MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: ఇదంతా కలా?... నకిలీ కడుపుతో సర్వ సుఖాలు అనుభవిస్తున్న మల్లిక!

Janaki kalaganaledu: ఇదంతా కలా?... నకిలీ కడుపుతో సర్వ సుఖాలు అనుభవిస్తున్న మల్లిక!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 25వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Aug 25 2022, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఈవిడకి కడుపు ఉన్నది అని ఏ డాక్టర్ చెప్పినా సరే నేను నా ఉద్యోగం మానేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ డాక్టర్. అప్పుడు జ్ఞానాంబ మల్లికవైపు చాలా కోపంగా చూస్తుంది మల్లికా అమాయకత్వంతో నటిస్తుంది. ఇంతటిలో మల్లికా నన్ను వదిలేయండి అత్తయ్య గారు నన్ను క్షమించండి అని అరుస్తూ నిద్రలేస్తుంది.ఇదంతా కాల అని అనుకుంటుంది. ఇంతట్లో విష్ణు బంగారం లాంటి నిద్రని చెడగొట్టావు కదే ఈ టైంలో ఎందుకు అరుపులు అని తిడతాడు. అప్పుడు మల్లికా ఉదయం పూట వచ్చే కలలు నిజమవుతాయట కదా నాకు భయంగా ఉంది జానకి తెలివితేటలు తో నిజం కనిపెట్టేస్తుందా ఈలోగే నేను ఏదైనా చేయాలి అని అనుకుంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆ తర్వాత రోజు ఉదయం రామ, జానకిని దింపడానికి అని రెడీ అవుతాడు. జానకి గారు టైం అవుతుంది రండి అని అంటాడు. ఇంతట్లో జానకి మల్లిక కి టిఫిన్ పెట్టి అక్కడికి వస్తుంది. మల్లిక మాత్రం జానకిని పరీక్షలు రాయకుండా ఉంచాలని నాకు జీడిపప్పు ఉప్మా కావాలి అని అంటుంది. ఇంతలో గోవిందరాజు అక్కడికి వచ్చి ఏం అవసరం లేదు పెట్టింది తిను కావాలంటే నువ్వే వెళ్లి చేసుకో అని జానకిని వెళ్ళమంటాడు. కానీ జానకి మాత్రం అత్తయ్య గారు మల్లికాకి ఏ పని చేయొద్దు అన్నారు కదా నేను చేస్తాను లెండి మావయ్య గారు పర్లేదు. ఇలాంటి పరీక్షలు ప్రతివారం ఉండేవే అని అంటుంది. కానీ జ్ఞానాంబ అక్కడికి వచ్చి నువ్వు వెళ్లి చదువుకో నేను వెళ్లి దానికి చేస్తాను ఉప్మా అని అంటుంది. పోలేరమ్మ తనకి తాను నాకు సేవలు చేస్తానంటే నేనెందుకు కాదంటాను అని మల్లికా మనసులో అనుకుంటుంది.
 

35

గోవిందరాజు మాత్రం నువ్వు ఈ సాకు పట్టుకొని బాగా కులాసాగా ఉన్నట్టున్నావు కదమ్మా నా చేత కూడా చేయించుకునేలా ఉన్నావే అని అంటాడు. ఆ తర్వాత సీన్లో జానకి, రామా ఇద్దరు బండిమీద కాలేజ్ కి వెళ్తున్నప్పుడు ఒక ఆవిడకి పళ్ళు తల పైన పెట్టడానికి సహాయం చేస్తారు. ఆ తర్వాత సీన్లో మల్లికా హాయిగా తింటూ ఉంటుంది ఇంతట్లో జ్ఞానంబ ఉప్మా చేస్తుంది.  ఇదే దొరికిందా అవకాశం అని మళ్లీకా ప్రతిరోజు ఏం కావాలో అన్ని చెప్తుంది .గోవిందరాజు, నీ పని బాగుందమ్మా అని అటకారిస్తాడు. ఇంతట్లో రామా, జ్ఞానాంబ కి ఫోన్ చేసి అమ్మ నాకు పక్క ఊర్లో పనున్నది కనుక ఇంటికి రావడం లేదు సాయంత్రం జానకి గారిని తీసుకుని వస్తాను అని అంటాడు.మరి స్వీట్ కొట్టు అని జ్ఞానం అడగగా ఈ రోజుకు ముసెయ్యడమే అని అంటాడు రామ.
 

45

ఫోన్ పెట్టి జరిగినది గోవిందరాజుకి చెప్పి ఎన్నో రోజుల కృషి ఈ స్వీట్ షాపు ఇలా మూయకూడదు అని నేను వెళ్తాను అని జ్ఞానం బయలుదేరుతుంది. ఆ తర్వాత సీన్లో జెస్సీ సాంప్రదాయంగా తయారయ్యి జానకికి ఎదురుపడుతుంది. అక్క మీ అత్తగారు సాంప్రదాయంగా ఉంటారట కదా అందుకే నేను నా పద్ధతులు మార్చుకుంటున్నాను. మీకు తోటి కోడలుగా ఉండాలంటే ఎలాగో చెప్పక్క అని అంటుంది. అప్పుడు జానకి మా అత్తయ్య గారికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆసకి కూడా ఆకాశమంత హద్దు ఉంటుంది. కనుక ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్లి చదువుకో ఇలాంటి విషయాల్లో నేను నీకు సహాయం చేయలేను జెస్సీ అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మల్లికా హాయిగా టీవీ చూసుకుంటూ పళ్ళు తింటూ ఉంటుంది.
 

55

ఇంతటిలో పక్కింటి పెద్దమ్మ వచ్చి ఈ సమయంలో మల్లిక ని పొగిడి కొంచెం డబ్బులు లాగేయాలి అని అనుకొని అదృష్టవంతురాలివి అన్ని పనులు చేయించుకుంటున్నావు అని పొగిడి 5000 కావాలి అని అడుగుతుంది. నీ వల్లే నేను ఇంత సుఖంగా ఉంటున్నాను పెద్దమ్మ అని మల్లికా 5000 ఇస్తుంది. అప్పుడు ఆవిడ మల్లిగాతో ఇప్పుడైతే సరిపెట్టుకున్నావు తర్వాత నీది నకిలీ కడుపు అని తెలిస్తే ఏం చేస్తావు అని అడగగా కడుపు లేనప్పుడే కడుపు అని చెప్పాను. జానకి మీద తోసిసి కడుపు తీసేసింది అని చెప్పలేనా. ఇటువైపు నామీద సింపతి వస్తుంది, ఇంకోవైపు జానకి సంగతి అయిపోతుంది అని అంటుంది. ఈ మాటలన్నీ జానకి రామ ఇద్దరు వింటారు.ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Monsoon Movies: వర్షం పడుతున్నప్పుడు భార్యాభర్తలు కలిసి చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
Recommended image2
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Recommended image3
Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved