MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్ ముందు అభిని అవమానించిన మాళవిక.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న యష్!

Ennenno Janmala Bandham: యష్ ముందు అభిని అవమానించిన మాళవిక.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న యష్!

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 2 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
Published : Dec 02 2022, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో మీకు గాయాలు తగల్లేదు మీ ఆవేశంలో మీరే చేసుకుంటున్నారు అని అనగా అంటే నీ ఉద్దేశం ఆ నీచున్నీ వదిలేయమనినా అని అంటాడు యష్. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం అవుతుంది అని అనగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు అని నేను కూడా చెబుతున్నాను అని అంటుంది వేద. అయినా మీ సమాధానం కోసం ఎదురుచూసి అలసిపోయాను మీ సమాధానం కోసం ఎదురు చూడటం లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది వేద. అప్పుడు వేద నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు ఎవరు నేను ఎవరు అని అంటాడు యష్. అదేం ప్రశ్న అనీ వేద అడగగా ఎవరు ఎవరికి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అంటాడు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

యశోదర్ కి వేద ట్రీట్మెంట్ చేస్తుంది అని అంటుంది. అంటే తన భర్తకు భార్య ట్రీట్మెంట్ చేస్తూ ఉందనే కదా అర్థం అని అంటాడు. ఏం కాదు ఒక పేషంట్ కి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తోంది అంతే అని అంటుంది వేద. అప్పుడు వెద అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఇంతలో మాళవిక ఫోన్ చేయడంతో జస్ట్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇందాకటి నుంచి నాకేదో చెప్పాలి అనుకుంటున్నారు కదా తనకి ఫోన్ చేసి చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఖుషి ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అక్కడికి చిత్ర వస్తుంది. ఏమయింది ఖుషి అని అడగగా మమ్మీకి కోపం వచ్చింది మూడ్ ఆఫ్ లో ఉంది అని అంటుంది.

37

డాడీ మీద ఫుల్ కోపంగా ఉంది డాడీ వస్తే చాలు మమ్మీ బుంగమూతి పెట్టుకుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అంటుంది ఖుషి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటుంది చిత్ర. మమ్మీ డాడీ ఇద్దరు ఒకటి ఇవ్వాలి ఇద్దరు పోట్లాడకుండా ఉండాలి ప్రేమగా ఉండాలి అని అంటుంది ఖుషి. ఇప్పుడు చిత్ర ఒక ఐడియా ఉంది అని పార్టీ అని చెబుతుంది. ఏం పార్టీ పిన్ని అని ఖుషి అడగడంతో, మీ డాడీ వాళ్లకు ఇక్కడే ఉంటే ప్రైవసీ ఉండదు ముగ్గురు కలిసి ఏదైనా హోటల్ కి వెళ్ళండి అని ఖుషి కి ఐడియా ఇచ్చి నవ్విస్తుంది చిత్ర. ఆ తర్వాత యష్ మాళవిక దగ్గరికి వెళ్తాడు.

47

ఏమయింది అని అడగడంతో ఆదిత్య గురించి భయంగా ఉంది ఫుల్ భయపడిపోయాడు వణుకుతున్నాడు అనీ మాళవిక అంటుంది. మమ్మి నువ్వు జైలుకు వెళ్లి పోతే నేను చచ్చిపోతాను అని ఏడుస్తుండడంతో నేను బుజ్జగించి పడుకోపెట్టాను అని అనగా యష్ బాధపడుతూ ఉండడంతో ఇంతలోనే అక్కడికి అభిమన్యు వస్తాడు. అప్పుడు వీడు నమ్మి పెద్ద తప్పు చేస్తున్నావ్ బంగారం అని అనగా వెంటనే ఇదంతా నీ వల్లే జరిగింది రా అని పోట్లాడుకుంటూ ఉండగా అప్పుడు మాళవిక తప్పే నేను యష్ నీ నమ్మి తప్పు చేశాను అయితే ఇప్పుడు ఏంటి అంట అని అడుగుతుంది.

57

నా భర్త నా కొడుకు నేను ఇది నా ఫ్యామిలీ నువ్వు పరాయి వాడివి అని అనడంతో అభిమన్యు ఒక్కసారిగా షాక్ అవుతాడు. తర్వాత అభి ఒకచోటకు వెళ్లి నన్ను ఇన్సల్ట్ చేస్తావా నాతోనే గేమ్స్ ఆడుతావా ఈ అభి అంటే ఏంటో నీకు చూపిస్తాను అనే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఖుషి మాలిని వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి మీరిద్దరూ నాకు హెల్ప్ చేయాలి అని అనగా ఏంటి బంగారం అది అని అడగడంతో మమ్మీ డాడీ తో కలిసి నేను డిన్నర్ పార్టీకి వెళ్తాను అని అంటుంది ఖుషి. మాలిని సరే అని అంటుంది. ఆ తర్వాత అక్కడికి యష్ రావడంతో నాన్న మనం బయటకు వెళ్దాం నాన్న అని అంటుంది ఖుషి. అప్పుడు యష్ ఒకరోజు వెళ్దాం అని అనగా లేదు ఈరోజే ఇప్పుడే వెళ్లాలి అని అంటుంది ఖుషి.
 

67

మనం వెళ్లాల్సిందే నేను ఎప్పుడూ ఏదో ఒకటి అడిగాను ఏదో ఒక సాగు చెబుతూనే ఉంటావు మనం వెళ్ళాలి అని మొండి పట్టు పడుతుంది కుషి. అప్పుడు ఆపు ఖుషి అని గట్టిగా పక్కకు నొక్కేస్తాడు. ఎవరి మీద కోపం వచ్చినా నా మీద చూపిస్తావు అని అంటుంది ఖుషి. ఈరోజు నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను నాన్న నేను చెప్పినట్టు నువ్వు ఈరోజు వినాల్సిందే ఈరోజు మనం కలిసి పార్టీకి వెళ్దాం అని అంటుంది ఖుషీ. ఇప్పుడు కనుక మీరు నా మాట వినకపోతే మీ మీద కోపం వస్తుంది నేను మీతో అమ్మతో ఇంట్లో ఎవరితో మాట్లాడను. నేను అన్నం తినను స్కూల్ కి వెళ్ళాను బ్యాడ్ గర్ల్ గా మారిపోతాను అని అంటుంది ఖుషీ. ఆ తర్వాత ఖుషి ఒక చోటికి వెళ్ళి దిగులుగా కూర్చుని ఉంటుంది. అప్పుడు యష్ వెళ్ళి మాట్లాడించగా నాతో మాట్లాడద్దు అని కోప్పడుతుంది.
 

77

అప్పుడు వేద కూడా నచ్చచెప్పడానికి ప్రయత్నించగా అమ్మ నేను నీతో కూడా మాట్లాడను నువ్వు నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించకు నేను మీ మీద అలిగాను మనం పార్టీకి వెళ్లాల్సిందే అని అంటుంది ఖుషి. ఆ తరువాత ఖుషి వాళ్ళు డిన్నర్ కి వెళ్లడానికి బయలుదేరుతారు. మరొకవైపు అభి మాళవిక అన్న మాటలు తలుచుకొని మందు తాగుతూ ఉంటాడు. అల్లు అర్జున్ పాటకు స్టెప్పులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి అభిమన్యునీ మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతాడు. ఆ తర్వాత ఖుషి వాళ్ళ ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు అందరూ మౌనంగా ఉండడంతో నాకు ఇక్కడ ఉండాలని లేదు ఎంజాయ్ చేయడానికి వచ్చాను కదా మరి ఏంటి ఇలా ఉంది ఇక్కడ అని అంటుంది ఖుషి. అప్పుడు ఖుషి యష్ వేదని కలపడానికి బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: కేన్స్ లో షాకిచ్చిన ఐశ్వర్యరాయ్, ఆమె లేటెస్ట్ లుక్ ఇదే.. ఇలా మారిపోయిందేంటి
Recommended image2
Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్
Recommended image3
Memu Copulam Review: నాగబాబు వెబ్‌సిరీస్ మేము కాప్‌లం ఎలా ఉందంటే? కామెడీ మెప్పించిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved