MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Karthika Deepam: సౌందర్య ఆనంద్ రావులను కలిసిన మోనిత.. కొత్త ఇంటికి చేరిన శౌర్య కుటుంబం!

Karthika Deepam: సౌందర్య ఆనంద్ రావులను కలిసిన మోనిత.. కొత్త ఇంటికి చేరిన శౌర్య కుటుంబం!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్  29వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

3 Min read
Author : Navya G
Published : Aug 29 2022, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మొనిత, ఈ నెల రోజుల్లో కార్తీక్ నాతో ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి. నేను గాని తిరిగి గట్టిగా మాట్లాడితే గతం గుర్తొచ్చేసేదేమో బయటకు వచ్చి మంచి పని చేశాను. ఇన్ని సంవత్సరాలు కార్తీక్ నాకు దక్కలేదు ఇదే నాకున్న చివరి అవకాశం ఎలాగైనా కార్తీక్ ని వదులుకోకూడదు, తలనొప్పిగా ఉంది వెంటనే వెళ్లి కాఫీ తాగాలి అని అనుకుంటుంది. అప్పుడు మొనిత హోటల్లోకి వెళ్తుంది. అదే హోటల్లో ఆనందరావు, సౌందర్య, హిమ ఉంటారు. హిమా,మోనితను చూసి సౌందర్యకు చెబుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అంతట్లో మొనిత కూడా వాళ్ళని చూస్తుంది. అప్పుడు మొనిత అక్కడికి వెళ్లి,ఎలా ఉన్నావు హిమా బాగున్నావా అని అడుగుతుంది అప్పుడు హిమా బానే ఉన్నాను అని అంటుంది ఎందుకలా డల్ గా ఉన్నావు అని అనగా కొంచెం తలనొప్పిగా ఉన్నది అని అంటుంది. వెళ్లి మొహం కడుక్కొని రా అమ్మ కొంచెం ఫ్రెష్ అవుతాది అని హిమని బయటికి పంపిస్తుంది మొనిత. అప్పుడు అక్కడ కూర్చుంటుంది. సౌందర్య, ఎలా ఉన్నావు ఇంకో పెళ్లి చేసుకున్నావా అని అడగగా నా కార్తీక్ దూరమైనా, తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను అని అంటుంది.
 

37

సౌందర్య కోపంతో ఇంకా ఆపు తెల్లచీర కట్టుకొని వెళ్ళావు, ఇప్పుడు రంగుల చీరలో కనిపిస్తున్నావు అని అనగా ఆ తెల్ల చీర కట్టుకుంటే అన్ని కార్తిక జ్ఞాపకాల గుర్తొస్తున్నాయి అందుకే రంగుల చీర కట్టేను అని అంటుంది. ఇంతట్లో కార్తీక్ ఫోన్ వస్తుంది ఎక్కడ సౌందర్య ఆ ఫోన్ కాల్ చూస్తుందేమో అని భయపడి ఫోన్ కట్ చేస్తుంది మోనిత. ఇంతలో,అయినా వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు దీప గురించి తెలిసిందా అని అనుకుని, ఎందుకు ఇక్కడికి వచ్చారు ఆంటీ అని అడుగుతుంది. సౌర్య గురించి చెప్తే మళ్ళీ ఇది ఏం చేస్తుందో చెప్పకపోవడమే మంచిది అని సౌందర్య మనసులో అనుకొని ఇక్కడే ప్రమాదం జరిగింది కదా అందుకే మనసు బాలేదని వచ్చాము అని అంటుంది. అంటే వీళ్ళకి దీపా కార్తీక్ గురించి తెలియదు అనమాట అని అనుకుంటుంది మోనిత. ఇంతట్లో  మళ్లీ కార్తీక్ నుంచి ఫోన్ వస్తుంది.
 

47

 కంగారుగా ఆ ఫోన్ ని దాచి నాకు ముఖ్యమైన కాల్ వచ్చింది నేను వెళ్తాను ఆంటీ అంకుల్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌందర్య,ఆనందరావు ఏదో తప్పు చేసినట్టు ఎందుకిలా భయపడుతూ వెళ్తుంది అని అనుకుంటారు.  ఆ తర్వాత సీన్లో ఇంట్లో దీప, మోనిత,శివని ఎత్తుకు వెళ్ళిపోవడం చూసి నాకన్నా ముందే డాక్టర్ బాబుని మొనిత కలుస్తాది.డాక్టర్ బాబు దాన్ని గుర్తుపడతారా లేకపోతే నన్ను మర్చిపోయినట్టే మర్చిపోతారా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతట్లో ఆ డాక్టర్ అక్కడికి వస్తాడు ఏమైంది అమ్మ అని అడుగు జరిగిందంతా చెప్పి అలాగే నాకు ఒక పని వెతుకు అన్నయ్య ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. బయటకు వెళ్తే హుషారు వస్తుంది అలాగే డాక్టర్ బాబు ని వెతికినట్టు ఉంటుంది అని అంటుంది. సరే అమ్మ అని అంటాడు డాక్టర్.
 

57

ఆ తర్వాత సీన్లో మొనిత బొటిక్ కి వస్తుంది. కార్తీక్ ఎందుకు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అని అనగా బిజీగా ఉన్నాను కార్తీక్ అని అంటుంది.కనీసం ఫోన్ చేస్తే ఎత్తి చెప్పాలి కదా అని అనగానే మీటింగ్ లో ఉన్నాను, అయినా ఫోన్ కట్ చేస్తే అర్థం చేసుకోవాలి కదా అని మొనిత అనగా మరి నేను బయటికి వెళ్ళినప్పుడు పది నిమిషాలకోసారి ఫోన్ చేస్తావు దాన్నేమంటారు అని చెప్పి చిరాకు పడి, అది కాదు మనం హైదరాబాద్ వెళ్తాము అని కార్తీక్ అనగా మొనిత కంగారుపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు అని అంటుంది. ఎందుకు ఏదో తప్పు చేసినట్టు అలా భయపడుతున్నావు, మన బోటిక్ కోసమే అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి అని అనగా అక్కడికి వెళ్తే సందుకొకడు నిన్ను గుర్తుపడతాడు ఏం అవసరం లేదు అని మనసులో అనుకోని అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కార్తీక్ నీకు మంచిది కాదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
 

67

 ఎందుకిలా మాట్లాడుతుంది పొల్యూషన్ కి నాకు ఏం సంబంధం అని అనుకుంటాడు కార్తీక్. తర్వాత సీన్ లో శౌర్య, ఇంద్రుడుతో ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని అంటుంది. నేను నీ మీద అలిగాను ఆ ఇల్లు మనకి కలిసి వచ్చేది నువ్వు అక్కడే దొరికావు, అయినా బలవంతంగా ఇంటికి తీసుకొచ్చేశావు అని అంటుంది. అప్పుడు ఇది కూడా కలిసి వస్తుందిలే పిన్ని భయపడొద్దు మనకు ఆటో కూడా వస్తుంది అని అంటుంది. మనసులో మాత్రం ఆ ఇంట్లో ఉంటే నానమ్మ తాతయ్యలు నన్ను తీసుకువెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు అందుకే ఇక్కడ ఉండడమే మంచిది అని అనుకుంటుంది. చంద్రుడు ఆటో తెస్తాడు అమ్మానాన్న ఎక్కడున్నారు రండి అని ఆ ఆటో వెనక  ఉంటుంది.
 

77

ఇవి చూసిన అమ్మ నాన్న నన్ను గుర్తుపడతారేమో ఈరోజు నుంచి ఈ ఆటో మన లక్ష్మీదేవి అని అనుకుంటారు. ఇంతట్లో ఇంద్రుడు చంద్రుడు కూడా నిజంగా వాళ్ళ అమ్మానాన్న ఉంటే ఈ ఆటం చూసైనా వస్తారు అని అనుకుంటున్నారు. ఇంతట్లో దీప, అత్తయ్య మావయ్యకు ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు వాళ్ళు పాపం నేను చనిపోయారు అనుకోని ఇంకా బాధపడుతూనే ఉంటారు. మరోవైపు ఈ మొనిత డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళిపోయింది నేను ఎలాగైనా డాక్టర్ బాబుని వెతకాలి కచ్చితంగా పట్టుకోవాలి అని అనుకుంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ
Recommended image2
Baby Do Die Do OTT: రామ్ చరణ్ కి నచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎందులో స్టీమింగ్ అంటే
Recommended image3
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved