్లో ఇంద్ర మ్యానియాను ఆస్వాదించిన సినీ ప్రేక్షకులకు ఇది మరోసారి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసే సందర్భంగా మారనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Recommended image2
Movie Interval : సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? దీని వెనుక పెద్ద కథే ఉంది!
Recommended image3
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Related Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved