MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు

Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు

చిరంజీవి ‘కాకా’ సినిమా గురించి ఓ ఈవెంట్‌లో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఇంతకీ ‘కాకా’ వెనుక దాగి ఉన్న అసలు కథేంటి? పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2026, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి గత సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో సందడి చేశారు. ఈ సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నారు. చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కాకా చిత్రం సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి భార్య పాత్రలో స్నేహ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టైటిల్ గ్లింప్స్ కి క్రేజీ రెస్పాన్స్
Image Credit : Asianet News

టైటిల్ గ్లింప్స్ కి క్రేజీ రెస్పాన్స్

ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో చిరంజీవి ఆక్వా కంపెనీలో పనిచేసే సూపర్ వైజర్ కె సత్యం పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో చిరంజీవి కాకా వెనుకున్న అసలైన టైటిల్ లీక్ చేశారు. ప్రముఖ యాంకర్ స్రవంతి చొకారపుని పొగిడే క్రమంలో చిరంజీవి టైటిల్ లీక్ చేశారు.

35
యాంకర్ ని పొగుడుతూ కాకా గురించి లీక్
Image Credit : Asianet News

యాంకర్ ని పొగుడుతూ కాకా గురించి లీక్

స్రవంతి ఊరి పేరుని నా సినిమాలో క్యారెక్టర్ గా పెట్టుకున్నాను అని చిరంజీవి అన్నారు. కాకా అంటే కదిరి కాళిదాస్ అని లీక్ చేశారు. దీనితో అక్కడ ఒక్కసారిగా చప్పట్లు, ఈలలు మారుమోగాయి. కానీ చిరంజీవి చేసిన ఈ లీక్ తో కథపై అనుమానాలు, థియరీలు మొదలయ్యాయి. చిరంజీవి క్యారెక్టర్ నేమ్ కదిరి కాళిదాస్ అయితే.. మరి కె సత్యం ఎవరు ? సో ఈ మూవీలో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోంది.

45
కథపై మొదలైన థియరీలు
Image Credit : Youtube Screenshot@KVNPRODUCTIONSOFFICIAL

కథపై మొదలైన థియరీలు

ఫ్లాష్ బ్యాక్ లో కదిరి కాళిదాస్ అనే గ్యాంగ్ స్టర్ గా.. ప్రజెంట్ లో సత్యంగా చిరంజీవి కనిపించబోతున్నట్లు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు థియరీలు మొదలు పెట్టారు.

కాకా… కదిరి కాళిదాస్ ❤️‍🔥❤️‍🔥❤️‍🔥#KAAKA - JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk

— Kaaka (@KaakaMovie) September 20, 2026

55
భారీ అంచనాలు
Image Credit : Asianet News

భారీ అంచనాలు

కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ కాకా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు, బాబీ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image3
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Related Stories
Recommended image1
Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved